సంపాదకీయం

‘జనకపురి’కి మోదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య నుంచి జనకపురికి నేరుగా బస్సు సర్వీసు ప్రారంభం కానుండడం చరిత్రగతిలో సరికొత్త అధ్యాయం. అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో ఉంది, జనకపురి నేపాల్‌లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర, శనివారాల్లో నేపాల్‌లో జరుపనున్న పర్యటన సందర్భంగా ఈ బస్సు సర్వీసు ప్రారంభవౌతోంది. అయోధ్య నుంచి జనకపురికి వెళ్లే మార్గం త్రేతాయుగంలో రఘురాముడు, లక్ష్మణుడు నడచిన దారి! విశ్వామిత్ర మహర్షి వెంట ఈ దశరథ పుత్రులు అయోధ్య నుంచి జనకపురికి తరలివెళ్లడం యుగాలుగా సజీవంగా ఉన్న చారిత్రక స్మృతి. భారత, నేపాల్ జనజీవన ద్యుతి. మోదీ పర్యటన సందర్భంగా ఈ స్మృతి పరిమళం మరోసారి గుబాళించనుంది. మోదీ జనకపురిని సందర్శించి జానకీమాత మందిరంలో ప్రత్యేక పూజలు జరుపనున్నాడు. ముక్తినాథ్ క్షేత్రాన్ని, పశుపతినాథ మందిరాన్ని కూడ ఆయన దర్శించనుండడం భారత, నేపాల్ మధ్య యుగాల నాటి సాంస్కృతిక బంధానికి వినూతన శోభను సంతరించి పెట్టనున్న శుభ పరిణామం. నేపాల్‌లో మన ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న ‘అరుణ’ జలవిద్యుత్ ఉత్పాదక కేంద్రం మూడవ విభాగానికి మోదీ శంకుస్థాపన చేయనున్నాడట. నేపాల్ వాణిజ్యం మన దేశం గుండా నడుస్తోంది. నేపాల్‌కు ఇతర దేశాల నుంచి, ఇతర దేశాలకు నేపాల్ నుంచి రాకపోకలు తొంబయి శాతం మన దేశం గుండా జరుగుతున్నాయి. అనాదిగా హిమాలయ పర్వతశ్రేణి మన దేశపు ఉత్తరభాగాన నెలకొని ఉంది. ‘హిమాలయం మన దేశానికి ఉత్తరాన లేదు’, ‘హిమాలయం మన దేశంలోని ఉత్తర భాగాన ఉంది’. ఇది స్పష్టమైన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక వ్యూహాత్మక వాస్తవం. ‘అస్తి ఉత్తర స్యాందిశి దేవతాత్మా హిమాలయోనామ నగాధి రాజః’ ఈ దేశపు ఉత్తరభాగాన దేవతల ఆత్మ అయిన హిమాలయం అనే పర్వతరాజు ఉన్నాడన్నది మహాకవి కాళిదాసు క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో చేసిన నిర్ధారణ. టిబెట్ నేపాల్ భూటాన్ వంటి ప్రస్తుత స్వతంత్ర దేశాలు హిమాలయ పర్వత శ్రేణిలో ఒదిగిఉన్నాయి. హిమాలయంతో పాటు ఇవన్నీ అనాదిగా భరతఖండంలోని ప్రాంతాలు, భారత సామ్రాజ్యంలోని రాజ్యాలు. ప్రస్తుతం రాజకీయపుటెల్లలు మారినప్పటికీ నేపాల్ భూటాన్ టిబెట్ దేశాలకు ‘అవశేష భారత్’తో సాంస్కృతిక సమానత్వం కొనసాగుతోంది. ఈ సాంస్కృతిక జాతీయ సమానత్వం నేపాల్‌తో మనకున్న ప్రత్యేక బంధం. మోదీ పర్యటన కేవలం దౌత్య రాజకీయ వాణిజ్య ప్రయోజన బద్ధమైనది కాదు, సనాతన సంస్కృతి నిబద్ధమైనది కూడ..
