సంపాదకీయం

ప్రాంతీయ పతాకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక శాసనసభ ఎన్నికల్లో ‘పతాక’ రాజకీయాలు ప్రచారం అవుతుండడం విచ్ఛిన్న భావాలకు నిదర్శనం! పతాకం జాతికి ప్రతీక, జాతీయ ధ్వజం జాతి సర్వ సమగ్ర అస్తిత్వానికి సనాతన- శాశ్వత- చిహ్నం! ఒక జాతికి ఒకే పతాకం ఉండడం యుగయుగాల సంప్రదాయం. ఈ సంప్రదాయం బ్రిటన్ విముక్త భారత్‌లో భంగపడింది, భంగపడుతోంది! జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక పతాకం ఏర్పడడంతో ఈ సంప్రదాయం భంగపడింది, ఇప్పుడు కర్నాటక ప్రాంతానికి సైతం ప్రత్యేక ‘పతాకం’ కావాలట! దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు, వృత్తులు, వాణిజ్య, వ్యవసాయాలు, విద్యలు, విజ్ఞానాలు ఇంకా అనేక వైవిధ్యాలు. ఒకే జాతీయ సంస్కృతిలోని విభిన్న అంశాలు మాత్రమే. ఈ ‘జాతీయత’ అనాదిగా వికసించింది. అందువల్ల జాతికి మొత్తం ఒకే పతాకం ఏర్పడి ఉంది. స్వదేశీయ రాజ్యాంగ వ్యవస్థ వికసించిన వేల లక్షల సంవత్సరాల కాలంలో ఈ దేశం ఒకే జాతి. విదేశీయులు దాడి చేసిన సమయంలోను, ఆ దాడుల ఫలితంగా అఖండ భారత్ ముక్కలు చెక్కలుగా మారిన సమయంలోను కూడ ఈ దేశం మొత్తం ఒకే జాతి! విదేశీయుల దురాక్రమణ స్థిరపడిన కాలంలోను, విదేశీయ బీభత్స రాజ్యాంగ వ్యవస్థలు విస్తరించిన కాలంలోను కూడ ఈ దేశం ఒకే జాతిగా కొనసాగడం చరిత్ర! బ్రిటన్ విముక్త భారతదేశం ఈ సనాతన జాతీయ చరిత్రకు కొనసాగింపు.. ఒకే జాతికి ఒకే పతాకం! బ్రిటన్ దురాక్రమణదారులు పాలకులుగా చెలామణి అయ్యేవరకు ఈ ‘జాతి’కి ప్రతీకగా అనాదిగా స్వదేశీయమైన ‘అరుణ పతాకం’- కాషాయ ధ్వజం పరిఢవిల్లింది. స్వదేశీయుల కోటల మీద ఇతర రాజ్యాంగ, పాలనావ్యవస్థల భవనాల మీద, గురుకులాల ప్రాంగణాల మీద- ఇలా ఆసేతు శీతనగం ఈ ‘అరుణ పతాకం’ ఎగిరింది. బ్రిటన్ ‘పాలకులు’ ఈ జాతీయ పతాకాన్ని తొలగించి తమ దురహంకార దురాక్రమణకు ప్రతీక అయిన తమ ‘యూనియన్ జాక్’ జెండాను మన దేశంలో నిలబెట్టారు, మన నెత్తిమీద ఆవిష్కరించారు. బ్రిటన్ పెత్తనం సాగినంత కాలం మనం ఈ విజాతీయమైన ‘యూనియన్ జాక్’ను మోయవలసి వచ్చింది. బ్రిటన్ ముష్కరులు వైదొలగినంతనే ఈ ‘యూనియన్ జాక్’ కిందకు దిగింది, నిష్క్రమించింది. ‘త్రివర్ణ కేతనం’ మన జాతికి ప్రతీకగా పైకెగసింది! ఈ జాతీయ పతాకం ఒకే జాతి అయిన ఈ దేశ ప్రజలందరిదీ. మళ్లీ ప్రాంతీయ పతాకాలను ఎగరవేయడం ఈ అద్వితీయ జాతీయ స్ఫూర్తికి విఘాతకరం..
కానీ ఏడు దశాబ్దుల క్రితమే జమ్మూ కశ్మీర్‌లో ఈ జాతీయ పతాక స్ఫూర్తికి విఘాతం కలిగింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రాంతీయ పతాకం ఏర్పడి ఉంది. ఈ ప్రత్యేకతకు కారణం అద్వితీయ భారత జాతీయతను అంగీకరించని మతోన్మాదం. షేక్ అబ్దుల్లా వంటి కశ్మీరీ ప్రాంతీయ నాయకుల మతోన్మాదం కారణంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, ప్రత్యేక ప్రధాన మంత్రి ఏర్పడడం 1950వ దశకంలో మొదలైన వైపరీత్యం. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం కూడ తమ ప్రాంతానికి ప్రత్యేక పతాకం కావాలన్న పగటి కలలను గత కొనే్నళ్లుగా కంటోంది. ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘కర్నాటక పతాకాన్ని’ బహిర్గతం చేయడం ఈ ‘దివాస్వప్న’ ప్రహసనంలో పరాకాష్ఠ. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతీయ పతాకాన్ని ఆధికారికం చేయడం గురించి కర్నాటక ప్రభుత్వం గొప్ప ఆర్భాటం చేస్తోంది. కర్నాటక ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే ఈ ‘ప్రాంతీయ పతాకం’ ఆధికారికం కాగలదు. గత ఏడాది జూన్‌లో కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘పతాక సంఘం’ అధ్యయన వేత్తలు రూపొందించిన ప్రాంతీయ పతాకాన్ని కేంద్ర ప్రభుత్వం బహుశా ఆమోదించదు. ‘పసుపుపచ్చ, తెలుపు, ఎఱుపు రంగులు పైనుండి కిందికి పులుముకున్న’ కర్నాటక పతాకం ప్రాంతీయ అస్తిత్వానికి చిహ్నమని కర్నాటక ప్రచారం చేస్తోంది.
