సాహితి

ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నం ముందు
ఆకలితో కూర్చున్నా
‘‘ఈ నాలుగు ముద్దలు
నా ఆకలిని ఓదార్చగలవా?’’ అనుమానం.

‘‘అదైతే తిను’’ అన్నట్లు ఆమె.
అక్కడికే సరిపోయింది.
నా ఆకలి ఆమెకు తెలిసినంతగా
నాకు తెలియదు.

జీవితంలో పైకి తేలే
విషాదపు అలల్ని
చిరునవ్వులతో కప్పేసినా
సబ్‌మెరైన్‌లా హృదయాంతరంలోకి చేరి
మనసుపై నవ్వుల జెండాల్ని ఎగరేస్తుంది
ఇద్దరు పిల్లల్ని కన్నది
ముగ్గురికి తల్లినని మురిసిపోతుంది
సందిగ్ధాన్ని దగ్ధం చేస్తూ
ముడిపడిన నుదుటిపై ముద్దుపెడుతూ
నన్ను వడిలోకి తీసుకుంటుంది.
అర్ధాంగో అమ్మో అర్థం కాదు.

- కేతిరెడ్డి యాకూబ్‌రెడ్డి, 9989584549