సంపాదకీయం

బీభత్స వహ్ని క్రీడ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్లక్ష్యం నిప్పుల జడిని కురిపించింది, వందమందికి పైగా మాడిమసైపోయారు, పూజలు చేయడానికి వచ్చి మందిరం ప్రాంగణంలోనే భస్మరాసులుగా మారిపోయారు. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా పర్‌పూర్ గ్రామంలోని పుట్టింగల్‌దేవీ ఆలయ ప్రాంగణం మృత్యువాటికగా మారడానికి క్రూరమైన నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు...ఒకేసారి వంద పిడుగులు పడిన రీతిలో మండుతున్న బాణసంచా పైనుండి జనం మీదకు దూసుకురావడం ఈ బీభత్స పదార్ధ పరిమాణ విస్తృతికి సాక్ష్యం. అంత పెద్ద పేలుడు శకలం పడిన చోట నిలబడిన ముప్పయి ఐదుమంది మరుక్షణం కాలిపోయిన మాంసఖండాలు..ముప్పయి ఐదు మందిని క్షణాలలో మసి చేసిన విలయానలం ఆలయ ప్రాంగణంలో నిలువ ఉంచిన బాణ సంచా గిడ్డంగులను ముంచెత్తి భయంకర విస్ఫోటనాలను సృష్టించింది. ఈ విస్ఫోటనాలవల్ల మరో డెబ్బయి మంది సజీవ దహనమయ్యారు. వందలాదిమంది క్షతగాత్రులు సగం కాలిన దేహాలతో చేసిన ఆర్తనాదాలు పైశాచిక మృత్యువికటాట్టహాసాలు...బాణసంచా భారీ విన్యాసాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారులు ఆ ప్రాంగణంలోనే టన్నుల కొద్దీ పేలుడు పదార్ధాలను నిల్వ చేయడమే క్రూరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఇలాంటి ప్రదర్శనలు-అగ్నితో ఆడటం దేవాలయ ప్రాంగణానికి దూరంగా సువిశాల మైదానాలలో ఏర్పాటు చేయడం కూడ ప్రమాదకరం. రామలీలా వంటి ఉత్సవాల నిర్వహణ సమయంలో పరిమిత పరిమాణంలో పేలుడు పదార్ధాలను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ జనానికి పేలుడు ప్రదర్శనల మధ్య అంతరం తగినంత ఉండేలాగ నిర్వాహకులు శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ పరవూర్‌వంటి మారుమూల గ్రామంలోని ఇరుకైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అనల క్రీడలను నిర్వహించడం దుర్బుద్ధి పూర్వకమైన బీభత్సకాండ! టన్నులకొద్దీ పేలుడు పదార్ధాలను తరలించి దేవాలయ ప్రాంగణంలో నిలువ చేయడం ఈ బీభత్స కాండలో భాగం. ఇలాంటి ఘోరకృత్యానికి ఒడిగట్టినవారిపై హత్యానేరాభియోగం మోపి శిక్షించడం చాలదు. వారిని ఉగ్రవాద నిరోధక చట్టాల ప్రకారం విచారించి శిక్షించాలి! పేలుళ్లు జరిపించి పరారీ అయిన నిర్వాహకులను అరెస్టు చేసిన తరువాత విచారణ పూర్తయి శిక్షలు అమలయ్యే వరకు బెయిల్‌పై విడుదల చేయరాదని కేరళ ప్రభుత్వం న్యాయస్థానాలను కోరాలి!
పోలీసులు కాని, పాలనా అధికారులు కాని ఈ బాణసంచా పోటీలకు అనుమతి ఇవ్వకపోవడం గురించి గొప్పగా ప్రచారం అవుతోంది. కానీ వివిధ రాష్ట్రాలలోను ప్రధానంగా తమిళనాడులోను దక్షిణాదిలో పటాకులు బాణసంచా తదితర వినోద విస్ఫోటన పదార్ధాలు భయంకర విషాదాన్ని సృష్టించడం సమీప గతం...ఈ విషాద విస్ఫోటనాలు ఎప్పటికప్పుడు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. దీపావళి బాణసంచా తదితర పేలుడు ఆటవస్తువులు తయారీ చేస్తున్న కర్మాగారాల ప్రాంగణాలలో అనేకసార్లు విస్ఫోటనాలు సంభవించి విపరీతమైన జననష్టం జరిగింది. ఐదేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన అగ్నిప్రమాదాలకు లక్షమందికి పైగా ఆహుతి ఐపోయినట్టు గణాంక విశే్లషణలు వెలువడినాయి. కేరళలోనే 2014లో దాదాపు రెండు వందల డెబ్బయి మంది ప్రమాదాగ్ని జ్వాలలకు ఆహుతయ్యారట! అందువల్ల అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం ప్రధానం కాదు. మృత్యువుతో చెలగాటమాడిన ఈ పేలుడు పోటీలను కేరళ ప్రభుత్వం నిరోధించి ఉండాలి! నిషేధించడంతో ప్రభుత్వ బాధ్యత తీరిపోయిందా?
