సంపాదకీయం

ప్రగతికి ప్రేరకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 2016-2017 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన ఆదాయ వ్యయ పత్రం సర్వతోముఖ ప్రగతికి ముసాయిదా చిత్రం! ఈ సర్వతోముఖ ప్రగతి ఎప్పటికి సాక్షాత్కరిస్తుందన్నది వేచి చూడదగిన అంశం. కొన్ని ప్రగతి కార్యక్రమాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే వాస్తవాలుగా మారి దృశ్యమానం కానుండగా మరికొన్ని పూర్తి కావడానికి దీర్ఘకాల ప్రణాళికలు ఏర్పడనున్నాయి. ఈ దీర్ఘకాల వ్యవధి 2029 వరకు విస్తరించి ఉండడం అద్భుతమైన వాగ్దానం...అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ దీర్ఘకాల ప్రక్రియ ఫలితాలు ఎంత శాతం ప్రస్ఫుటిస్తాయన్నది ఊహాగానాలకు ఊపిరిపోస్తున్న పరిణామం. వచ్చే సంవత్సరంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇళ్ల విద్యుదీకరణ పూర్తి కానున్నదట! ప్రభుత్వానికి తక్షణం మంచి పేరు తెచ్చిపెట్టగల కార్యక్రమం ఇది! ప్రభుత్వానికంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంచి పేరు తెచ్చిపెట్టడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎక్కువ కృషి చేసినట్టు కార్యక్రమాల స్వరూప స్వభావాల వల్ల విదితవౌతున్న, విలక్షణమైన అంశం! చంద్రన్న బాట, చంద్రన్న చేయూత వంటి శీర్షికలు ఉదాహరణలలో కొన్ని మాత్రమే! మంచిపేరు ప్రభుత్వానికి వచ్చినప్పటికీ ప్రభుత్వాధినేతకు లభించినప్పటికీ గతుకులు లేని రంగు దారి గుండా ప్రజా ప్రగతి రథం పరుగులు తీయడం ప్రధానం! గతుకులకు అతుకులు పడతాయా అన్నది వేచి చూడదగిన వ్యవహారం! కాపు సామాజిక వర్గం ప్రగతి సంక్షేమాల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం తన నిరసన దీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం 2016-17వ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలవల్ల అవశేషాంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒనకూడిన తక్షణ ప్రయోజనం! కాపుల సంక్షేమానికి వచ్చే యేడాది వెయ్యి కోట్ల రూపాయలు ఖ ర్చు పెట్టాలని నిర్ణయించడం వ ల్ల ముద్రగడ పద్మనాభం తన దీక్షను వాయిదా వేసుకోవడమన్నది ప్రభుత్వనుకూల ప్రచారం! ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంటె వచ్చే ఏడు పదిరెట్లు ఎక్కువగా కాపుల సంక్షేమానికి నిధులు కేటాయించడం యనమల ఆవిష్కరించిన ప్రతిపాదన. అయితే విద్యార్థుల పరీక్షల కారణంగా మాత్రమే ముద్రగడ తన దీక్షను వాయిదా వేసినట్టు కూడ ప్రచారవౌతోంది! బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాంతాలకూ అన్యా యం జరిగిపోయిందన్న ఆరోపణను సంధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం మరో తక్షణ పరిణామం! బడ్జెట్ వైఫల్యాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం అరుదైన అద్భుతం! ఎందుకంటే శాసనసభలో బడ్జెట్‌ను నిరాకరించడం ద్వారా ప్రభుత్వాన్ని అభిశంసించే అవకాశం ఉంది! మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం సమయాన్ని వృధా చేయడమే! కానీ ఆర్భాట ప్రదర్శనలో ఔచిత్యాలకు తావులేదు.
గత ఏడాది కంటె బడ్జెట్ పరిణామం ఈ ఏడాది పెరగడం ప్రగతి సూచకం! ఇరవైశాతం పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ గణాంకాలు మాత్రం పెరుగుదల శాతం అంతకంటె తక్కువేనని సూచిస్తున్నాయి! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శేషించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలహీనపడి ఉండడం చారిత్రక వాస్తవం! అవశేషాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌లో గురువారం ఆవిష్కృతమైనది మూడవది! ఈ ప్రభుత్వ పదవీ కాలంలో మరో రెండు బడ్జెట్‌లు రూపొందనున్నాయి. అందువల్ల మధ్యమ వార్షిక యోజన ఇది! మధ్యంతర ప్రగతి సమీక్షా సమయం ఇది! మొదటి బడ్జెట్ కంటె రెండవ బడ్జెట్ పరిణామం, దానికంటె ప్రస్తుత బడ్జెట్ పరిణామం పెంచగలగడమే గొప్ప విషయం. ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల ప్రాతిపదికగా పరిమాణ ప్రగతి ఇరవై శాతం విస్తరించలేదు! అయినప్పటికీ దాదాపు లక్షా ముప్పయి ఆరువేల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగలగడం సాహస కృత్యం. దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల లోటును ఎలా భర్తీ చేసుకుంటారన్నదే అంతుపట్టని వ్యవహారం...
అవశేషాంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ పరిమాణం లక్షా పనె్నండు వేల కోట్ల రూపాయలు! ప్రణాళికా వ్యయం ఇరవై ఏడువేల కోట్ల రూపాయలు! మొత్తం వ్యయంలో ఇది ఇరవై నాలుగు శాతం మాత్రమే! 2015-16వ సంవత్సరం బడ్జెట్ పరిమాణం లక్షాపదమూడు వేల కోట్ల రూపాయలు. ఆంటే గత ఏడాది కంటె నడుస్తున్న ఏడాదిలో పెరిగింది దాదాపు శూన్యం. కానీ ప్రణాళికా వ్యయాన్ని ముప్పయి ఐదు వేల కోట్లకు పెంచారు. మొత్తం వ్యయంలో ఇది దాదాపు ముప్పయి రెండు శాతం! వచ్చే ఏడాది బడ్జెట్‌పరిమాణం లక్షా ముప్పయి ఆరువేల కోట్లు కాగా నలబయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రణాళికకు కేటాయించారు. మొత్తం వ్యయంలో ఇది దాదాపు ముప్పయి ఆరు శాతం. ఇలా ప్రణాళికా వ్యయాన్ని ఏటికేటికీ పెంచగలగడం అభినందనీయం! ప్రణాళికేతర వ్యయం పెరగడం వల్ల ప్రజాకర్షక తాత్కాలిక సంక్షేమ పథకాలు అమలు జరుగవచ్చు! కానీ అది నిజమైన ప్రగతి కాదు. ప్రణాళికా వ్యయాన్ని పెంచడంవల్ల మాత్రమే వౌలికమైన ప్రగతి వికసిస్తుంది. ఇలా దీర్ఘకాల ప్రగతి కోసం ఎక్కువ నిధులను కేటాయించడం సాహసం! 2014-15లో ఇరవై నాలుగు శాతంనుండి 2016-17లో ముప్పయి ఆరు శాతానికి ప్రణాళికా వ్యయం పెరిగింది! ప్రణాళికేతర వ్యయాన్ని ఇంత భారీగా ఎలా తగ్గించగలిగారన్నది అంతుపట్టని వ్యవహారం! రెండేళ్ల క్రితంనాటి స్థాయిలోనే ప్రణాళికేతర వ్యయం చేస్తారట..అప్పుడూ ఇప్పుడూ కూడ ప్రణాళికేతర వ్యయం దాదాపు ఎనబయి ఆరువేల కోట్లు! సంక్షేమ పథకాలకు నిధులను పెంచిన తరువాత కూడ ఇలా ప్రణాళికేతర వ్యయాన్ని ఎలా అదుపు చేయగలిగారు? బడ్జెట్ పరిమాణంతోపాటు బడ్జెట్ లోటు కూడా పెరిగింది. రెవిన్యూ లోటును పూడ్చుకొనడానికై గత రెండేళ్లలోను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడవలసి వచ్చింది! అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన నిధులను మంజూరు చేయడంలేదు! గురువారం బడ్జెట్ ప్రతిపాదనలను సభల ముందు ఉంచిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయం అర్ధించడం కోసం ఢిల్లీకి వెళ్లడానికి కారణం కేంద్ర ప్రభుత్వం వారి ఈ పట్టించుకోని తనం...
ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించడం ఇది మొదటిసారి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించే సంప్రదాయానికి శ్రీకారం జరిగింది! కర్నాటక రాష్ట్రం స్ఫూర్తితో ఇలా వ్యవసాయ బడ్జెట్‌కు అంకురార్పణ జరిగింది! అయితే ఈ వ్యవసాయ బడ్జెట్‌కు సంబంధించిన పదహారు వేల కోట్ల రూపాయలు సాధారణ బడ్జెట్ వ్యవసాయానికి జరిగిన కేటాయింపులలో భాగమా? లేక అదనంగా ఈ మొత్తాన్ని కేటాయించారా? వ్యవసాయమంత్రి పి.పుల్లారావు శాసనసభలో చేసిన ప్రసంగంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు! అదనపు నిధులు కానప్పుడు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించడంవల్ల ఒనకూడే ప్రయోజనం ఏమిటి?? గత ఎడాది కంటె ఈ సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయిందన్నది వ్యవసాయ బడ్జెట్‌లోని ప్రధాన అంశం...