సంపాదకీయం

భూమికి విముక్తి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో నెలకొని ఉన్న ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’లో అనేకం పాడుపడి ఉన్నాయట! ఆర్థిక మండలాల ప్రాంగణాలలో చొరబడి వేల ఎకరాల భూమిని కారుచౌకగా కాజేసిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ప్రధానంగా విదేశాలకు చెందిన ‘దోపిడీ ముఠాలు’, దళారీ బృందాలు ఈ భూమిని నిర్దిష్ట పారిశ్రామిక కలాపాలకు కాక ఇతర అక్రమ వాణిజ్య కలాపాలకు ఉపయోగిస్తుండడం కూడ బహిరంగ రహస్యం. దేశంలో మూడువందల యాబయి ఐదు ‘ప్రత్యేక ఆర్థిక మండలులు’ ఏర్పాటయి ఉన్నాయన్నది ఇటీవల లోక్‌సభలో ప్రభుత్వం ధ్రువీకరించిన మహా విషయం. వీటిలో రెండువందల ఇరవై మూడు ‘మండలుల’ ప్రాంగణాలలో మాత్రమే నిర్దిష్ట పారిశ్రామిక కలాపాలు ఎంతోకొంత మేరకు నడుస్తున్నాయట. అంటే, దేశవ్యాప్తంగా నూట ముప్పయి రెండు ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’ నిరుపయోగంగా పడి ఉన్నాయన్నది ఆధికారిక నిర్ధారణ. ఈ ఆర్థిక మండలాల కోసం ప్రభుత్వాలు రైతులను ఒప్పించి, ఒత్తిడి చేసి, మభ్యపెట్టి, హింసించి సేకరించిన వ్యవసాయ భూమి నిరుపయోగంగా పడి ఉంది. వ్యవసాయ భూములను మాత్రమే కాదు అటవీ భూములను సైతం ప్రభుత్వాలు ఆర్థిక మండలాలకు కేటాయించాయి. ఇందుకోసం ఆయా అటవీ ప్రాంతాల నుంచి వనవాసీ ప్రజలను వెళ్లగొట్టారు కూడ. ఇంత ఆర్భాటం జరిగాక ఏర్పడిన ప్రత్యేక ఆర్థిక మండలులలో దాదాపు నలబయి శాతం ఇలా పాడుపడి ఉండడం, భూమి బీడుపడి ఉండడం ‘ప్రపంచీకరణ’ వైపరీత్యాలలో ఒకటి మాత్రమే. ‘తెలంగాణ’లో యాబయి ఎనిమిది ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’ ఏర్పడ్డాయన్నది లోక్‌సభలో వెల్లడైన వాస్తవం. కానీ ఇందులో దాదాపు సగం- ఇరవై ఎనిమిది ‘ఆర్థిక మండలులు’- పాడుపడి ఉన్నాయట! పాడుపడి ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలాలలో రెండు ప్రభుత్వ భూములలో నెలకొని ఉన్నాయట. మిగిలినవి ప్రభుత్వేతర వ్యవసాయ భూములలో ఏర్పడి ఉన్నాయి. ఇలా పనిచేయని ‘ఆర్థిక మండలుల’ యజమానుల నుంచి భూమిని వెనక్కి తీసుకోవడానికి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించడం జనానికి ఊరట కలిగించదగిన పరిణామం. ఇలాంటి ‘పనిచేయని’ ఆర్థిక మండలాలు దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నాయట! ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో ఉందట! ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఆరు ‘ప్రత్యేక ఆర్థిక మండలులు’ ఆధికారికంగా ఏర్పాటయి ఉండగా ఎనిమిది మండలుల ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇలా ఆర్థిక మండలుల ఏర్పాటుతోను, ఏర్పాటు పేరుతో జరిగిన అక్రమాలలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 నాటికి దేశంలో అగ్రగామిగా ఉండడం చరిత్ర..
‘ప్రత్యేక ఆర్థిక మండలి’- స్పెషల్ ఎకనామిక్ జోన్- సెజ్- పారిశ్రామిక ప్రగతికి ‘ప్రతీక’- అన్నది ఏళ్లతరబడి జరిగిన ప్రచారం, జరిగిపోతున్న ఆర్భాటం. ప్రత్యేక ఆర్థిక మండలుల వల్ల అవినీతి ప్రబలడం అసలు వాస్తవం. ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- పేరుతో జరిగిపోతున్న అనేక ఘోరాలలో, ఆర్థిక నేరాలలో ‘్భ బకాసురత్వం’ అతి ప్రధానమైనది. కానీ ఘోరాలు నేరాలు అక్రమాలు సక్రమమై పోవడం, చట్టబద్ధమై పోవడం ‘మార్కెట్ ఎకానమీ’ సృష్టిస్తున్న మాయాజాలంలో భాగం. మార్కెట్ ఎకానమీ- స్వేచ్ఛా విపణి వ్యవస్థ- ఏర్పరచిన ‘అంతర్జాతీయ కృత్రిమ అనుసంధానం’ ఫలితంగా విదేశాల నుంచి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- నందన వనంలోకి చొరబడే అడవి పందుల వలె మన దేశంలోకి చొరబడిపోయాయి. ఈ దోపిడీ సంస్థలకు వందల, వేల, లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని, అటవీ భూమిని కట్టబెట్టడం పాతికేళ్లకు పైగా ప్రభుత్వాల ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ప్రజల సమష్టి హితానికి ప్రభుత్వం నిర్వహించే పథకాల కోసం అటవీ భూమిని కేటాయించడం, వ్యవసాయ భూమిని సేకరించడం ఒకటిన్నర శతాబ్దులకు పైగా ఈ దేశంలో నడిచిన కథ. వాణిజ్య సంస్థలు తమకు కావలసిన భూమిని తమంతతాము కొనుగోలు చేసుకోవలసి వచ్చేది. ప్రభుత్వేతర వాణిజ్య పారిశ్రామిక సంస్థల లక్ష్యం ప్రధానంగా తాము లాభాలను ఆర్జించడం మాత్రమే, ప్రజల సమష్టి హితం ఈ సంస్థల లక్ష్యం కాదు, కాలేదు. స్వదేశీయ వాణిజ్య సంస్థలకు ఈ దేశం పట్ల మమకారం ఉంది, జాతీయతా నిష్ఠ ఉంది. ఇది సాధారణ నియమం. ఈ ‘నిష్ఠ’, మాతృదేశ మమకారం లేని విద్రోహులు వాణిజ్య పారిశ్రామిక వేత్తలలో ఉన్నారు. ఇది అపవాదం.
