సాహితి

‘ఇట్లు.... నీ మానస పుత్రి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా.. ఎందుకిలా చేశారు
నేను ఆడపిల్లననేగా
ఇంత ఘాతుకానికి ఒడగట్టారు

నీ ప్రేమ పొరల్లో
మొలకగా వూపిరి పోసుకున్న
నన్ను
చిదిమి వేయడానికి మనసెలా వచ్చిందమ్మా?

నీ వెచ్చని గర్భంలోని
చిమ్మచీకటి ఆకాశంలో విహరిస్తూ
చిన్ని చిన్ని అవయవాల వెలుగులో
అద్భుత క్షణాల్ని అనుభవిస్తూ ఆనందించాను
అప్పుడప్పుడు
నీవు ఆలపించిన మధురమైన రాగాలను విని
మత్తులో జారిపోయాను తెలుసా...?
నన్ను నేను మరిచిపోయి
ఎన్ని యుగాలు నిదురబోయానో తెలియదమ్మా

నీవు
నాన్నతో పోట్లాడినదంతా విన్నానమ్మా
నన్ను
బతికించుకోవాలన్న ఆరాటంలో
నీవు చేసిన పోరాటం అంతా తెలిసిందమ్మా
నేను ఆడపిల్లననేగా, మీకు ఇంత నిర్లక్ష్యం
నేను చేసిన పాపమేమిటో చెప్పమ్మా
ఆడపిల్లగా వూపిరి పోసుకోవడమే
నేరమంటావా అమ్మా?
నీకు నాకు వున్న
పేగుబంధాన్ని కసుక్కున్న కత్తిరిస్తుంటే
అమ్మా..
చాలా నొప్పితో చచ్చిపోయానమ్మా
నాలో
సముద్రాలన్నీ కల్లోలితమై
అక్కడి తీరప్రాంతాన్ని ముంచేశాయి తెలుసా
కకావికలమైన నా వూపిర్లు
నింగిని శిథిలం చేస్తూ
ముక్కలు ముక్కలుగా రాలిపోయాయి.
అమ్మా
నా గుండె ఛిద్రమై రక్తపు మడుగులో
దిక్కులేని దుఃఖమై
అచేతనా నిశ్శబ్దంలోకి జారడం
భరించలేక పోయానమ్మా

నా మరణ శాసన ప్రస్థానంలో
వినిపిస్తున్న విషాదగీతానికి
స్వరకల్పన చేసిందెవరమ్మా
నా మిసిమి దేహం తునాతునకలై
విశ్వగర్భంలో చేరిన నేను
ఆసుపత్రిలో అస్తమించినా
నీ గుండెలో
ప్రతిరోజూ ఉదయిస్తూనే వుంటాను
అమ్మా... సరేనా... ఉంటాను

- కెరె జగదీష్, 9440708133