క్రీడాభూమి

‘ట్రంప్ మ్యాచ్’లు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిబిఎల్ టోర్నీపై సైనా నెహ్వాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కొత్తగా ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’లు ఈసారి ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో కీలక పాత్ర పోషిస్తాయని అవాధే వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్న భారత స్టార్ షట్లర్, మహిళల ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. సోమవారం పిటిఐతో ఆమె మాట్లాడుతూ క్రిస్టినా పెడెర్సెన్ (డెన్మార్క్), సాయి ప్రణీత్ (్భరత్), కెయ్ యున్ (చైనా), హెండ్రా గునవాన్ (ఇండోనేషియా), బొడిన్ ఇసారా (్థయిలాండ్) వంటి మేటి ఆటగళ్లతో తమ జట్టు పటిష్టంగా ఉందని చెప్పింది. జనవరి రెండు నుంచి ప్రారంభంకానున్న పిబిఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. టోర్నీలో ప్రతి జట్టుకూ ‘ట్రంప్ మ్యాచ్’ టర్నింగ్ పాయింట్ అవుతుందని అన్నది. ఈ టోర్నీలో అవాధే వారియర్స్‌తోపాటు ఢిల్లీ ఏసర్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్ గన్స్, చెన్నై స్మాషర్స్, ముంబయి రాకెట్స్ జట్లు తలపడతాయి. తొలి మ్యాచ్‌లో అవాధే, ముంబయి రాకెట్స్ జట్లు ముంబయిలో ఢీ కొంటాయి.