సంపాదకీయం

సంస్కార మాధ్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ సంస్కారాల సమాహారం సంస్కృతి. ‘యోగం’ వౌలికమైన మానవీయ సంస్కారం, మానవత్వం వికసించడానికి మాధ్యమం. మన దేశంలో అనాదిగా మానవీయ సంస్కారాలు వికసించాయి, పరిమళించాయి. ఈ పరిమళ పవనం ప్రపంచమంతటా విస్తరించడం సనాతన చరిత్ర. ఆద్యంత రహితమైన మానవ ప్రస్థాన చరిత్ర. ఈ చరిత్ర మళ్లీ మళ్లీ ఆవృత్తమైంది. ఈ ‘పునరావృత్తి’కి అంతర్జాతీయ యోగ దినోత్సవం వర్తమాన సాక్ష్యం! యోగ విద్య ప్రపంచానికి భారతీయుల ప్రదానం. గురువారం నాలుగవ ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ జరుగుతుండడం ఈ ‘ప్రదాన సంప్రదాయాని’కి ఆధునిక ధ్రువీకరణ! ఈ ఆధునిక ధ్రువీకరణకు ‘సూత్ర’కర్త మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం జరపాలని ప్రతిపాదించినవాడు, ఐక్యరాజ్యసమితిలో ఆమోదింపచేసిన వాడు మోదీ! సరిగ్గా మూడేళ్లక్రితం మొదటి యోగ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సభ్యత్వం గల దాదాపు అన్ని దేశాలలోను జరుపుకోవడం మానవీయ సంస్కార ప్రభావం విస్తరిస్తోందనడానికి నిదర్శనం. ‘వాణిజ్య ప్రపంచీకరణ’ వల్ల నైతిక నిష్ఠ ధ్యాస లేని ఆర్థిక విజయం జీవన పరమలక్ష్యంగా మారింది! ఈ లక్ష్యం వైయక్తిక, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ జీవన రంగాలను ఆవహించి కృత్రిమ ప్రగతి భ్రాంతిని కల్పిస్తోంది. ఈ కృత్రిమత్వం రకరకాల సంఘర్షణలను కల్పించి ‘అశాంతి’కి దోహదం చేస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం ప్రతిపాదించి ఆచరింపచేస్తున్న ‘సంస్కార ప్రపంచీకరణ’కు మాధ్యమం ‘యోగం’. కృత్రిమ ప్రగతికి విభిన్నంగా సహజమైన ‘సుగతి’ని సాధించడానికి ఈ ‘గిక ప్రపంచీకరణ’ దోహదం చేస్తోంది. సంఘర్షణల సమసిపోయి సమన్వయం సంతరించుకోగల అంతర్జాతీయ సమాజం ‘ప్రశాంతి’మంతం కావడానికి ‘యోగం’ భారతదేశం ప్రదానం చేస్తూన్న విలక్షణ సంస్కారం..
యోగం వేద విజ్ఞాన వాస్తవాలను జీవన వ్యవహారంగా అనువదిస్తున్న సనాతన మాధ్యమం. ‘సనాతనం’ అని అంటే ‘పాతది’, ‘పూర్వకాలం నాటిది’ అన్న అర్థాలు లేవు. ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతమైనది’ అని అర్థం. ఈ శాశ్వత తత్త్వం గతంలో ఉంది, వర్తమానంలో ఉంటున్నది, భవిష్యత్తులో ఉండనున్నది. అందువల్ల ఆద్యంత రహితమైన- మొదలు, తుదిలేని- శాశ్వత తత్త్వం ‘సనాతనం’.. సూర్యుని వెలుగు వలె, విశ్వవ్యవస్థ వలె వేద విజ్ఞానం కూడ సనాతనమైనది. ఈ వేద విజ్ఞాన జీవన భూమికపై అనాదిగా వికసించిన సంస్కారం యోగాభ్యాసం! ఆరు వైదిక ‘దర్శన’ శాస్త్రాలలో ‘యోగం’ ఒకటి! ఒక్కొక్క ‘దర్శన’ శాస్త్రం ఒక్కొక్క వౌలిక జీవన వాస్తవానికి భాష్యం, వ్యాఖ్యానం.. కలియుగం పంతొమ్మిదవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం పదమూడవ శతాబ్ది-లో ప్రభవించిన పతంజలి మహర్షి ఈ యోగశాస్త్రాన్ని సమకాల సమాజంలో ప్రచారం చేశాడు. విదేశాలకు చెందిన బర్బర జాతులు తమ శక్తులను మానవ సమాజాన్ని దురాక్రమించడానికి, దోపిడీ చేయడానికి వినియోగించిన సమయంలో పతంజలి ప్రపంచానికి యోగ విద్యను బోధించాడు, సంస్కార ప్రదానం చేశాడు. పతంజలి మహర్షి సమకాలంలో మన దేశాన్ని దురాక్రమించిన విదేశీయ బీభత్స మూకలను అప్పటి భారత సమ్రాట్ పుష్యమిత్రుడు ఓడించి తరిమివేశాడు. అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు పతంజలి మహర్షి వద్ద ‘యోగం’ నేర్చుకున్నారు, సౌశీల్య సంస్కారాలను నేర్చుకొని తమ దేశాలకు వెళ్లారు. ‘్భరతీయుల శక్తి’ సరిహద్దులను రక్షించుకొంది, కానీ విదేశాలను దురాక్రమించలేదు. భారతీయశక్తి విదేశాల వారికి ‘యోగం’ వంటి సంస్కారాలను ప్రదానం చేసింది. అందువల్లనే ‘్భరత్’ విశ్వగురువైంది. కానీ తమ దేశం ‘విశ్వవిజేత’ కావాలని భారతీయులు భావించలేదు. ఇదీ భారతీయుల జీవన ‘యోగం’..
