సాహితి

అర్థ వైనాశికం ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జాతి మనుగడ ప్రారంభించిన క్షణం నుంచీ - ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని విధాలుగా తలెత్తాయో - ఎన్ని రకాలుగా తల వాల్చాయో; ఏ సిద్ధాంతాలు యుద్ధాలు - ఉత్పాతాలు సృష్టించి ఎంత రక్తపాత కారకాలయ్యాయో - ప్రజలే పాత్రధారులు. ప్రజలే కార్యకారణ సంబంధ వస్తుకాండము. పరిణామం కూడా పరిణామగ్రస్తమనే యదార్థ జ్ఞానం లేని మూర్ఖుల చేతుల్లోబడి ఎన్ని విలువలు నాశనమయ్యాయో మళ్ళీ ప్రజలే కారణం. ప్రజల ఆత్మవంచనకొక యదార్థ విషయాన్ని ఉటంకిస్తాడు. ‘జనగణమన’ అని దురదృష్టకరమైన జాతీయ గీతంలో ఉద్దేశించిన ‘అధినాయకు’డెవరు? ‘్భరత భాగ్యవిధాత’ ఎవరు? జన్మభూమిని తల్లిగానే సంభావించుకుంటాం గదా. ‘జననీ జన్మభూమిశ్చ సర్గాదపి గరీయసి’యని గదా పద్మపురాణ సూక్తి. స్ర్తిలింగ శబ్దమే కదా జన్మభూమి - అటువంటి మాతృభూమిని అధినాయక శబ్దంతో సంబోధించగలమా? భాగ్యవిధాతగా ఊహించగలమా? కాబట్టి ఆ గీతార్థం తల్లి భారతినుద్దేశించి చెప్పినది కాదని స్పష్టంగానే తెలుస్తోంది. కానీ విశ్వకవిగా కీర్తించబడుతున్న రవీంద్రనాధుడు ఎవర్నో కీర్తించిన భక్తి తాత్పర్యాన్ని భారతదేశ జాతీయ గీతంగా మార్చివేశారు. ప్రజలూ అంగీకరించారు. తెలుగు రచయిత గురజాడ కూడా అంతే. ఇప్పుడు ఈ ప్రజల శీలం ఏ కోణంలోంచి ఏవిధంగా చర్చనీయాంశవౌతుందో చెప్పండి. రవీంద్రనాథ్ టాగోర్ - గురజాడ అప్పారావు ఎటువంటి దేశభక్తులు? వీరి దేశభక్తికి ఏ యోగ్యత ప్రామాణ్యవౌతుంది? పదవుల అధికార దాహానికి ప్రజలు - ప్రజల అవకాశ వాదానికి పదవులు పరస్పరారోపితాలు అయి ఇష్టారాజ్య వైఖరినే స్పష్టపరుస్తుంటే ‘అవినీతి’ని ఏవిధంగా ఎవరు పరిష్కరిస్తారు? ఈ నల్లధనాన్ని ఎవరు వెలికితీస్తారు? గొంగట్లో అన్నం తింటున్నాం. స్వార్థ పరమార్థంగా మనం ఇష్టపడే ఈ భోక్తృత్యాన్ని అంగీకరించాం. ఇది ఈ కారణంగానే సమష్టి రూపం సంతరించుకుంది. సంతరించుకున్న ఈ మనో వైక్లబ్యమే ఆహార్యమై నిలబడిపోయింది. ఏ శాఖకాశాఖ తన ప్రభావాన్ని సమాజగతం చేసింది. ఇదంతా సమత్వమనో - స్వేచ్ఛయనో - నాగరికతయనో సమాధానపడిపోయాం. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ సత్వమై పోయింది. అందులో ఒక శాఖా విభాగమే సాహిత్యం. రచనలో ప్రస్ఫుటమయ్యే అక్షర విన్యాస వైఖరి గురించి ప్రస్తావించిన యం.వి.ఆర్.శాస్ర్తీగారి వ్యాసం (ది.11-4-2016 - సాహితి) ‘తెలుగు భాషకు బ్రహ్మరథం’ కొంత ఇటువంటి విషయ చర్చనే లేవదీసింది. ఐతే అతి ముఖ్యమైన మాట (రాయడం - రాత)ను వారు సైతం ప్రయోగ యోగాన్నుంచి తప్పించలేకపోయారు. నిజానికి ‘రాత’ అనే పదానికి ‘పతిత’ అనే అర్థం. ‘వ్రాత’ మాత్రమే వ్రాయబడాలి. పత్రికలు, భాషా వినియోగంలోకి వచ్చేసరికి గ్రామ్యంగా భావించే కొన్ని పదాలను, పద బంధాలను సంస్కరించి వదిలారు. ఇంగ్లీషు మాటలకర్థం తెలుగులో వెతికారు తప్ప, తెలుగు మాటను తెలుసుకునే యోగ్యతను దూరం చేసుకున్నారు. నిజమెప్పుడు నిష్ఠూరమే. ఈ దరిద్రమంతా మన తెలుగుకు పట్టిన తెగులు.

- సాంధ్యశ్రీ, 8106897404