అంతర్జాతీయ అనుసంధానం ఫలితంగా దేశంలోకి చొరబడిన విదేశీయ సంస్థలకు ఈ దేశం పట్ల మమకారం సహజంగానే లేదు. తక్కువ పెట్టుబడులతో ఈ దేశ ప్రజల నుండి ఇబ్బడిముబ్బడిగా లాభాలను సంగ్రహించుకొని తమ దేశాలకు తరలించుకొని వెళ్లడం ఈ విదేశీయ సంస్థల లక్ష్యం! ఇలాంటి విదేశీయ సంస్థలకు, బహుళ జాతీయ సంస్థలకు ప్రభుత్వాలు నడుములను బిర్రుగా బిగించుకొని ప్రజల నుండి భూమిని సేకరించి పెట్టవలసిన అవసరం లేదు. ఆయా విదేశీయ సంస్థలు కాని, స్వదేశీయ వాణిజ్య సంస్థలు కాని తమ పరిశ్రమల స్థాపన కోసం లేదా వ్యాపార కలాపాల కోసం వలసిన భూములను ప్రభుత్వం నుంచి కాని వ్యవసాయదారుల నుంచి కాని కొనుగోలు చేసుకోవాలి. ఈ కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం ఉండరాదు. విదేశీయ సంస్థలు మన దేశంలో పరిశ్రమలను పెడుతున్నది, సేవలను అందిస్తున్నది మన దేశ ప్రజలను ఉద్ధరించడానికి కాదు, కేవలం తమ లాభాల కోసమే. కానీ ప్రపంచీకరణ మొదలైన తరువాత మన ప్రభుత్వాలు మన దేశంలో పెట్టుబడులను పెట్టవలసిందిగా దేబిరించడం ఆరంభమైంది. ఇలా పెట్టుబడులను మోసుకొని వస్తున్న వారికోసం ప్రభుత్వాలు కారుచౌకగా భూమిని సేకరిస్తున్నాయి, విద్యుత్తును ఇంధనాన్ని దాదాపు ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఏళ్లతరబడి సకలవిధ శుల్కాల నుంచి సుంకాల నుంచి ఈ విదేశీయ సంస్థలకు మినహాయింపులను ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే 1894నాటి ‘్భమి సేకరణ చట్టం’కింద వ్యవసాయదారుల నుంచి భూమిని లాక్కొని పారిశ్రామికవేత్తలకు సమర్పించడం మొదలైంది. ఈ బ్రిటన్ దురాక్రమణ నాటి చట్టం కాలదోషం పట్టిందని సర్వోన్నత న్యాయస్థానం పదే పదే వ్యాఖ్యానించడం 2013లో ప్రభుత్వం కొత్తగా భూమి సేకరణ చట్టాన్ని చేసింది..
ఇదంతా చాలదన్నట్టు 2005-2006 నుంచి అమలు జరుగుతున్న ‘ప్రత్యేక ఆర్థిక మండలుల’ చట్టం మన వ్యవసాయ భూమికి ‘చీడ’లాగా తయారైంది, మన అడవుల పాలిట ‘గొడ్డలి’గా మారింది. ఈ చట్టం ప్రకారం జరుగుతున్న లక్షల ఎకరాల భూమి సేకరణ కార్యక్రమం ఆకుపచ్చని అడవులలో చిచ్చుపెట్టింది, వ్యవసాయ భూములను రక్తసిక్తం చేసింది. ‘పోస్కో’ ‘వేదాంత’ ‘లావాసా’ ’‘డీబీర్స్’ ‘అరేనా’వంటి సంస్థల పారిశ్రామిక ప్రాంగణాల ఏర్పాటుకు వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల వారు రైతుల కళ్ల ఎదుటనే వరి పొలాలకు నిప్పుపెట్టడం చరిత్ర. తమలపాకుల తోటలను, కాచేపూచే ఫల వృక్షాలను నరికివేయడం చరిత్ర! ఎలాంటి రాయితీలను కల్పించకపోయినప్పటికీ వ్యాపారం చేసుకొని లాభాలను ఆర్జించదలచే విదేశీయ సంస్థలు మన దేశంలో పెట్టుబడులను పెడతాయి. అందువల్ల ‘మేము మీ దేశంలో పెట్టుబడులను పెడతాము, పరిశ్రమలను నెలకొల్పుతాము.. అనుమతి ఇవ్వండి!’ అని విదేశీయులు మన ప్రభుత్వాలను ప్రాధేయపడతారు. మన ప్రభుత్వాలు విదేశీయులను పెట్టుబడుల కోసం దేబిరించడం మానివేసినట్టయితే!