సంపాదకీయం

ద్రవ్యోల్బణ వి‘చిత్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరలను, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ వారు చేపట్టిన ‘ఆర్థిక చర్య’వల్ల లక్ష్యసాధన జరగలేదు. జూన్ నెలలో ధరలు, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగాయన్నది అధికారిక నిర్ధారణ. మే నెలలో నాలుగున్నర శాతం - ఏప్రిల్‌తో పోల్చినప్పుడు - పెరిగిన ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) జూన్ నెలలో ఐదుముప్పావు శాతం పెరగడం గొప్ప ‘నమోదు’. 2013 డిసెంబర్ నుంచి నాలుగున్నర ఏళ్లలో ‘ద్రవ్యోల్బణం’ పెరుగుదల ఇంత వేగవంతంగా నమోదు కాలేదట! అందువల్ల ఈ పెరుగుదల గత ‘నమోదు’ రికార్డులను బద్దలు కొట్టినట్టు ఆధికారంగా ప్రచారం అయింది. ‘ద్రవ్యోల్బణం’ ధరల పెరుగుదల, ధరల తగ్గుదల ప్రాతిపదికగా నిర్ధారితమవుతుంది. జూన్ నెలకు సంబంధించిన ఈ అధికార నిర్ధారణ ‘టోకు’ ధరల ప్రాతిపదికగా జరిగిందట. 2009 నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని విడిగా లెక్కిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం (్ఫడ్ ఇన్‌ఫ్లేషన్), చిల్లర ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్‌ఫ్లేషన్) ఇంకా ఎక్కువగానే పెరిగి ఉండవచ్చు. ఎందుకంటే జూన్ నెలకు సంబంధించిన ‘టోకు’ ద్రవ్యోల్బణం (హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్) ప్రధానంగా పెట్రోలు ధరల పెరుగుదల ప్రాతిపదికగా నిర్ధారితమైందట! పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మే నెలలో కంటే జూన్ నెలలో నలబయి తొమ్మిది శాతం పెరగడం ‘అంతర్జాతీయ వాణిజ్య అనుసంధాన’ వైచిత్రి. పెట్రోల్ ధరలు పెరిగితే ఉప్పుతో సహా ‘సర్వే సమస్తం’ ధరలు పెరుగుతాయట... రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి. అందువల్ల చిల్లర ద్రవ్యోల్బణం మరింత పెరిగి ఉండవచ్చు. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం ఎదగకుండా ఎందుకు ఊరుకుంటుంది? ఉల్లిగడ్డలు మొదలు వంటనూనె వరకు ఆహారం ‘దినుసుల’ ధరలు జూన్‌లో పెరిగిన వాస్తవం ప్రత్యక్ష అనుబంధం.
ద్రవ్యోల్బణాన్ని, ధరలను తగ్గించడానికి ఏళ్ల తరబడి ప్రభుత్వంవారు, రిజర్వ్ బ్యాంక్ వారు గైకొంటున్న ఏకైక చర్య ‘వడ్డీ’లను పెంచడం. అందువల్ల నాలుగున్నర సంవత్సరాలలో మొదటిసారిగా ‘రిజర్వ్‌బ్యాంక్’వారు ‘వడ్డీ’ని పెంచారు. ‘రిజర్వ్ బ్యాంక్’ వద్ద పుచ్చుకునే ‘నిధుల’పై వాణిజ్య బ్యాంకులు చెల్లించవలసిన ‘వడ్డీ’ గత జూన్ ఆరవ తేదీన ఆరు శాతం నుంచి ఆరుంబావు శాతానికి పెరిగింది. ఈ ‘వడ్డీ’ని ఆంగ్ల పరిభాషలో ‘రెపోరేట్’ అని ప్రచారం చేస్తున్నారు. భారతీయ భాషలలో ఈ ‘రెపోరేట్’కు నామకరణం జరగకపోవడం మరో అంతర్జాతీయ అనుసంధాన ఆర్థిక వైచిత్రి. సామాన్య భారతీయులకు అర్థంకాని పరిభాషలో అంతర్జాతీయ ‘ఆర్థిక పరిభాష’ భారతదేశంలో వ్యవస్థీకృతమై ఉండడం ఈ వైచిత్రి. భారతీయ భాషలలో మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్స్) - జీడీపీ - గురించి రూపాయలలో చెప్పడం ఆర్థికవేత్తలకు నామోషీ... అమెరికా ‘డాలర్ల’లో చెప్పాలి. ‘‘వేలు... లక్షలు... కోట్లు...’’ అని చెప్పరాదు. ‘మిలియన్లు’, ‘బిలియన్లు’, ‘ట్రిలియన్లు’ అని చెప్పాలి. అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానపు పోకడలు మన దేశంలో విశే్లషిస్తున్నవారికి వింటున్నవారికి అర్థం కావడం లేదు. ఇదీ వాణిజ్య ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) - వ్యవస్థీకరించిన స్వేచ్ఛావిపణి - మార్కెట్ ఎకానమీ - మాయ...
