సంపాదకీయం

మతోన్మాద ‘మమత’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరచి ఆర్భాటం చేసినట్టయితే అబద్ధాలు నిజాలైపోతాయని, నిజాలు అబద్ధాలుగా మారిపోతాయని విశ్వసించడం అవకాశవాదపు రాజకీయంలో భాగం. ప్రతిపక్షాలకు అవకాశం వచ్చింది, అందువల్ల అరుపులు పెడబొబ్బలు ఆకాశాన్ని అంటుతున్నాయి, విద్రోహపు మంటలను దేశమంతటా అంటించడానికి ప్రయత్నిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అబద్ధాల ఆర్భాటపు పథంలో పెద్దపెద్ద అడుగులేస్తూ అగ్రగామిగా ఉండడం ఆవిష్కృతవౌతున్న భీకర దృశ్యం, రాజకీయ బీభత్సం... కాంగ్రెస్ పార్టీ వారు ఆమెకు దీటుగా ఈ ఆర్భాటపు దారిలో ఉద్యమిస్తున్నారు, తాండవిస్తున్నారు. దేశ హితం కంటె దేశ భద్రత కంటె ‘్భరతీయ జనతాపార్టీ’ని గద్దెదింపడం ప్రధానంగా ఈ అకాండ తాండవకేళి నడుస్తోంది. అస్సాంలో భారతీయులెవ్వరో విదేశీయులెవ్వరో గుర్తించడం కోసం రూపొందిన ‘దేశ పౌరుల జాతీయ సూచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్‌ఆర్‌సి- ప్రస్తుతం ఈ అకాండ తాండవకేళికి ప్రేరకం. ఈ ‘ఎన్‌ఆర్‌సి’ని అమలు జరిపినట్టయితే దేశంలో ‘అంతర్యుద్ధం చెలరేగుతుంది..’-అని మమతా బెనర్జీ హెచ్చరించడం దేశ విద్రోహకర ప్రవృత్తిని ఆవహించిన నిర్భయానికి నిదర్శనం, నిర్లజ్జకు నిదర్శనం. మిగిలిన ప్రతిపక్షాల వారు మమతా బెనర్జీ ఊరంతా తెరచిన నోటిని మూయించడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్ వారు మమత మాటలకు ‘‘ఔరా బరీ’’అంటూ వంత పాడుతున్నారు! ‘ఎన్‌ఆర్‌సి’ వల్ల భారతీయులు భారతదేశంలోనే శరణార్థులుగా మారిపోయారన్నది కూడ ఈ ప్రతిపక్షాల వారు చేస్తున్న నిర్ధారణ. అంటే ‘ఎన్‌ఆర్‌సి’లో చోటు లభించని నలబయి లక్షల మందీ భారతీయ పౌరులేనన్నది వీరి నిర్ధారణ. అందువల్ల, ‘ఎన్‌ఆర్‌సి’లో చోటుదక్కని వీరంతా స్వదేశంలోనే శరణార్థులుగా మారిపోయారన్నది వీరు చెప్పదలచుకున్న, దేశ ప్రజల చేత నిజమని నమ్మించదలచుకున్న అబద్ధం.. దేశంలో శరణార్థులుగా మారిన దేశ ప్రజలు కూడ ఉన్నారు. వారు కశ్మీర్‌లోయ ప్రాంతంలోని హిందువులు, కశ్మీరీ పండితులు, జమ్మూలోని దళితులు, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పిఓకె-నుంచి పారిపోయి వచ్చిన అభాగ్యులు.. ఈ కశ్మీరీలు భారతదేశంలోనే శరణార్థులుగా జీవిస్తున్న భారతీయులు. ఈ శరణార్థుల గురించి భాజపా, శివసేన వంటి అతికొద్ది రాజకీయ పక్షాలకు తప్ప మిగిలిన జాతీయ ప్రాంతీయ పక్షాలకు దశాబ్దులుగా ధ్యాస లేదు, సహానుభూతి లేదు, వారి సమస్య పరిష్కారం పట్ల తపన లేదు..! అస్సాంలోని ‘ఎన్‌ఆర్‌సి’లో చోటుదొరకని నలబయి లక్షల మంది బంగ్లాదేశీయుల పట్ల మాత్రం మమతాబెనర్జీ తదితర ప్రతిపక్ష నాయక బృందాలకు ‘సహానుభూతి’ తన్నుకొని వస్తోంది. ఈ బంగ్లాదేశీయులు దశాబ్దుల తరబడి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారు. ఈ లక్షల మందిలో వేల మంది జిహాదీలు కూడా ఉన్నారు!!
