సాహితి

స్వాగతిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన సంవత్సరానికి స్వాగతిస్తూనే
నూతన ఆలోచనల సరళిని కూడా
స్వాగతమివ్వాలి
నూతన సంవత్సరమంటేనే హృదయం నిండా
నూతన భావాలతో కూడిన ప్రణాళికలను
సిద్ధపరచుకోవడం
కొత్త ఆశయాలకు జన్మనివ్వడం

ప్రతి ఉషోదయం హృదయాన్ని
ఆనందపరుస్తున్నప్పుడు
ప్రతి సంవత్సర ఆరంభం కూడా హృదయాన్ని
రంజింపజేస్తుంది
ఎందుకంటే ప్రతి మనిషి మార్పును కోరతాడు
నూతన సంవత్సరం జీవితంలో మార్పులు
తెస్తుందనీ
కలలు సాకారమవుతాయనే ఆశయంతో
కలిగి వుంటాడు

ఎప్పుడైతే హృదయం నిండా మబ్బులు
కమ్ముకుంటాయో
ఆ హృదయంలో జన్మించే ఆలోచనలకు అవరోధం
నల్లని వస్త్రంలా కప్పబడి వుంటుంది
ఎన్ని మబ్బులు అడ్డొచ్చినా సూర్యుడు మాత్రం
తనంతట తాను ఆ మబ్బుల తెరలను
చీల్చుకుంటూ
నూతన కిరణాలతో ప్రకాశిస్తాడు

అలాగే మనిషి కూడా హృదయంలోని
మబ్బు తెరలను చీల్చుకుంటూ
నూతన ఆలోచనలకు జన్మనివ్వాలి

తలపండిన రాజకీయ నాయకులు
ఎప్పుడూ మభ్యపెట్టే కొత్త కొత్త ఆలోచనలను
ఆవిష్కరించుకుంటారు
ఎందుకంటే ప్రజలను ఎప్పుడూ భ్రమలో
ఉంచడమే వారి విప్లవ ప్రయత్నం

ప్రజలు కూడా ఎప్పుడూ నూతన భావాలను
నూతన ఆలోచనల సరళిని పుణికిపుచ్చుకోవాలి
లేనిచో ఎక్కడ వేసిన తాళం
అక్కడే చిలుము పట్టడం ఖాయం

అందుకే నూతన సంవత్సరానికి
స్వాగతిస్తున్నప్పుడు
నూతన ఆలోచనల సరళిని కూడా
స్వాగతమివ్వాలి
*
- మొహ్మద్ నసీరుద్దీన్, కరీంనగర్