సంపాదకీయం

‘ప్రణవ’ నాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పట్ల పెరుగుతున్న ఆదరణకు ఇది మరో ప్రబల చిహ్నం. నిజానికి ఇది జాతీయ అస్తిత్వం పట్ల పెరుగుతున్న ధ్యాసకు, జాతీయ అస్తిత్వ పరిరక్షణ పట్ల పెరుగుతున్న శ్రద్ధకు నిదర్శనం. ‘సంఘం’ గురువారం సాయంత్రం నాగపూర్‌లో నిర్వహించిన మహాసభ వేదిక పైనుంచి ప్రసంగించిన మాజీ రాష్టప్రతి ప్రణవ్‌కుమార్ ముఖర్జీ ఈ ‘్ధ్యస’ను మరోసారి ప్రస్ఫుటింప చేశాడు, ఈ ‘శ్రద్ధ’ను మరోసారి ఆవిష్కరించాడు! ఈ దేశ ప్రజలు అనాదిగా ఒక ‘జాతి’- రాష్ట్రం- నేషన్-గా వికసించారని, వైవిధ్య సమాహారం- ప్లూరలిజమ్-, వైవిధ్యాల పట్ల సహిష్ణుత- టాలరెన్స్-, సర్వమత సమభావం- సెక్యులరిజమ్- ఈ జాతీయ వికసనంలో నిహితమై ఉన్నాయని ప్రణవ్ ముఖర్జీ ‘సంఘ’ వేదికపై చెప్పిన మాట! ఇది- మాజీ రాష్టప్రతి చెప్పినది- కొత్త విషయం కాదు, సనాతనమైన వాస్తవం. ఈ శాశ్వత సత్యాన్ని మాజీ రాష్టప్రతి మరోసారి చెప్పాడు. ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ ఇదే వాస్తవాన్ని తొంబయి మూడేళ్లుగా చెబుతోంది.. సంఘం కూడ ఈ అనాది జాతీయత గురించి కొత్తగా చెప్పలేదు, కనిపెట్టలేదు. ఉన్న వాస్తవాన్ని ‘సంఘ’ సంస్థాపకుడు కేశవ బలిరామ్ హెడ్గేవార్ గ్రహించాడు, గ్రహింపచేశాడు! ఈ దేశం అనాదిగా ఒక జాతి అన్నది ‘సూర్యుని’ వలె సనాతన సత్యం. సూర్యుడిని ఎవ్వరూ కనిపెట్టలేదు. ప్రతి ‘ఉదయం’ సూర్యుడి ఉనికికి నిదర్శనం! గుడ్లగూబలు సూర్యుడిని చూడలేవు, పైగా సూర్యుడి అస్తిత్వాన్ని నిరసిస్తాయి, రోదిస్తాయి. అంత మాత్రాన సూర్యుడు లేకుండా పోడు. పాశ్చాత్యులు ప్రధానంగా బ్రిటన్ బీభత్స మేధావులు ఈ మొత్తం వౌలిక జాతీయతను ఒక మతంగా చిత్రీకరించి ప్రచారం చేసిపోయారు. అందువల్లనే ప్రస్తుతం మేధావులుగా చెలామణి అవుతున్న బ్రిటన్ భావదాసులు, ఆంగ్లేయ మానస పుత్రులు ‘స్వజాతీయత’ను కేవలం ఒక మతంగా భావిస్తున్నారు,భ్రమిస్తున్నారు. బ్రిటన్ బౌద్ధిక బీభత్స వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. వీరు ‘జాతీయత’ అర్థం కానివారు, జాతీయ పరిభాష అర్థం కానివారు, జాతీయ స్వభావం అర్థం కానివారు, వైవిధ్యాల మధ్య గల సమన్వయాన్ని గుర్తించలేని వారు, అందువల్ల ఈ విదేశీయ భావదాసులు ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని’ మత సంస్థగా చిత్రీకరిస్తున్నారు, జాతీయ సంఘటనా కార్యాన్ని మతోన్మాదమని భ్రమిస్తున్నారు! ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ నిజానికి జాతీయతా సంస్థ, మతాలకు భాషలకు కులాలకు ఉపకులాలకు, ప్రాంతాలకు, సంప్రదాయాలకు అతీతంగా సర్వ జాతీయ జన సంఘటనను చేస్తున్న సాంస్కృతిక సంస్థ! ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రణవ్ ముఖర్జీ సంఘ వేదికపై నిలబడి జాతీయతా నాదాన్ని మరోసారి వినిపించే యత్నం చేశాడు..