అస్సాంలోని భారతీయులు- ఏ ప్రాంతం వారైనప్పటికీ, వారు 1971 మార్చి 25వ తేదీకి ముందు అస్సాంకు వచ్చి స్థిరపడిన వారైనా, ఆ తరువాత అస్సాంకు వచ్చి స్థిరపడిన వారైనా- అందరికీ ‘ఎన్‌ఆర్‌సి’లో చోటు లభించింది. పొరపాటున ఇతర ప్రాంతాలకు చెందిన భారతీయులకు, అస్సాంలో స్థిరపడి ఉన్న భారతీయులకు ‘ఎన్‌ఆర్‌సి’ ముసాయిదాలో చోటు లభించకపోయినప్పటికీ, డిసెంబర్‌లోగా అలాంటి నిజమైన భారతీయ పౌరులకు ‘ఎన్‌ఆర్‌సి’లో స్థానం లభిస్తుంది. వారు తమ భారత జాతీయతను తాము ఏ ప్రాంతం నుంచి వచ్చి అస్సాంలో స్థిరపడినదీ కూడ ఇలా సమీక్ష ద్వారా ధ్రువపరచుకోవచ్చు. అలాంటి నిజమైన భారతీయులను అస్సాం నుండి ప్రభుత్వం వెళ్లగొట్టదు. కానీ బంగ్లాదేశ్ పౌరులుగా ధ్రువపడిన వారిని అస్సాం నుంచి, దేశం నుండి వెళ్లగొట్టవలసిందే. ఇలా వెళ్లగొట్టడాన్ని మమతాబెనర్జీ కాని, ఆమెకు వంతపాడుతున్న కాంగ్రెస్ వారు కానీ సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ‘ఎన్‌ఆర్‌సి’ని వ్యతిరేకిస్తున్నవారు దేశ ప్రజలకు జవాబు చెప్పాలి! చొరబడిన విదేశీయులను అస్సాం నుండి కానీ మరో ప్రాంతం నుంచి కానీ వెళ్లగొట్టడం, దేశం నుండి తరలించడం కేవలం అస్సాం సమస్య కాదు, విదేశీయులు స్థిరపడి ఉన్న ఆయా ప్రాంతాల సమస్య కాదు.. ఇది మొత్తం దేశ ప్రజల సమస్య.. దేశ ప్రజల ఉపాధికి, భద్రతకు, ప్రగతికి, సంస్కృతికి సంబంధించిన సమస్య!
ప్రతిపక్షాల వారు చెబుతున్నట్టు ఈ నలబయి లక్షల మంది- ఎన్‌ఆర్‌సిలో నమోదు కానివారు- భారతీయులైనట్టయితే అస్సాంలో విదేశీయులు లేరా? బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది దశాబ్దుల తరబడి చొరబడి మన దేశంలో తిష్ఠవేయడం అబద్ధమా?? 1970వ దశకం నుండి అస్సాం గణ సంగ్రామ్ పరిషత్, అస్సాం విద్యార్థి సమాఖ్య వంటి సంస్థలు ‘అస్సాంలోని విదేశీయులను బయటికి పంపించాలని’కోరుతూ ఎందుకు ఏళ్లతరబడి ఉద్యమించినట్టు? బంగ్లాదేశీయులు ఏళ్లతరబడి తిష్ఠవేసి, అస్సాం మైదాన ప్రాంతంలో లక్షల ఎకరాల భూమిని దురాక్రమించారు. బంగ్లాదేశీయులు తమ భూమిని సైతం దురాక్రమించకుండా నిరోధించడానికై కోక్రఝాడ్, చిరాంగ్, బక్షా, ఉదల్‌గిరి జిల్లాల్లోని ‘వనవాసీ’ ప్రజలు ఉద్యమించారు. బోడో తెగకు చెందిన వనవాసులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించారు. బంగ్లాదేశీయుల చొరబాటు నుండి తమ ప్రాంతాన్ని, తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని రక్షించుకొనడానికే ‘బోడో’ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరారు. తమ కోరిక నెరవేరనందున ఆగ్రహించిన ‘బోడో’లలో కొందరు బీభత్సకారులుగా, దేశద్రోహులుగా మారడం వేరే కథ. కానీ దీనికంతకూ మూలం బంగ్లాదేశీయుల చొరబాటు! ఈ చరిత్ర మొత్తం ‘జరగలేదని’ చెప్పడానికి ‘ఎన్‌ఆర్‌సి’ వ్యతిరేకులు విఫలయత్నం చేస్తున్నారు! బెంగాలీ భాషను మాట్లాడే భారతీయులను అస్సాం నుండి వెళ్లగొట్టడానికి ‘ఎన్‌ఆర్‌సి’ద్వారా కుట్ర జరుగుతోందని మమత ఆర్భాటిస్తుండడం వాస్తవానికి మరో ఘోరమైన వక్రీకరణ. అస్సాంలోని బరాక్‌లోయ ప్రాంతంలో బెంగాలీ భాష మాట్లాడే స్థానికులు అనాదిగా అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని అస్సాం నుండి వెళ్లగొట్టాలని ఎవ్వరూ కోరడం లేదు. కానీ బెంగాలీ భాష మాట్లాడే బంగ్లాదేశీయులు లక్షల సంఖ్యలో బరాక్‌లోయ ప్రాంతంలోకి చొరబడి ఉన్నారు. ఈ రెండువర్గాల మధ్య సమానత్వం పాటించడం ఎలా సాధ్యం?
అస్సాంలోకి చొరబడి ఉన్న బంగ్లాదేశీయులు ఇస్లాం మతస్థులు. వీరిని వెళ్లగొట్టినట్టయితే భారత పౌరులైన ఇస్లాం మతస్థులకు కోపం వస్తుందని తద్వారా వివిధ రాష్ట్రాలలోని ముస్లింలు తమకు వోట్లు వేయరని ‘ఎన్‌ఆర్‌సి’ని వ్యతిరేకిస్తున్న రాజకీయ వేత్తలు భయపడుతున్నారు. ఇలా భయపడడం వారి వికృత చిత్తవృత్తికి నిదర్శనం. భారతీయ ముస్లింలకు అవమానకరం. ఎందుకంటె బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకుల ఉనికిని దేశభక్తులైన ఏ మతం వారు కూడ సమర్ధించడం లేదు.. సమర్ధించేవారు దేశద్రోహులు!