సంపాదకీయం

భద్రతా ఛిద్రాలు ఎన్నెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘లిఫ్ట్’లో చిక్కుపడిపోవడం కలవరం కలిగించిన ఘటన!హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో సోమవారం ‘్థరిస్సా’ అన్న వైద్య శాలలో లిఫ్ట్ కూలిపోవడం భద్రతా రాహిత్యానికి ఒక ఉదాహరణ మాత్రమే! జంటనగరాలలోని ప్రభుత్వ ప్రభుత్వేతర భవనాలలో ప్రాంగణాలలో సార్వజనిక స్థలాలలో రహదారులలో ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు పొంచి ఉండడం జీవన వ్యవహారంలో భాగమై ఉండడం నడుస్తున్న చరిత్ర! కరెంటు తెగిపోయి వేలాడుతూ ఉన్నాయి, బస్సు స్టాపులలో ఇనుప దిమ్మెలు భూమినుండి పైకి పొడుచుకుని వచ్చి ఉన్నాయి. ఈ కరెంటు వేలాడే తీగలలో విద్యుత్ ప్రసరిస్తూ ఉందో లేదో తెలీదు. తీగలు తట్టుకొని పాదచారులు బొక్కబోళ్ల పడిపోవడం పరిపాటి. స్వల్పగాయాలతో బయటపడే సామాన్యులకు ప్రచార మాధ్యమాలలో చోటు ఉండదు! తెగిపడిన తీగెలలో విద్యుత్ ప్రవాహం పరుగులు తీస్తున్నప్పుడు అవి సామాన్యుల ప్రాణాలను హరిస్తున్నాయి! బస్‌స్టాపులలో హడావుడిగా బస్సులెక్కడానికి పరుగులు తీసేవారిలో ఎందరో అక్కడ నిక్కపొడుచుని వున్న ఇనుప దిమ్మెలను కాళ్లతో ఢీకొట్టి పడిపోతున్నారు. లేచేలోగా బస్సులు వెళ్లిపోతున్నాయి, కాళ్లకు గాయాలతో ప్రయాణీకులు కుంటుకుంటూ పోతున్నారు. ఇదంతా పదిహేను ఏళ్ల క్రితమే నమూనా నగరంగా, ఆదర్శ నరకంగా మారిన భాగ్యనగరపు భద్రతా సౌలభ్యం! వంతెనలు విరిగిపోతున్నాయి! రోడ్లు అకస్మాత్తుగా కుదించుకుని పోయి పెద్ద పెద్ద గోతులు ఏర్పడిపోతున్నాయి. పాఠశాలల్లో, విద్యాశాలలలో, ఆసుపత్రులలో, ప్రభుత్వ కార్యాలయాలలో మెట్ల పక్కన ఉండే రైలింగ్‌లు పిట్టగోడలు ముట్టుకుంటే కూలిపోయే స్థితిలో ఉన్నాయి! సినిమా హాళ్లలోను, అనేక ఇతర చోట్ల ఈ రైలింగ్‌లలోని పెద్ద పెద్ద కన్నాల గుండా చిన్న పిల్లలు మెట్లపైనుండి కిందికి పడిపోయిన ఘటనలు కోకొల్లలు! మురుగుకాలువలకు గోడలు లేవు..తెరిచి ఉన్న ఈ కాలువలలోకి పగటిపూటే జనం పడిపోతున్నారు! చీకటిలో, వీధి దీపాలు వెలగని వీధుల పక్కన ఉండే మురికి కాలువలు మృత్యు గహ్వారాలు! తెరచి ఉన్న మురికి కాలువలకంటె మూసి ఉన్న మురికి గొట్టాలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ మురికి గొట్టం పగిలిపోతుందో ఎవ్వరికి తెలుసు? కానీ మురికి గొట్టాలను నియంత్రించడానికై ఏర్పడి ఉన్న మానవ బిలాలు-మాన్‌హోల్స్-ఎక్కడెక్కడ తెరుచుకుని ఉన్నాయో తెరిచిన వారికి తెలుసు! పని పూర్తయిన తరువాత ఈ మానవ బిలాలను ఎందుకని మూయరన్నది అంతుపట్టని సమస్య! నిర్లక్ష్యం...ఎన్నోసార్లు ఈ బిలాలలో పడి జనాల ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ నిర్లక్ష్యం వదలడంలేదు!
సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలోని లిఫ్ట్ కూలిపోయినప్పటికీ ఆ లిఫ్ట్‌లో ఉండిన మంత్రి తలసానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఉపశమనం కలిగించిన పరిణామం! ఆయనకు స్వల్పంగా గాయాలు అయ్యాయట! మంత్రులు ఇతర ఉన్నత ప్రభుత్వ ప్రతినిధులు లిఫ్ట్‌లో ఎక్కినప్పుడు సైతం నిర్వాహకులు అజాగ్రత్తగానే ఉన్నారనడానికి ఇది నిదర్శనం. లిఫ్ట్ తలుపులు పగులకొట్టి మంత్రిని ఆయన వెంట ఉన్నవారిని సురక్షితంగా బయటకు చేర్చగలగడం హర్షణీయం! కానీ కూలిపోవడానికి సిద్ధంగా వున్న లిఫ్ట్‌ను ఇన్నాళ్లపాటు వైద్యశాల యాజమాన్యం ఇంత కాలం పట్టించుకోలేదన్నది వౌలికమైన వైపరీత్యం! జంటనగరాలలోని ఎన్ని వైద్య శాలలలో ఇలాంటి తుప్పుపట్టిన లిఫ్ట్‌లు ఉన్నాయన్నది సంబంధిత అధికారులు ఇఫ్పుడైనా తనిఖీలు జరిపి పసికడతారా? అన్నది సమాధానం లేని ప్రశ్న! బహుళ అంతస్తుల నివాస భవనాలలో ఏర్పాటైన లిఫ్ట్‌లను పాతబడిన తరువాత తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేసే వ్యవస్థలు లేవు! సార్వజనిక స్థలాలలో ఏర్పాటైన లిఫ్ట్‌లలో పరిమితికి మించి జనం ఎక్కిపోతుండడం నిత్యదృశ్యం! ఇది కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానికి పరిమితమైన సమస్య కాదు. లిఫ్ట్‌లు కూలిపోవడం జనం ప్రాణాలు కోల్పోవడం గాయపడడం దేశమంతటా జరిగిపోతున్న వైపరీత్యాలు! అంతస్థుల భవన సముదాయాలను, అంతస్థుల గృహ సముదాయాలను నిర్మిస్తుండడంవల్ల ఏర్పడు అనేక వైపరీత్యాలలో లిఫ్ట్‌లు కూలిపోవడం ఒకటి మాత్రమే! ఇటీవల తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కూడ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఇలాగే లిఫ్ట్‌లో చిక్కుకుని పోయాడు! ప్రారంభోత్సవం నాడే ఆ వైద్యశాలలో లిఫ్ట్ అలా ఆగిపోవడం భద్రతపట్ల నిర్లక్ష్యానికి మరో కొలమానం..మంత్రుల రాజకీయ వేత్తల వెంట వెళ్లే అభిమానులు అనుయాయులు పరిమితికి మించి లిఫ్ట్‌లలో ఎక్కడంవల్ల కూడ లిఫ్ట్‌లు ఆగిపోవడానికి కూలిపోవడానికి కారణమన్నది ఆరోపణ! మరి మంత్రులు తమ అనుచరులను నియంత్రించలేరా? అయితే లిఫ్ట్‌లు కూలిపోవడానికి ఈ ఓవర్‌లోడింగ్ ఒక సాకు మాత్రమే! నిర్వహణ లోపం వల్ల అవి తుప్పుపట్టిపోవడం ప్రధాన కారణం!
అగ్ని నిరోధక-ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేని అంతస్థుల భవనాలు భాగ్యనగరంలోనే కాదు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. కలకత్తాలో, విశాఖలో, మదరాసులో ముంబయిలో...అనేక వైద్యశాలలలోను ఇతర సార్వజనిక స్థలాలలోను అగ్నిజ్వాలలు అనేకమందిని ఆహుతికొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదాలు తరచు సంభవించాయి! హైదరాబాద్‌లోని వాణిజ్య భవన సముదాయాలలో అగ్ని జ్వాలలు చెలరేగడం మొన్న, నిన్న, నేటి కథలు.. నమూనా నగరంలోని అనేక అంతస్తుల భవనాలలో అగ్నిమాపక వ్యవస్థ లేదన్నది అధికారంగా నిగ్గుతేలిన వ్యవహారం. వాణిజ్య భవన సముదాయాలలో నేరాలను నిరోధించడానికి వీలుగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలను నిరోధించడానికి వీలుగా అగ్నిమాపక వ్యవస్థ మాత్రం ఏర్పడడం లేదు! ప్రమాదం జరిగినపుడల్లా దూర ప్రాంతాలనుండి అగ్నిమాపక వాహనాలు తరలివచ్చేసరికి భవనాలు భస్మీపటలమైపోతున్నాయి. ఉమ్మడి రాజధానికి మంచినీటిని సరఫరా చేస్తున్న రిజర్వారయర్ల వద్ద చెరువుల వద్ద నిఘా లేదన్నది తరచు వినబడుతున్న ఆరోపణలు! ఇలా నిఘా లేకపోవడం వల్లనే గతంలో ముంబయి వంటి చోట్ల టెర్రరిస్టులు జలాశయాలను విషపూరితం చేయడానికి ఫ్రయత్నించిన ఘటనలు జరిగాయి. విదేశీయ ఉగ్రవాద ముఠాలు తిష్ఠవేసి ఉన్న హైదరాబాద్‌లో జలాశయాలవద్ద, నీటిసరఫరా వ్యవస్థల వద్ద నిఘాను పెంచడం ప్రభుత్వం వారి కర్తవ్యం...
రాజధానిలోను తెలంగాణ రాష్ట్రంలోను అక్రమంగా నిర్మించిన భవన సముదాయాలను క్రమబద్ధీకరించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది! అయితే అక్రమంగా నిర్మించిన అంతస్థుల భవనాలలో భద్రత భద్రంగా ఉందా అన్నది కూడ అధికారులు గమనించవలసి ఉంది! కానీ వేలాది అక్రమ భవనాల క్రమబద్ధీకరణ ఇప్పటికే ముగిసిపోయింది! అగ్నిప్రమాదాలను నిరోధించే వ్యవస్థలు ఎన్ని అక్రమభవనాలకున్నాయన్నది ఎప్పటికీ తేలదు! వాణిజ్య ప్రకటనల పేరుతో నగరమంతటా నిండి ఉన్న హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు భద్రతా ధ్యాసను భంగపరుస్తుండడం మరో వైపరీత్యం! నడిచేవారికి వాహనాలు నడిపే వారికి కూడ ఈ వాణిజ్య ఫలకాలు దిక్కుతోచని స్థితిని కల్పిస్తున్నాయి. బ్రిడ్జీల మీద వాహనాలు ఢీకొంటున్నాయి. ఇలాంటి ఫ్లెక్సీలను, బోర్డులను తొలగించాలని గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ హైకోర్టు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది...ఈ ఆదేశాలను ప్రభుత్వాలు అమలుజరిపాయా!!