సంపాదకీయం

రష్యా మైత్రికి గీటురాయి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరు చక్కగా మాట్లాడుతోంది- అన్న వాస్తవానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని, సోమవారం గట్టిగా కౌగిలించుకొని, రష్యాలోని ‘సోచీ’ నగరంలో తొమ్మిది గంటలపాటు మన ప్రధానమంత్రితో కలసి రష్యా అధ్యక్షుడు వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం చిరునవ్వుల పువ్వుల పరిమళ విన్యాసాల ‘అనౌపచారిక’ ప్రదర్శనం. భారత, రష్యా దేశాలు దశాబ్దుల తరబడి గొప్ప మైత్రీ బంధంలో ముడిపడి ఉన్నాయి. ఈ ‘గాఢాలింగన బంధం’ కొంత సడలిపోవడం దశాబ్దిగా ప్రస్ఫుటిస్తున్న ‘ప్రత్యేకత’... నరేంద్రమోదీ సోమవారం జరిపిన మైత్రీ యాత్రకు ఇదీ విచిత్రమైన పూర్వరంగం. పుతిన్ మంచివాడు, సాహసోపేతమైన కలాపాలను నిర్వహించిన విచిత్ర చరిత్రకలవాడు. జపాన్‌లో ఒక ఎనిమిదేళ్ల బాలికతో ద్వంద్వ యుద్ధంచేసి క్షణాలలో కిందపడి దొర్లినవాడు, గుర్రాలనెక్కి దౌడుతీయడం, జింకల దూడలకు పాలు పట్టడం, కుక్కలను ప్రేమతో లాలించడం వంటి మానవీయ కలాపాలు నిర్వహించిన భూతదయాపరుడు! ‘‘ఇరాక్‌లో మీరు నెలకొల్పిన తరహా ప్రజాస్వామ్యం మాకొద్దులేవయ్యా...!’’ -అని 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ను రష్యా రాజధాని మాస్కోలోనే బహిరంగంగా ముఖంమీద కొట్టినవాడు పుతిన్! పాశ్చాత్య దౌత్య ‘‘నాగరిక పద్ధతుల’’ను చైనా రాజధాని బీజింగ్‌లో ఆవిష్కరించబోయి ముఖం మీద కొట్టించుకున్నవాడు పుతిన్... చైనా అధ్యక్షుని భార్యను పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొనడానికి యత్నించడం ఈ విచిత్రమైన, వికృతమైన పాశ్చాత్య ‘‘నాగరిక’’ దౌత్య సంప్రదాయం. నరేంద్రమోదీతో పుతిన్ జరిపినది అనౌపచారిక- ఇన్‌ఫార్మల్- సమావేశం కనుక పుతిన్ గతంలో నెరపిన అనౌపచార కార్యక్రమాలు స్ఫురించడం సహజం! కానీ ఈ అనౌచారిక గాఢాలింగనం వెనుకనుంచి పుతిన్ ఆరంభించిన భారత వ్యతిరేక విధానాలు తొంగిచూస్తుండడం ప్రచారం కాని వ్యవహారం. నరేంద్రమోదీ సోచీ నగరంలో పుతిన్‌తో కలిసి అనేక మైత్రీ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఉభయులూ కలిసి భోజనం చేశారు. పాఠశాల విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు. నల్ల సముద్రంలో పడవెక్కి పయనించారు. జలాశయాల తీరంలో విహరించారు! ఇప్పటివరకు ఉభయ దేశాల మధ్య కొసాగుతున్న ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం’’ ఈ సోచీ సమావేశంవల్ల ‘‘ప్రత్యేక స్థాయి కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యం’’- స్పెషల్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్-గా విస్తరించిందన్నది నరేంద్రమోదీ చేసిన నిర్ధారణ. పద్దెనిమిది ఏళ్ల క్రితం అప్పటి మన ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నాటిన ఈ ‘వ్యూహాత్మక భాగస్వామ్య’ బీజం ప్రస్తుతం మహా వటవృక్షంగా విస్తరించిందన్నది మోదీ సోచీలో పుతిన్‌కు గుర్తుచేసిన వాస్తవం.