ప్రాంతీయ ఆకాంక్షలు ఉండడం, వాటిని నెరవేర్చుకొనడం తప్పుకాదు, గొప్ప కూడ. ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ ఉన్మాదాలుగా వికృతరూపం దాల్చడం సరికాదు. సమాఖ్య స్ఫూర్తి సాకుతో ఇటీవలి కాలంలో ఈ ఉన్మాదాలు మరోసారి అనేక ప్రాంతాలలో విస్తరిస్తున్నాయి. కేంద్రంలో సంకీర్ణ రాజకీయ శకం 2014లో ముగిసిన తరువాత కొన్నాళ్లుగా, మూలపడి ఉన్న ఈ ఉన్మాదాలు ‘సమాఖ్య స్ఫూర్తి’ పేరుతో మరోసారి నిక్కపొడుచుకుంటుండడం ఈ ప్రాంతీయ పతాక రూపకల్పనకు దారితీసింది. ప్రాంతీయ ఆకాంక్షలు - రీజినల్ యాస్పిరేషన్స్- మితిమీరిన ప్రాంతీయత- ‘రీజినల్ ఓవర్ రీచ్’-గా ముదిరిపోతుండడం నడుస్తున్న వైపరీత్యం. జాతీయతా సమగ్ర రూపంలో ‘ప్రాంతీయతలు’ అవయవాలు! అవయావాలకు కూడ అస్తిత్వం, కార్యక్రమం వంటివి ఉన్నాయి. కానీ ఈ అవయవాల క్రియాశీలత- దేహగత క్రియాశీలతకు అనుగుణంగా మాత్రమే ఉండాలి, శారీరకోన్ముఖ ‘జీవ’కలాపానికి ‘జీవన’కలాపానికి దోహదం చేయాలి! ‘అవయవాలు’ శరీర అస్తిత్వాన్ని భంగపరచరాదు, అవయవాల అస్తిత్వం సమగ్ర శరీర అస్తిత్వంలో భాగమన్న ధ్యాస సమన్వయ జీవం! భారతజాతి కంటె భిన్నంగా ‘ప్రాంతీయ జాతుల’ను తయారుచేస్తున్న రాజకీయవేత్తలు ఈ సహజమైన వాస్తవాన్ని గుర్తించాలి. దేశంలోని ప్రతి భాషలోని భావజాలం ఒక్కటే, ప్రతి మతం కూడ అద్వితీయ భారతీయ సంస్కృతి భూమికపై వికసిస్తోంది, ప్రతి ప్రాంతం జాతీయతా భాగం! భాష పేరుతో కాని, మతం పేరుతోకాని, ప్రాంతం పేరుతోకాని ‘కొత్త జాతులను’ విచిత్ర పదాలను సృష్టిస్తున్నవారు ‘్భరతజాతి’ వ్యతిరేకులు! ఉన్నది ‘్భరత జాతి’ ఒక్కటే.. తెలుగుజాతి, కన్నడ జాతి, తమిళ జాతి, మరాఠీ జాతి, ఉత్తరఖండ్ జాతి, కశ్మీరీ జాతి వంటి లేవు. ‘తెలుగు జన సముదాయం’, ‘కన్నడ జన సముదాయం’, వివిధ భాషాప్రాంత మత జన సముదాయాలు- ఇవన్నీ కూడ అద్వితీయ భారత జాతిలో భాగం. ఒక భాష కాని, ఒక ప్రాంతీయ అస్తిత్వం కాని, ఒక మతం కాని ‘జాతి’- నేషన్- కు ప్రాతిపదికలు కాజాలవు. ఈ సకల వైవిధ్యాల సమాహారమైన భారతీయ సంస్కృతి మాత్రమే భారత జాతి వికసనానికి యుగయుగాలుగా ప్రాతిపదిక! జాతీయ పతాకం మొత్తం దేశానికి ప్రతీక, బుద్ధి, ఆత్మ. బుద్ధి, ఆత్మ అనేవి మొత్తం శరీరానికి సంబంధించినవి. కన్నుకో ఆత్మ, కాలికో ఆత్మ, వేలికో ఆత్మ, గోరుకో ఆత్మ, మోకాలి చిప్పకో ఆత్మ ఉండవు, లేవు. ఒకే జాతికి ఒకే పతాకం.. కశ్మీరీ పతాకం, కన్నడ పతాకం ఉండరాదు. ఇదీ సహజత్వం! ప్రాంతీయ పతాకాలు ఉండడం రోగం, పక్షవాతం!!
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రధానమంత్రి ఉండరాదని కోరుతూ ‘్భరతీయ జనసంఘం’ అధ్యక్షుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 1950వ దశకంలో ఉద్యమం జరిపాడు, జాతి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆ మహనీయుని త్యాగం ఫలితంగా జమ్మూ కశ్మీర్‌లో ‘ప్రధానమంత్రి’ పదవి రద్దయింది. ప్రత్యేక రాజ్యాంగం, ప్రాంతీయ పతాకం రద్దుకాలేదు. జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న జాతి వ్యతిరేక ‘ప్రాంతీయ పతాకం’ బహుశా కర్నాటక ప్రభుత్వాన్ని పురికొల్పుతోంది.