ఈ వేసవి నాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత అంటే తెలుగులో టాప్‌స్టారే. కిందపడ్డా పైన పడ్డా ఆమెదే విజయం అన్నట్టుగా సమంత హవా సాగుతోంది. ఇటీవల దాదాపుగా ఓ నాలుగైదు నెలల నుండి సమంత పేరు ఎక్కడా వినబడకపోవడం విచిత్రం. ఎందుకంటే ఆమె సినిమాలేవీ విడుదల కాలేదు. ఒకవేళ విడుదలైనా కానీ అవి సోదిలో లేకుండాపోవడంతో సమంత పేరు వినబడలేదు. కానీ ఇప్పుడలా కాదు ఈ వేసవి కాలమంతా నాదేనంటోంది సమంత. విషయంలోకెళితే ప్రస్తుతం తెలుగులో రెండు భారీ చిత్రాలతోపాటుగా, తమిళంలో కూడా రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది. విజయ్ కథానాయకుడుగా నటించిన ‘తెరి’, సూర్యతో నటించిన ‘24’ చిత్రం ఈ వేసవికి తమిళనాడులో విడుదల కానున్నాయి.
అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నితిన్‌తో చేసిన ‘అ.. ఆ’, మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు విడుదలకు సిద్ధవౌతున్నాయి. ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీస్థాయిలో వుండడం విశేషం. ఆ విధంగా ఈ వేసవి అంతా సమంతదే అన్నట్లుగా అయింది. ఈ నాలుగు చిత్రాల్లో సమంత హవా ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే!