సంపాదకీయం

సైనికుల వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు
ఒకడు మతోన్మాద మతిని
మసి చేసిన నిటలాక్షుడు
ఒకడు దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముడు
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసిన అమరుడు’
.. ఈ సమరవీరులు సైనికులు. నిరంతర నిర్నిద్రులైన సైనికులు సరిహద్దులను రక్షిస్తున్నారు. కనుకనే మనమందరం నిర్భయంగా నిద్ర పోగలుగుతున్నాము. సైనికులు భారత సార్వభౌమ అధికార పరిరక్షకులు, భరతమాత యశోవిభవ సంరక్షకులు. ఒక్కొక్క సైనికుడు ఒక్కో ఇటుకగా శత్రు దుర్భేద్యమైన సరిహద్దు గోడ ఏర్పడి ఉంది. ఇలా రక్షణ విధులను నిర్వహిస్తున్న సైనికులు దేశప్రజలకు మిత్రులు, అభయ ప్రదాతలు, త్యాగనిష్ఠకు జీవన రూపాలు, మాతృదేశ చరణాంకిత సముజ్వల దీపాలు.. ఇలాంటి సైనికులను అపకీర్తి పాలుచేయడానికి స్వదేశంలోనే ప్రయత్నాలు జరుగుతుండడం జాతీయ వైపరీత్యం! దేశద్రోహులను, బీభత్సకారులను సైనికులు వధించినప్పుడల్లా పథకం ప్రకారం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సైనికులు బీభత్సకారులను వధించలేదని, అమాయకులైన సామాన్య పౌరులను హత్య చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పథకాన్ని అమలు జరుపుతున్నవారిలో ఎక్కువమంది పాకిస్తాన్ సమర్ధకులు, చైనా సమర్ధకులు, ప్రచ్ఛన్న దేశద్రోహులు, జిహాదీలను, మావోయిస్టులను పరోక్షంగా సమర్ధిస్తున్నవారు. వీరిలో కొందరు ‘మానవ అధికార’ పరిరక్షణ సంఘాల పేరుతో చెలామణి అవుతున్నారు. వీరి ‘రుసరుసలు’, ‘బుసబుసలు’ దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ సీమలలో వికృతంగా వినిపిస్తున్నాయి. మన దేశాన్ని అప్రతిష్ఠ పాలుచేసి బలహీన పరచడానికి యత్నిస్తున్న దేశాల వారికి ఇది గొప్ప అవకాశం. భారత ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని, దమనకాండ సాగిస్తోందని అంతర్జాతీయ వేదికలపై ఈ భారత వ్యతిరేకులు తీర్మానాలను ఆమోదిస్తున్నారు. ‘ఇస్లాం దేశాల సమాఖ్య’- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్- ఓఐసీ- వారు దాదాపుప్రతి వార్షిక సమావేశంలోను ‘కశ్మీర్‌లో భారత ప్రభుత్వం అమాయక ప్రజల హక్కులను కాలరాస్తోంది, హత్యాకాండ జరుపుతోంది..’ అన్న తీర్మానాలను ఆమోదిస్తున్నారు. ‘ఐరోపా సమాఖ్య’- యూరోపియన్ యూనియన్- వారు సైతం ‘్భరతదేశంలో మానవ అధికారాలకు జరిగిపోతున్న హాని’ గురించి కన్నీళ్లు కారుస్తున్నారు. అమెరికా ప్రభుత్వం వారు అప్పుడప్పుడు ‘హక్కులను రక్షించవలసిన ఆవశ్యకత’ గురించి మన ప్రభుత్వానికి పాఠాలు చెబుతున్నారు. నిజానికి మన దేశాన్ని విమర్శిస్తున్న ఈ దేశాల ప్రభుత్వాలు వివిధ రకాల బీభత్సకాండను, దమనకాండను జరిపిస్తున్నాయి. ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగని మన దేశంలో దమనకాండ జరిగిపోతున్నట్టు ‘దండోరా’ వేస్తున్నాయి. దీనికంతటికీ కారణం మన దేశంలోనే సైనిక దళాలకు వ్యతిరేకంగా జరిగిపోతున్న ప్రచారం. తమకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో అబద్ధపు అభియోగాలు దాఖలు కాకుండా నిరోధించాలని కోరుతూ మూడువందల మంది సైనిక అధికారులు సర్వోన్నత న్యాయస్థానంలో ‘యాచిక’- పిటిషన్-ను దాఖలు చేయడానికి ఇదంతా నేపథ్యం..
మూడువందల మంది సైనిక అధికారులు మంగళవారం ఈ న్యాయ యాచికను దాఖలు చేశారు. మణిపూర్‌లో సైనికులు, పోలీసులు అమాయక ప్రజలను విద్రోహులుగా ముద్ర వేసి ఎదురుకాల్పుల పేరుతో హతమార్చుతున్నారన్నది జరుగుతున్న ప్రచారం. ఇలాంటి ఎదురుకాల్పులకు సంబంధించి పదిహేను వందలకు పైగా అభియోగాలు సైనికదళాలకు వ్యతిరేకంగా నమోదయ్యాయట! నిబంధనల మేరకు విధులను నిర్వహిస్తున్న నిరపరాధులైన సైనికులకు వ్యతిరేకంగా అబద్ధపు అభియోగాలు దాఖలవుతున్నాయన్నది సుప్రీం కోర్టులో ‘పిటిషన్’ దాఖలు చేసిన సైనిక అధికారులు చేస్తున్న వాదం. జమ్మూ కశ్మీర్‌లో విధులను నిర్వహిస్తున్న సైనికులకు వ్యతిరేకంగా కూడ ఇలా హత్యాభియోగాలు దాఖలు అవుతుండడం నడుస్తున్న చరిత్ర.. మేజర్ ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ పోలీసులు దాఖలు చేసిన అభియోగాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన తండ్రి లెఫ్టినెంట్ జనరల్ కర్మవీర్ గత ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయవలసి రావడం సైనికులు మానసికంగా గురవుతున్న క్షోభకు మరో నిదర్శనం. సైనిక దళాలపై రాళ్లు రువ్వుతుండిన దుండగుల మూకపై కాల్పులు జరపడం మేజర్ ఆదిత్యనాథ్ చేసిన ‘నేరం’! ఆయనకు వ్యతిరేకంగా చర్యలను ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. కానీ ఇలా విధులను నిర్వహించిన సైనికులపై అభియోగాలను మోపడం వల్ల సైనికుల నైతిక స్థైర్యం దిగజారిపోతోంది..
విద్రోహులు విచ్చలవిడిగా విహరిస్తున్న ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోను సైనికులు అసాధారణ స్థితిని అతిగమించి విధులను నిర్వహించవలసి వస్తోందని పదునాలుగవ తేదీన ‘న్యాయ యాచిక’ను దాఖలు చేసిన సైనిక అధికారులు సుప్రీం కోర్టుకు నివేదించారు. ఇలా అతిగమించి విధులను నిర్వహిస్తున్న సైనికులకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో చర్యలు ఆరంభమైనట్టయితే, విధులను నిర్వహించాలా? వద్దా? అన్న సందేహానికి వారు గురికావలసి ఉంటుందని ‘యాచిక’లో పేర్కొన్నారు. శత్రువులతో యుద్ధం చేసినట్టయితే- తమకు వ్యతిరేకంగా న్యాయ చర్యలు ఆరంభం కాగలవని, తమకు జైలుశిక్షలు తప్పవని సైనికులు భయపడుతున్నారని కూడ న్యాయ యాచికలో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారట! సైనికులు నేరం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించినట్టయితే వారిని న్యాయస్థానాల్లో విచారించకుండా మినహాయింపు ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని 2016లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత పోలీసులు, కేంద్ర నేర పరిశోధక మండలి-సీబీఐ- వారు మణిపూర్‌లోను, జమ్మూ కశ్మీర్‌లోను సైనికులకు వ్యతిరేకంగా అభియోగాలను దాఖలు చేస్తున్నారు..
మణిపూర్ తదితర ఈశాన్య ప్రాంతాల్లోను, జమ్మూ కశ్మీర్‌లోను విద్రోహకాండ, బీభత్సకాండ కొనసాగుతుండడం బహిరంగ రహస్యం. పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ కశ్మీర్‌లోను, చైనా మద్దతుతో ఈశాన్య ప్రాంతంలోను సాయుధ విద్రోహులు నిరంతరం బీభత్సకాండ జరుపుతున్నారు. మూడేళ్ల క్రితం మన సైనిక దళాలు బర్మాలోకి చొచ్చుకొనిపోయి చైనా తొత్తుల బీభత్సపు బట్టీలను బద్దలుకొట్టవలసి వచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌లోకి సైతం మన సైనికులు చొచ్చుకొని వెళ్లి ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- జరుపవలసి వచ్చింది. ఇలా నలువైపులా ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో సైనికులకు వ్యతిరేకంగా అభియోగాలు దాఖలైనట్టయితే, అది సైనికుల చేతులను కట్టేసినట్టు కాగలదు.. సైనికులు నేరాలు చేయాలని ఎవరూ కోరడం లేదు. కానీ....!