యోగం అంటే కలయిక, ‘యోగించడమంటే’ కలపడం! భారతీయులు యుగాలుగా మానవీయ సంస్కారాలతో అనుసంధానం చేశారు, కలిపారు. ఇదీ భారతీయులు సమాచరించి ప్రదానం చేసిన సాంస్కృతిక ప్రపంచీకరణ, ‘వసుధైవ కుటుంబమ్’- ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం! మనువు చెప్పినట్టు, ‘ఏ తద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్ర జన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వ మానవాః..’’- ఈ దేశంలో పుట్టిన గురువుల వద్ద ప్రపంచంలోని సర్వమానవులు తమ తమ సంస్కారాన్ని నేర్చుకొని వెళ్లారు-! ఈ సంస్కార ప్రదాన పరంపరను ద్వాపర యుగంలో గీతాచార్యుడైన యదుకుల కృష్ణుడు కొనసాగించాడు.. ‘‘యోగః కర్మ సు కౌశలమ్’’- ‘‘చేసే పనియందు ప్రామాణిక స్థితిని సాధించడమే యోగం’’- అని ప్రబోధించాడు. పతంజలి కలియుగంలో యోగ ప్రవర్ధకుడు. వివేకానంద స్వామి కలియుగం యాబయ్యవ శతాబ్ది -క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది-లో పాశ్చాత్య దేశాలకు యోగం బోధించాడు, వేద నాదం వినిపించాడు. వివేకానందుడు ప్రవచించిన ‘రాజయోగం’ సంఘర్షణలు నిహితమైన పాశ్చాత్య కృత్రిమ ‘నాగరికముల’ను సమన్వయం చేయగలిగింది! ‘సమన్వయం’ సృష్టిగత వౌలిక స్వభావం. వైవిధ్య స్వరూపాల మధ్య స్వభావ ఏకత్వం సృష్టిని ప్రస్ఫుటింప చేస్తోంది. అందువల్ల యోగం- సమన్వయం- కలయిక- సృష్టిగత వాస్తవం. ఈ సృష్టి స్థిత వాస్తవం జీవన వ్యవహారంగా పరిణతి చెందడం మానవీయ స్వభావం. ‘కౌశలమైన కర్మ’- ప్రామాణికంగా పని-చేయడం వ్యక్తిగత శారీరిక బౌద్ధిక మానసిక వికాసానికి మాత్రమే కాదు, సమష్టి జీవన హితానికి కూడ దోహదం చేయగల శుభంకర మాధ్యమం. శరీర సౌష్టవాన్ని బౌద్ధిక పటిమను పెంచుకొని మానసిక వికాసం పొందగల మానవుడు ‘వసుధైక కుటుంబాన్ని- ప్రపంచం ఒకే కుటుంబం- సాధించాడు, సాధించగలడు నిరంతరం..! ఈ నిరంతర ప్రక్రియకు ఉదయం వంటిది యోగం.. ఈ వాస్తవాన్ని భారతీయులు గుర్తించారు, ప్రపంచ ప్రజలకు చాటి చెప్పారు! చాటి చెపుతున్నారు, ఇదీ పునరావృత్తి!
అన్నం తినడం శరీరానికి సంతుష్టి. యోగ సాధన మనస్సునకు బుద్ధికి పరిపుష్టి! ఈ రెండింటినీ సాధించడం ద్వారా మానవుడు సమస్త విశ్వంతో నిరంతరం తన అనుసంధానాన్ని నిలబెట్టుకోగలడు. మానవుడు సృష్టిలోను ప్రకృతిలోను అవిభాజ్యమైన అంశం. అణువు అణువు అనుసంధానమై విశ్వమంతా విస్తరిస్తోంది. అణువులు అసంఖ్యాకం, అనుసంధానం చేస్తున్న అఖండ అనంత చైతన్యం మాత్రం అద్వితీయం. ‘యోగం’ ఈ అద్వితీయతను అణువణువునా జాగృతం చేస్తోంది. ‘యమము’ ‘నియమము’, ‘ఆసనము’, ‘ప్రాణాయామము’, ‘ప్రత్యాహారము’, ‘్ధరణ’, ‘్ధ్యనము’, ‘సమాధి’... అన్నవి రాజయోగంలోని ఎనిమిది ప్రక్రియలు. ఈ అష్టవిధ ప్రక్రియలను అధ్యయనం చేయడం, ఆచరించడం ప్రగతిని, సుగతిని సమకూర్చగల జీవన యోగం..