భారత, నేపాల్ మధ్య నెలకొని ఉన్న ఈ ప్రత్యేక సంబంధాలను చెడగొట్టడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తుండడం మోదీ పర్యటనకు వర్తమాన నేపథ్యం. నేపాల్ ప్రభుత్వం దాదాపు పదేళ్లుగా భారత, చైనాల మధ్య సమానత్వాన్ని పాటించడానికి ఏకైక కారణం చైనా కమ్యూనిస్టు నియంతల పన్నాగం. చైనా కమ్యూనిస్టు పార్టీకి ‘తోక’ అయిన నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీవారు ప్రధానంగా మావోయిస్టు మహానేత పుష్పకమల్ దహల్ ప్రచండ ఈ పదేళ్లుగా నేపాల్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తుండడం చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణలో భాగం. టిబెట్‌ను 1959లో కబళించిన నాటి చైనా ప్రభుత్వం నేపాల్‌లోకి చొరబడడానికి పొంచి ఉంది! టిబెట్ స్వతంత్ర దేశంగా ఉన్న సమయంలో చైనాకు, నేపాల్ మధ్య సరిహద్దు లేదు, భూటాన్‌కు చైనాకు మధ్య సరిహద్దు లేదు. భారత్‌కు, చైనాకు మధ్య టిబెట్ నెలకొని ఉండేది. టిబెట్‌ను చైనా దిగమింగడం వల్ల చైనాకు మనతోను, నేపాల్‌తోను భూటాన్‌తోను సరిహద్దు ఏర్పడింది. అప్పటి నుంచి చైనావారు నేపాల్‌లో దురాక్రమణ సాగిస్తున్నారు. వ్యూహాత్మక దురాక్రమణ భౌతిక దురాక్రమణకు పూర్వరంగం. నేపాల్‌లో మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ అవతరణ చైనా సాగిస్తున్న దురాక్రమణలో కీలక పరిణామం.
అవతరించిన తర్వాత పదేళ్లపాటు మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీవారు సాయుధ పోరు పేరిట నేపాల్‌లో భయంకర బీభత్సకాండను సృష్టించారు. 2004 వరకూ సాగిన ఈ బీభత్సకాండకు పదమూడు వేలమంది నేపాల్ భధ్రతా దళాలవారు, పౌరులు బలయ్యారు. నేపాల్‌లో కూడ చైనా తరహాలో ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం మావోయిస్టుల లక్ష్యం. దీనికోసం దశాబ్దిపాటు నేపాల్‌ను రక్తసిక్తం చేశారు. 1950లో నేపాల్‌కు, మనకు కుదరిన ‘శాంతి, స్నేహ అంగీకారం’ తరతరాల భౌగోళక భద్రతా వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ. ఉభయ దేశాలు పరస్పరం ‘్భద్రత’తో ముడివడి ఉన్నాయి. నేపాల్ భద్రతకు ‘ఇరుగు పొరుగు’ దేశాల వల్ల భంగం కలిగితే భారత భద్రతకు కూడ అది విఘాతకరం. ఒప్పందంలోని రెండవ అధికరణం స్ఫూర్తి ఇది. చైనా దురాక్రమణ నుంచి రక్షించవలసిన బాధ్యత మన దేశానికుంది. మావోయిస్టులు ఈ వ్యూహాత్మక దురాక్రమణకు మాధ్యమం. వీరు 1950 నాటి ఒప్పందాన్ని రద్దు చేయాలని ఇరవై ఏళ్లకు పైగా కోరుతున్నారు. 2005లో ఆయుధాలను విసర్జించి ప్రజాస్వామ్య నిబద్ధతను ప్రకటించిన మావోయిస్టు పార్టీవారు 2008 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలను నియంత్రించగలుగుతున్నారు. 2013లో నేపాల్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా పార్లమెంటులో అవతరించింది. మూడవ స్థానంలో ఉన్న మావోయిస్టు పార్టీ రెండవ స్థానంలోని మార్క్సిస్టు లెనినిస్ట్ కమ్యూనిస్టు పార్టీతో కలసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. 2008-2013 మధ్యకాలంలో నేపాల్ కాంగ్రెస్‌కు చెందిన రామ్‌భరణ్ యాదవ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. దీంతో కమ్యూనిస్టులు ప్రధాని పదవిని నిర్వహించినప్పటికీ భారత వ్యతిరేకతను వెళ్లగక్కలేకపోయారు. ప్రస్తుతం అధ్యక్ష, ప్రధాని పదవులు రెండూ ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమి వారు నిర్వహిస్తున్నారు. నూతన రాజ్యాంగం అమలు జరిగాక గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు విడివిడిగా కాక కలసికట్టుగా పోటీ చేసి గెలిచారు.
హిందీ మాతృభాషా సముదాయమైన ‘మాధేశీ’ ప్రజల హక్కులకు నేపాల్ ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. 1949 నాటి వాణిజ్యం, రాకపోకల’ ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా చైనా నుంచి ఇంధనతైలం దిగుమతి కోసం యత్నిస్తోంది. చైనా ప్రతిపాదించిన ‘కొత్త పట్టుమార్గం’- న్యూ సిల్క్ రోడ్- వన్ బెల్ట్ వన్ రోడ్- పథకంలో చేరాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించడం విస్మయకర పరిణామం. ఈ నేపథ్యంలో జరుగుతున్న మోదీ పర్యటన ప్రజల మధ్య మాత్రం ఎడతెగని స్నేహసంబంధాలను స్ఫురింపజేస్తోంది. త్రేతాయుగంలో రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు అయోధ్య నుంచి జనకపురికి తరలివెళ్లారు. జనకపురిలో సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు, మాండవీ భరతులకు, శ్రుతకీర్తీ శత్రుఘు్నలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇదీ ఉభయదేశాల ప్రజల మైత్రికి యుగయుగాల ప్రాతిపదిక..