క్రీడాభూమి

గాయాలతో ఇబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఈఏడాది తన కెరీర్‌లోనే అత్యుత్తమ సీజన్‌లలో ఒకటైనప్పటికీ, గాయాలతో చాలా ఇబ్బంది పడ్డానని, లేకపోతే మరికొన్ని టైటిళ్లను కైవసం చేసుకుని ఉండేదానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నీ, ప్రపంచ బాడ్మిండన్ చాంపియన్‌షిప్, చైనా ఓపెన్‌లో ఫైనల్ చేరినప్పటికీ టైటిళ్లను సాధించలేకపోవడం తనను నిరాశకు గురి చేసిందని పిటిఐతో మాట్లాడుతూ 25 ఏళ్ల ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి, హైదరాబాదీ సైనా తెలిపింది. ఈ నెల 9 నుంచి మొదలయ్యే దుబాయ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాలి కండరాలు బెణకడంతో వైద్యుల సలహాను అనసరించి రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నానని చెప్పింది. ఇప్పుడు ఫిట్నెస్‌తోనే ఉన్నానని చెప్పింది. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సైనా తెలిపింది. లక్షలాది మంది అభిమానులు తన విజయాన్ని కోరుతున్నారని అన్నది. వారి అంచనాలకు తగ్గట్టు ఆడేందుకు శ్రమిస్తానని చెప్పింది.