సంపాదకీయం

‘కొండ’ను తవ్వి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్సాం ప్రాంతానికి సంబంధించిన ‘దేశ పౌరుల జాతీయ సూచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్- ముసాయిదా గురించి పార్లమెంటు లోపల, వెలుపల కొంతమంది భయాందోళనలను వ్యక్తం చేస్తుండడం విచిత్రమైన వ్యవహారం. ఈ ముసాయిదా సూచిక ప్రకారం అసోం- అస్సాం-లో దాదాపు నలబయి లక్షల మందికి భారతీయ పౌరసత్వం లభించలేదన్నది ఆందోళనను అభినయిస్తున్న వారి ఆర్భాటం.. అస్సాంలో నివసిస్తున్న వారిలో దాదాపు రెండు కోట్ల ఎనబయి తొమ్మిది లక్షల మంది సక్రమమైన భారతీయ పౌరులన్నది ముసాయిదా వల్ల వెల్లడైన అంశం. దేశ పౌరులుగా గుర్తింపు పొందడానికి దరఖాస్తులు పెట్టిన దాదాపు మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల మందిలో దాదాపు నలబయి లక్షల మంది తమ ‘్భరతీయ పౌరసత్వాన్ని’ ధ్రువపరచుకోలేక పోయారన్నది అస్సాం రాజధాని గువాహతీ నగరంలో సోమవారం వెలువడిన ఈ ‘దేశ పౌరుల జాతీయ సూచిక’- ఎన్‌ఆర్‌సి- ముసాయిదా- డ్రాఫ్ట్ ద్వారా నిర్ధారితమైన వాస్తవం. ‘ముసాయిదా’ను ఆవిష్కరించిన ‘్భరత జనగణన వ్యవహారాల ప్రధాన అధికారి’- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా- శైలేశ్‌కుమార్, ‘ఎన్‌ఆర్‌సి’ ప్రాంతీయ సమన్వయకర్త ప్రతీక్ హలేజా చెప్పిన ఈ విషయాన్ని పార్లమెంటు ఉభయ సభలలో కేంద్ర ప్రభుత్వం ధ్రువపరచింది. ఇలా ధ్రువపరచుకోలేని వారు ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో మళ్లీ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు! నిజమైన భారతీయ పౌరులకు పొరపాటున కాని, ‘పథకం ప్రకారం’ కాని ‘ఎన్‌ఆర్‌సి’లో చోటు దొరకని పక్షంలో వారు ఈ దరఖాస్తుల ద్వారా తమ జాతీయతను ధ్రువపరచుకోవచ్చు. ఇలా ధ్రువపడిన తరువాతనే ఈ సంవత్సరం చివరకు తుది జాబితా రూపొందుతుంది. తుది జాబితా విడుదలైన తరువాత కూడ తమకు ‘న్యాయం జరగనివారు’ విదేశీయులను నిర్ధారించే న్యాయ మండలులలోను, ఉన్నత న్యాయస్థానాలలోను, సర్వోన్నత న్యాయ స్థానంలోను న్యాయ యాచికలను దాఖలు చేసుకోవచ్చునన్నది ప్రభుత్వం చెబుతున్న మాట!
విదేశాల నుంచి అతి ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడి అక్రమంగా తిష్ఠవేసి ఉన్న వారిని పసికట్టి పట్టుకొని దేశం వెలుపలికి తరలించడంకోసం మాత్రమే అస్సాంలో గత ఐదేళ్లుగా ఈ ‘ఎన్‌ఆర్‌సి’ని రూపొందించే కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఏళ్లతరబడి విఫలమైన తరువాత సర్వోన్నత న్యాయస్థానం జోక్యం కల్పించుకుంది. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో అస్సాం ప్రభుత్వ ప్రమేయం కాని, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కాని పెద్దగా లేదు. అందువల్ల ఈ ‘ఎన్‌ఆర్‌సి’ ముసాయిదా వల్ల ‘ఎవరికో అన్యాయం జరిగినట్టు’ ఏడుపుకెత్తుకున్నవారు ప్రభుత్వాలను విమర్శించడం అతార్కికమైన వ్యవహారం. ‘ఎన్‌ఆర్‌సి’లో స్థలం లభించని నలబయి లక్షల మందిలో అత్యధికులు దశాబ్దుల తరబడి మన దేశంలోకి చొరబడినవారు లేదా చొరబడినవారి వారసులు. వీరందరూ బంగ్లాదేశీయులు. ఇదంతా సూర్యుని వెలుతురు వలే దశాబ్దుల తరబడి ధ్రువపడిన వాస్తవం. ఇప్పటికైనా విదేశీయులెవ్వరో స్వదేశీయులెవ్వరో నిర్ధారణ జరిగినందుకు దేశహితం కోరే ప్రతి ఒక్కరూ హర్షించాలి... మరి పార్లమెంటులోను, బయట ‘ఎన్‌ఆర్‌సి’ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నవారు దేశం హితం కోరుతున్నారా? దశాబ్దుల తరబడి మన దేశంలోకి చొరబడి తిష్ఠవేసిన ‘బంగ్లాదేశీయులు’ శాశ్వతంగా మన దేశంలోనే ఉండిపోవాలని ముసాయిదాను వ్యతిరేకిస్తున్నవారు ఆకాంక్షిస్తున్నారా?? తమ రాష్ట్రంలోకి చొరబడిన బంగ్లా దేశీయులను వెళ్లగొట్టాలని కోరుతూ అస్సాంలోని స్థానికులు 1970వ దశకం చివరనుండి అనేక ఏళ్లపాటు ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం ఫలితంగానే 1982వ, 1983వ సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అస్సాం నుండి విదేశీయులను వెళ్లగొట్టడం. ఈ ఒప్పందం కుదిరిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉండేది. ఈ ఒప్పందాన్ని అమలు జరుపడంలో భాగంగానే ‘ఎన్‌ఆర్‌సి’ రూపొందింది. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ‘ఎన్‌ఆర్‌సి’ వల్ల మానవ అధికారాలకు భంగం వాటిల్లుతుందన్న వాదం వినిపిస్తున్నాయి. ఎవరి అధికారాలకు భంగం వాటిల్లుతుంది?