పుట్టింగల్ దేవీ మందిర ప్రాంగణంలోను పరిసరాలోను ఎలాంటి బాణసంచా పేలుడు పోటీలు జరగరాదని నిషేధం విధించిన కొల్లం జిల్లా కలెక్టర్ ఈ ఆజ్ఞను అమలు జరపడానికి వీలుగా తగినంతమంది పోలీసులను ఆ ప్రాంతానికి పంపించి ఉండాలి! ప్రమాదం విరుచుకుని పడినప్పుడు పోలీసులు ఏం చేశారు? ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు? అన్న విషయమై వివరాలు ప్రచారం కాలేదు! ఒక నిషేధాజ్ఞను విధించినప్పుడు అది ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు సహజంగానే అనుమానించి ఉండాలి! అందువల్ల తగినంత మంది వెళ్లి పేలుడు పోటీలను ఆరంభంలోనే అడ్డుకుని ఉండాలి! ఎందుకని అడ్డుకోలేదు? రాత్రంతా పేలుళ్లు, పేలుడు పోటీలు కొనసాగాయన్నదానికి తెల్లవారుజామున ఈ భయంకర ప్రమాదం జరగడమే నిదర్శనం. అంటే పోలీసులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి రాలేదు, వచ్చినవారు వౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు! నిషేధం విధించిన జిల్లా అధికారులు ఆతరువాత దాన్ని గురించి పట్టించుకోలేదు. కేరళ ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడ పరోక్షంగా ఈ నిర్లక్ష్య ధోరణిని ప్రోత్సహించారు. నిషేధాన్ని కఠినంగా అమలు జరపడానికి ప్రభుత్వం పూనుకొని ఉంటే భక్తాదులు రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడి ఉండేదని కేరళ ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది! అలా రెచ్చిపోయిన భక్తాదులపై పోలీసులు లాఠీ చార్జీలను జరిపి ఉండినా, ఇతర నిరోధక చర్యలను చేపట్టి ఉండినా ప్రతిపక్షాలు తమను దుమ్మెత్తిపోసి ఉండేవారని అధికార పార్టీవారు అంటున్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన స్థానిక నాయకుల ఒత్తడి ఫలితంగానే నిషేధం నీరుకారిపోయిందన్నది సోమవారం ప్రచారమైన రహస్యం. నిషేధం విధించి కఠినంగా అమలు జరిపినట్టయితే ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వోటర్లు తమను వ్యతిరేకించే ప్రమాదం ఉందని ప్రభుత్వ పక్షంవారు భయపడ్డారట! అతి కొద్ది మెజారిటీతో మాత్రమే కేరళ శాసనసభా స్థానాలను ఏదో ఒక కూటమివారు గెలుచుకొనడం దశాబ్దుల చరిత్ర. అందువల్ల జిల్లాలలోని కొన్ని వేల వోటర్లు వ్యతిరేకంగా ప్రభావితం అయినప్పటికీ తమతమ బలాలు తారుమారు అయిపోగలవని కాంగ్రెస్ నాయకత్వంలోని అధికార కూటమికీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమికి కూడ సమాన భయం! ఈ భయం మాత్రమే భక్తాదులను మృత్యు జ్వాలలలోకి నెట్టి ఉంది. ధైర్యంగా ప్రభుత్వం వారు పోటీలను ఆపించి వేసి ఉంటే, వందకు పైగా బతుకులు బుగ్గిపాలు కాకుండా ఉండేవి! నిఘా వైపల్యం కారణంగా అసాంఘిక శక్తులు భక్తులలో కలిసిపోయి రాక్షసానందం పొందడానికి వీలుగా ప్రమాదానికి దోహదం చేసి ఉండవచ్చు! విదేశాల ప్రభుత్వాలు ఉసిగొల్పుతున్న ఉగ్రవాదుల వ్యూహాలు కార్యాచరణ పద్ధతులు ఎలా ఉంటాయన్నది ఊహింపరాని వ్యవహారం. ప్రమాదవశాత్తు కూలిపోతున్న విమానాలు కూల్చివేతకు గురి అయ్యాయని ప్రపంచ వ్యాప్తంగా ధ్రువపడుతోంది. ప్రమాదం జరిగిన తరువాత ముప్పయి ఆరు గంటలకు ఆలయం పరిసరాల్లో పేలుడు పదార్ధాలు నిండిన మూడు వాహనాలు కనిపించాయట...అవి ఎవరివి?
పోలీసులు ప్రభుత్వాలు రాజకీయ పక్షాల వైఫల్యం మాత్రమే కాక తీర్థయాత్రికుల తీరుకూ వివిధ రకాల ప్రమాదాలకు దోహదం చేస్తోంది. భక్తి తగ్గి, తాత్త్విక చింతన అడుగంటిన వారు కేవలం ఉత్సవబుద్ధులై ఆర్భాటపు ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆర్భాటపు చిత్తవృత్తి అంత పెద్ద ఎత్తున బాణసంచాను తగలబెట్టించింది. నీరు, నిప్పు దేవతలు...్భక్తితో శ్రద్ధతో అవసరం కొద్దీ వారిని ఉపయోగించుకుంటే నీరు ప్రాణం పోస్తుంది, నిప్పు ప్రాణాన్ని రక్షిస్తుంది! లేనట్టయితే....