అందువల్లనే ద్రవ్యోల్బణాన్ని ధరలను తగించడానికి వీలుగా ‘రిజర్వ్ బ్యాంక్’వారు జూన్ నెలలో వడ్డీ శాతాన్ని పెంచినప్పటికీ ఈ చర్య ఫలించలేదు, ద్రవ్యోల్బణం తగ్గలేదు... ఇలా అంతర్గత ఆర్థిక చర్యను అంతర్జాతీయ అనుసంధానం వమ్ముచేసింది. అంతర్జాతీయ విపణిలో పెట్రోలియం ధరలు భయంకరంగా పెరగడం వల్ల మన అంతర్గత ఆర్థిక వ్యవస్థ కల్లోలగ్రస్తమైపోయింది. ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం గాని, తగ్గడం గాని అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలపై ఆధారపడి ఉన్నాయని, పరిష్కారాలు కూడ అంతర్జాతీయ స్థాయిలోనే అనే్వషించాలని ఆరేళ్ల క్రితమే ‘రిజర్వ్ బ్యాంక్’ వారు స్పష్టం చేశారు. ఈ స్పష్టీకరణ సామాన్యులకు మాత్రమే కాదు... ఆర్థికవేత్తలకు, విశే్లషకులకు సైతం అర్థం కాలేదు. ఇప్పుడు బాగా అర్థమైంది. ధరలను, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి జరిగే అంతర్గత ప్రయత్నం అంతర్జాతీయ వాణిజ్య పరిణామక్రమం వల్ల వమ్మయిపోతోందన్నది బోధపడుతున్న పాఠం! మన ఆర్థిక వ్యవస్థ దిశానిర్దేశం మన ప్రభుత్వం పరిధిలో లేదు. విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఈ దిశానిర్దేశం చేస్తున్నాయి. పెట్రోలియం ధరలను పెంచాయి.
ప్రపంచీకరణ ఫలితంగా సార్వభౌమ దేశాల ఆర్థిక స్వాతంత్య్రం హరించుకొనిపోతోందన్న ప్రచారం 1994 నుంచీ జరుగుతోంది. ‘గిట్టనివాళ్లు’ ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నది మన దేశంలో వినిపించిన సమాధానం. అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి. ఆ తరువాత ఆయన ప్రధాన మంత్రిగా ఉండిన సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ, ధరలను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. ఈ ‘అనుసంధానం’ వ్యవస్థీకృతం అయిన నాటినుంచీ పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనం ధరలు దాదాపు ప్రతి నెలా పెరిగాయి. ఇలా పెరిగిన ప్రతిసారీ ‘‘అంతర్జాతీయ అనుసంధానం సర్వసమగ్రం కావాలి’’ అన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆవిష్కరించిన స్పష్టీకరణ. ఫలితంగా పెట్రోలియం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి వీలుగా అంతర్గతంగా సైతం మన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కృషి చేసింది. ఎనిమిది శాతం ఉండిన వడ్డీ శాతాన్ని నాలుగున్నర ఏళ్లలో రిజర్వ్ బ్యాంక్ వారు ఆరు శాతానికి తగ్గించడం ఈ ‘కృషి’లో భాగం. ‘రెపోరేట్’తోపాటు ‘రివర్స్ రెపోరేట్’ కూడ తగ్గిపోయింది. ‘వాణిజ్య బ్యాంకుల’వారు ‘రిజర్వ్ బ్యాంక్’ వద్ద అట్టిపెట్టే నగదు (రిజర్వ్)పై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీ ‘రివర్స్ రెపోరేట్’ అన్నది ఆంగ్ల పరిభాష... ఇలా వడ్డీలను తగ్గించడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వారు ఉవ్విళ్లూరారు. గత నాలుగేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వారు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకంటే ‘వడ్డీ’ తగ్గడం వల్ల ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుతుందట!
ఈ స్థూల జాతీయ ఉత్పత్తి మాత్రమే ఆర్థిక సౌష్టవానికి ప్రతీక కాదు. ఈ వాస్తవాన్ని గతంలో సర్వోన్నత న్యాయస్థానం వారు సైతం స్పష్టం చేశారు. ‘స్థూల జాతీయ ఉత్పత్తి’లో యాబయి శాతానికి పైగా సేవల రంగం నుండి లభిస్తోంది. అందువల్ల ఇలాంటి ప్రగతి ‘వాపు’... బలుపుకాదు. వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వౌలిక పారిశ్రామిక ఉత్పత్పుల వాటా పెరగడం నిజమైన ప్రగతికి చిహ్నం. ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత ‘జీడీపీ’ పెరిగింది. కానీ మన ‘జీడీపీ’ వ్యవసాయ ఉత్పత్తుల వాటా, వౌలిక పారిశ్రామిక ఉత్పత్తుల వాటా గణనీయంగా తగ్గిందన్నది ప్రచారం కాని రహస్యం. ‘‘మన జీడీపీ పరిమాణం ఫ్రాన్స్ జీడీపీని మించిపోయింది... మన జీడీపీ పెరుగుదల వేగం చైనావారి జీడీపీ పెరుగుదల వేగాన్ని మించిపోయింది...’’ అన్నవి మన ప్రభుత్వాల నకిలీ పారవశ్యానికి కారణం. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదలకు ప్రాధాన్యం లేదు. ‘జీడీపీ’కీ ద్రవ్యోల్బణానికీ మధ్య అనులోమ నిష్పత్తిలో సంబంధం నెలకొని ఉండడం ‘అనుసంధానం’ సృష్టించిన మాయ. ఒకటి పెరిగితే మరొకటి కూడా పెరుగుతుంది. ధరలు, ద్రవ్యోల్బణం పెరగని రీతిలో ‘జీడీపీ’ని పెంచడానికి ఏకైక అవరోధం ప్రపంచీకరణ!!