అస్సాంలోకి బంగ్లాదేశీయ ముస్లింలు చొరబడుతుండడం 1947 నాటి అఖండ భారత విభజనతో ముడివడిన వైపరీత్యం. దేశ జనాభాలో ఇస్లాం మతస్థులు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. అవశేష భారత్‌లో అనాది వలె ‘సర్వమత సమభావ వ్యవస్థ’ కొనసాగుతోంది. కాని ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న పాకిస్తాన్‌లో మాత్రం అన్యమత విధ్వంసకరమైన ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. ఫలితంగా పశ్చిమ పాకిస్తాన్‌లో 1947లో ఇరవై నాలుగు శాతం ఉండిన హిందువులను ‘జిహాదీ’లు 1948 నాటికి నిర్మూలించారు. పశ్చిమ పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య ఒక శాతం కంటె తక్కువకు దిగజారింది. తూర్పు పాకిస్తాన్ (1971 నుంచి బంగ్లాదేశ్)లో అల్పసంఖ్యలోని హిందువులు 1947లో ముప్పయి మూడు శాతం. ప్రస్తుతం హిందువుల సంఖ్య బంగ్లాదేశ్ జనాభాలో ఎనిమిది శాతం కంటె తక్కువ. ఇలా ఇస్లాం మతస్థులు ‘మెజారిటీ’గా ఉన్న పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకుల నిర్మూలన జరగడం ధ్రువపడిన వాస్తవం! అస్సాంను, పశ్చిమ బెంగాల్‌ను సైతం ఇస్లాం మతస్థుల బాహుళ్య ప్రాంతాలుగా మార్చాలన్న జిహాదీ మతోన్మాద పథకంలో భాగంగా 1947 నుంచి బంగ్లాదేశ్‌లోని ముస్లింలు ఈ రెండు ప్రాంతాలలోకి చొరబడినారు. ఫలితంగా అస్సాంలోను పశ్చిమ బెంగాల్‌లోను జనాభా నిష్పత్తిలో తీవ్రమైన వైపరీత్యాలు ఏర్పడినాయి. అస్సాంలోని అనేక జిల్లాలలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి స్థిరపడిన అక్రమ ప్రవేశకులు ‘మెజారిటీ’గా మారడం ప్రపంచంలో మరెక్కడా జరగని విపరిణామం. ఈ అక్రమ ప్రవేశకులలో జిహాదీ బీభత్సకారులు కలసి ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి కోటి మందికి పైగా చొరబడి ఉన్నట్టు ప్రభుత్వాలు వివిధ సందర్భాలలో ధ్రువపరచాయి. ‘ఉద్యమకారుల’ అనధికార ధ్రువీకరణల మేరకు ఈ ‘చొరబడినవారి సంఖ్య’ కోటిన్నర. ఏది ఏమైనప్పటికీ అస్సాం జన జీవనం బీభత్స ప్రమాద నిలయం కావడానికి బంగ్లాదేశ్ నుంచి చొరబడినవారు కారణం. 2003లో కరీంగంజ్ జిల్లాలో కల్పనా డే అన్న తొమ్మిదవ తరగతి బాలికను బంగ్లాదేశ్ జిహాదీలు లైంగిక అత్యాచారానికి గురిచేసి హత్యచేశారు. అస్సాంలో సగటున ప్రతిరోజు ఒక బాలిక ఇలా లైంగిక అత్యాచారానికి గురవుతోందని, బంగ్లాదేశీయ జిహాదీలు ఈ బీభత్సకాండ సాగిస్తున్నారని ఆ తరువాత పూర్ణిమా అద్వానీ నాయకత్వంలోని ‘జాతీయ మహిళా సాధికార సంఘం’ ధ్రువీకరించింది.
మైదాన ప్రాంతంలో బంగ్లాదేశీయులు నిర్నిరోధంగా ఇలా స్థానికుల జన జీవనాన్ని అల్లకల్లోలం పాలుచేశారు. వనవాసీలు మాత్రం బంగ్లాదేశీయులను ప్రతిఘటించారు. ప్రత్యేక ‘బోడో’ రాష్ట్రం కావాలన్న కోర్కె ఈ ప్రతిఘటన ఫలితం! విదేశీయులను గుర్తించడానికి 1983లో ఏర్పడిన ‘న్యాయ మండలుల ద్వారా అక్రమప్రవేశకుల గుర్తింపు’ చట్టం ఘోరంగా విఫలమైంది. ఇరవై మూడేళ్ల తరువాత సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దుచేసింది. ఇలా దశాబ్దుల సంఘర్షణ జరిగిన తరువాత కూడ కేవలం నలబయి లక్షల మంది మాత్రమే అక్రమ ప్రవేశకులని నిర్ధారణ కావడంతో ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’ అయింది. అక్రమంగా చొరబడిన మరిన్ని లక్షల ‘తోడేళ్లు’, ‘గుంట నక్కలు’ ‘ఎన్‌ఆర్‌సి’కి ఎక్కిపోయాయన్న మాట. ఎవరి ‘వ్యూహం’ ఇది??