సాహితి

విష వలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీకటి రాత్రి
తెరలు తెరలుగా జరిగే
ఉల్కాపాతం లాగ
కుప్పలు తెప్పలుగా
సమాచారం
పనికొచ్చేవి పది, పనికిరానివి వేలు, లక్షలు
విలోమ గణితం
తుప్పలు దుబ్బులుగా పెరిగిన పిచ్చిమొక్కల్లోంచి
పూల మొక్కల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి
బ్రేకింగ్ న్యూస్
బీపిని బ్రేక్‌డ్యాన్సు చేయస్తూ
ఫ్లాష్ ఫ్లాష్.. అంటూ ఫ్లష్ అవుట్‌లా చెత్త
చిత్తాన్ని చిందర వందర చేస్తూ
విషయాల వలయం
విష వలయం
సమాచారపు ట్రాఫిక్ జాంలో
ఉక్కిరిబిక్కిరయ్యే మెదడు
ఊపిరాడనివ్వని
మాటల కాలుష్య కాలకూటం
మరి ఇపుడంతా
మెసేజ్‌ల మెసయ్యలే!
అప్పుడెపుడో
పిట్టగోడల దగ్గర నిలబడి
అమ్మలక్కల ఉబుసుపోని వూసులు
ఎండ పొడ తగిలితే చెదిరిపోయేవి
ఇపుడైతే కమోడ్ల మీద కూర్చుని కూడా
సెల్‌లో సొల్లు కబుర్లే!
టెక్నాలజీ ఖర్మ ఇలా కాలిపోయంది!
ప్రతివాడికి సెల్లొక
ఆధునిక అపిండెక్స్
ఈ సమాచార అతిసారని అరికట్టే
మందేదో
కాలవైద్యుడే చెప్పాలి!

- ఎస్. హనుమంతరావు 8897815656