భారత-రష్యా సంబంధాలను రష్యా-చైనా సంబంధాలు ప్రభావితం చేస్తుండడం నరేంద్రమోదీ పర్యటనకు విచిత్రమైన నేపథ్యం. రష్యానుంచి మన ఆయుధాల దిగుమతులను యుద్ధసామగ్రి దిగుమతులను తగ్గించి తమ ఎగుమతులతో మన దేశాన్ని ముంచెత్తాలని అమెరికా యత్నిస్తుండడం రష్యాతో మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి విఘాతకరమైన వాస్తవ వైచిత్రి... పాకిస్తాన్‌తో ఆరు దశాబ్దులకు పైగా అంటీముట్టని రీతిలో వ్యవహరించిన రష్యా ఇటీవలి కాలంలో ఆ దేశంతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకొంటోంది. సైనికపరమైన ఆయుధ సహకారాన్ని ప్రారంభించింది. ఇదంతా పద్దెనిమిది ఏళ్లుగా రష్యాను నియంత్రిస్తున్న పుతిన్ విధానాల ఫలితం. జీవన పర్యంతం తాను అధ్యక్షుడుగా ఉండడానికి- ఎన్నిక కావడానికి వీలుగా- పుతిన్ రాజ్యాంగ సవరణ చేయించాడు. చైనాలో తాను అజీవన నియంతగా ఉండడానికి వీలైన సవరణను ప్రస్తుత అధినేత ఝీజింగ్‌పింగ్ చేయించిన సమయంలోనే పుతిన్ కూడ తమ దేశంలో ఈ విచిత్ర ప్రజాస్వామ్య సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. పుతిన్‌కూ ఝీజింగ్‌కూ మధ్య నెలకొన్న ‘‘వ్యూహాత్మక వ్యక్తిగత స్నేహం’’ ఇదీ.... అమెరికా తదితర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ‘రష్యా-చైనా’ల కూటమి అంతర్జాతీయ వేదికపై తలపడుతోండడం దశాబ్దికి పైగా నెలకొన్న వ్యూహాత్మక దృశ్యం.... అమెరికా కూటమి ప్రాబల్యాన్ని నిరోధించడమే లక్ష్యంగా పుతిన్ చైనాతో జట్టుకట్టి ఉన్నాడు. సిరియాలో దశాబ్దులపాటు ప్రజావ్యతిరేక బీభత్స పాలనను కొనసాగిస్తున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రష్యా చైనాలు ఉమ్మడిగా కృషిచేస్తుండడం అమెరికా వ్యతిరేకతకు పరాకాష్ఠ! అందువల్ల ‘‘వటవృక్షం వలె విస్తరించిన’’ భారత రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా మన దేశానికి వ్యతిరేకంగా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణను నిరోధించడానికి ఏమేరకు ఉపకరించగలదన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న.
నరేంద్రమోదీ, వ్లాడిమిర్ పుతిన్ ఇలా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తుండిన సమయంలోనే చైనా మన అరుణాచల్‌లోకి చొరబడి గనులను తవ్వడానికి సిద్ధమైంది. అరుణాచల్, టిబెట్‌లలో విస్తరించిన ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న బంగారం, వెండి తదితర ఖనిజాలను ‘అనే్వషణ’ పేరుతో చైనా తవ్వుకుంటోంది. ఈ ఖనిజ సంపద విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు! ఇదీ చైనా వ్యూహాత్మక దురాక్రమణ! పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో చైనా ఇప్పటికే నిర్మిస్తున్న ‘ఆర్థిక వాణిజ్య ప్రాంగణం’-ఎకనామిక్ కారిడార్ - ఈ వ్యూహాత్మక దురాక్రమణలో భాగం. మన ప్రభుత్వం పదే పదే అభ్యంతరం చెప్పినప్పటికీ చైనా మాత్రం ఈ ‘దురాక్రమణ’ను ఆపడం లేదు. దీర్ఘకాలికమైన ఈ భారత వ్యతిరేక చైనా వ్యూహం విషయంలో రష్యా వైఖరి ఏమిటన్నది అంతుపట్టని వ్యవహారం. ఇలా పాకిస్తాన్ దురాక్రమిత కాశ్మీర్‌లో చైనా ప్రమేయం మొదలైన తరువాతనే రష్యా పాకిస్తాన్‌కు సన్నిహితం కావడం మొదలైంది. దశాబ్దుల తరబడి మన దేశం రష్యానుంచి భారీఎత్తున యుద్ధ సామగ్రిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో అమెరికా సైనిక కూటమిలోని పాకిస్తాన్‌ను రష్యా దూరంగా ఉంచింది. కానీ 2014లో - నలబయి ఐదేళ్ల తరువాత రష్యా రక్షణమంత్రి- షెర్గీషోరుూగూ- పాకిస్తాన్‌ను సందర్శించాడు. 1969లో అండ్రీగ్రోయకో- అప్పటి సోవియట్ రష్యా రక్షణ మంత్రి- పాకిస్తాన్‌ను దర్శించాడు. నలబయి ఐదేళ్లపాటు ‘ఎడమొగం పెడమొగం’గా ఉండిన రష్యా పాకిస్తాన్‌లు మళ్లీ సన్నిహితం కావడం చైనా వ్యూహం. 2014లో రష్యా-పాకిస్తాన్‌ల మధ్య ‘సైనిక సహకార అంగీకారం’- మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్- కుదిరిపోయింది, పాకిస్తాన్‌తో కలసి రష్యా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది! ‘‘నోరు చక్కగా మాట్లాడుతోంది... నొసలు మాత్రం వెక్కిరిస్తోంది’’ అన్న సామెతకు మన పట్ల రష్యా మైత్రి అనుగుణంగా ఉందా? అన్నది వ్యూహాత్మక మీమాంస.
చైనా క్రీస్తుశకం 1960వ దశకంలో మన దేశంలోకి చొరబడి దురాక్రమించిన సమయంలో సోవియట్ రష్యా - అప్పటివరకు మిత్ర దేశమైన రష్యా- మనకు సహాయం చేయలేదు. ఎందుకంటె రష్యాకు చైనా సోదర కమ్యూనిస్టు దేశం! ఇప్పుడు మళ్లీ చైనాకూ మనకు పాకిస్తాన్‌కు మనకు శత్రుత్వం రాజుకొంటోంది. రష్యా అంతర్జాతీయ వేదికలపై మన వైపున మాట్లాడడం లేదు. అందువల్ల రష్యాతో మనకు పెరుగుతున్న వ్యూహాత్మక ప్రత్యేక భాగస్వామ్యానికి అర్థం ఏమిటి? ఈ భాగస్వామ్యం స్వభావం ఏమిటి??