ప్రణవ్ ముఖర్జీ నాగపూర్ వేదికపై చేసిన ప్రసంగంలో పరస్పర వైరుధ్యాలు కొన్ని ప్రస్ఫుటించాయి. అయినప్పటికీ ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశం మన జాతీయ అస్తిత్వం.. ఈ జాతీయ అస్తిత్వ ‘్ధ్యస’ తగ్గినప్పుడల్లా మన దేశం విదేశీయ దురాక్రమణకు గురికావడం చరిత్ర.. ఈ దురాక్రమణ భౌతికమైనది, మానసికమైనది, బౌద్ధికమైనది. ఇలా ‘్ధ్యస’ తగ్గినప్పుడల్లా ‘్ధ్యస’ను మళ్లీ పెంచడానికి కృషిచేసిన మహాపురుషులు ఉదయించడం మన చరిత్ర. క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దిలో జన్మించిన ఆది శంకరాచార్యుడు ఇలా జాతీయ అస్తిత్వ ధ్యాసను పునరుద్ధరించాడు. ఈ జాతీయ అస్తిత్వంలో వైవిధ్యాలు నిహితమై ఉన్నాయి. ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం అనాదిగా మన జాతీయ స్వభావం. వైవిధ్య రూపాల మధ్య సమన్వయం నెలకొని ఉంది.. ఈ సమన్వయం స్వభావ ఏకత్వం. ఈ దేశంలో అనేక మతాలు, అనేకానేక భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు, విజ్ఞాన రీతులు, విచార ధారలు వికసించాయి. కానీ ఈ అసంఖ్యాక వైవిధ్యాల సమాహారమైన అద్వితీయ సంస్కృతి మనది, అద్వితీయ జాతీయత మనది. ఈ జాతీయత ఒక మతానికి కాని భాషకు కాని సంప్రదాయానికి కాని విచార ధారకు కాని పరిమితం కాలేదు. ఈ జాతీయత సర్వ వైవిధ్య సమాహారం! ఈ జాతీయ అస్తిత్వాన్ని, అద్వితీయ అస్తిత్వాన్ని ఆది శంకరుడు గుర్తుచేశాడు, మహాకవి కాళిదాసు ప్రచారం చేశాడు, వివేకానంద స్వామి ప్రబోధించాడు, డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ కూడ విస్తృతి చెందిన జాతికి తన స్వీయ అస్తిత్వాన్ని గుర్తుచేశాడు.. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ అవతరణకు, విస్తరణకు, ప్రగతికి, ప్రభావానికీ ఇదీ చారిత్రక నేపథ్యం..
ప్రణవ్ ముఖర్జీ ఈ చరిత్రనే మళ్లీ వివరించాడు. పదజాలం వేఱుకావచ్చు, పరిభాష వేఱుకావచ్చు.. ఒక మతం ఒక భాష ఒకే పద్ధతి ప్రాతిపదికగా ఐరోపా జనసముదాయాలు ‘రాజకీయ జాతులు’- నేషన్‌స్టేట్స్-గా అవతరించడం గురించి ప్రణవ్ ముఖర్జీ ప్రస్తావించాడు. వైవిధ్య రాహిత్యం ఈ ‘రాజకీయ జాతి’ సిద్ధాంతంలో నిహితమై ఉంది. ఫలితంగా ఐరోపా జాతులలో తమదికాని దాన్ని ధ్వంసం చేసే అసహిష్ణు ప్రవృత్తి ప్రబలింది. ఈ ప్రవృత్తి గురించి ముఖర్జీ తన ప్రసంగంలో ధ్వనింపచేశాడు. ఈ రాజకీయ జాతులు ఏర్పడడం ఆధునిక పరిణామం. ఐదారు శతాబ్దులకు పూర్వం ఐరోపాలోని జన సముదాయాలకు ‘జాతి’- రాష్ట్రం- నేషన్- గురించి తెలియదు. కానీ ఈ రాజకీయ జాతుల కంటె భిన్నంగా, ఈ రాజకీయ జాతులు పుట్టక పూర్వం వేలాది ఏళ్లనుంచి మన దేశంలో వైవిధ్య సమాహారమైన- ప్లూరలిస్ట్- వైవిధ్య పరిరక్షకమైన- టాలరెంట్- జాతి వికసించిన సంగతిని ముఖర్జీ గుర్తుచేశాడు. ఇలాంటి జాతిని సుసంఘటితం చేసి జాతీయ పరమ విభవాన్ని విశ్వగురుత్వాన్ని మళ్లీ సాధించడానికి తమ సంస్థ పాటుపడుతోందన్నది గురువారం నాటి ‘శిక్షావర్గ’ సమారోప ఉత్సవ వేదికపై ‘సంఘ’ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పిన మాట.. వైరుధ్యం ఎక్కడుంది? వైరుధ్య భ్రాంతికి గురి అవుతున్నవారు మానసిక చికిత్సను చేయించుకోవాలి!!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శిబిరాలలోను, సభలలోను మహాత్మాగాంధీ పాల్గొన్నాడు, నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ పాల్గొన్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ పాల్గొన్నాడు. ప్రణవ్ ముఖర్జీ ఈ పరంపరను నిలబెట్టాడు. కేశవ బలిరామ్ హెడ్గేవార్ భరతమాత వజ్రాల బిడ్డడు. ముఖర్జీ నోట ఈ సుమధుర వాస్తవం ధ్వనించింది! బ్రిటన్ విముక్త భారత్‌లో జమ్మూ కశ్మీర్ విలీనానికి కృషిచేసిన మాధవ సదాశివ గోళ్వల్కర్‌ను సర్దార్ వల్లభభాయి పటేల్ ప్రశంసించాడు, ఇందిరాగాంధీ ప్రశంసించింది. హెడ్గేవార్ సంఘానికి మొదటి సర్ సంఘ చాలక్.. గోళ్వల్కర్ రెండవ సర్ సంఘ్ చాలక్! చైనా దురాక్రమణ సమయంలో ‘సంఘ’ సేవలను జవహర్‌లాల్ నెహ్రూ సైతం మెచ్చుకున్నాడు. ఇప్పుడు హెడ్గేవార్‌ను మాజీ రాష్టప్రతి కొనియాడాడు.. వాస్తవాలను అంగీకరించిన వారి తీరు ఇది..