రాష్ట్ర వార్తలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22: నందమూరి తారక రామారావు 2011 సంవత్సరం రంగస్థల పురస్కారానికిగానూ ప్రముఖ రంగ స్థల నటుడు, ప్రయోక్త, గుంటూరు జిల్లాకు చెందిన కెఎస్‌టి శాయిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి డికె అరుణ తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కెఎస్‌టి శాయి తెలుగు నాటక రంగానికి నటునిగా, దర్శకునిగా, రచయితగా గత 65 సంవత్సరాలుగా విశిష్టసేవలు అందిస్తున్నారు. మరోవైపు నాటక రంగంపై రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉత్తమ పుస్తకాలకు సంబంధించి, 2010 సంవత్సరానికి ప్రముఖ రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, 2011 సంవత్సరానికి డాక్టర్ చిట్టినేని శివ కోటేశ్వరరావును ప్రభుత్వం ఎంపిక చేసింది. 25వ తేదీన గుంటూరులో జరిగే నంది నాటకోత్సవాల బహుమతి ప్రదానోత్సవ సభలో అందిస్తారు.
Add new comment