సంపాదకీయం

‘వాల్‌మార్ట్’ సామ్రాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫ్లప్‌కార్ట్ అన్న మన దేశానికి చెందిన పంపిణీ సంస్థను ‘వాల్‌మార్ట్’ అన్న అమెరికా వారి ‘వ్యాపార రాక్షసి’- బిజినెస్ జెయింట్- దిగమింగడానికి రంగం సిద్ధం కావడం ‘ప్రపంచీకరణ’ ప్రగతి ప్రహసనంలో ప్రస్తుత ఘట్టం. ‘విభజించి పాలించు’ అన్నది బ్రిటన్ సామ్రాజ్యవాదులు మన దేశంలో అనుసరించిన నీతి. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో మన దేశంలో వ్యాపార సామ్రాజ్యం స్థాపించి విస్తరింపచేసుకున్న బ్రిటన్ వారి ‘ఈస్టిండియా’కంపెనీ పద్దెనిమిదవ శతాబ్దిలో రాజకీయ దురాక్రమణ సామ్రాజ్యవాదశక్తిగా అవతరించడం చరిత్ర! ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ కథ, భారతీయుల మూర్ఖపు వ్యథ పునరావృత్తం అవుతోంది. ‘పునరావృత్తి’ని నిరోధించవలసిన పాలకులు, మేధావులు, సంపన్నులు, విచక్షణ గల మధ్యతరగతి వారు ‘పునరావృత్తి’కి దోహదం చేస్తుండడం వ్యథ. ‘వాల్‌మార్ట్’ మన దేశంలోని చిల్లర వ్యాపారంలోకి- పంట పొలంలోకి అడవి పంది వలె చొరబడడానికి 2012లో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వీలు కల్పించింది, వాణిజ్యపు సరిహద్దుల గోడలను పగులగొట్టింది. ఆ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన భాజపా ఈ వాణిజ్య దుశ్చర్యకు పాల్పడిన మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తీవ్రంగా అభిశంసించింది. ‘వాల్‌మార్ట్’ చొరబాటును తీవ్రంగా నిరసించింది. తమ పార్టీవారు- మన దేశంలో ‘వాల్‌మార్ట్’ తన దుకాణాలు తెరవకుండా నిరోధించగలరని లోక్‌సభలో ‘్భజపా’ నాయకురాలు సుషమా స్వరాజ్ ప్రకటించింది కూడ. తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే చిల్లర వ్యాపారం నుంచి ‘వాల్‌మార్ట్’ను, ఇతర విదేశీయ వాణిజ్య సంస్థలను వెళ్లగొడతామని గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ‘్భజపా’ అధినేతలు భీషణ ప్రతిజ్ఞలు చేశారు! భాజపా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయింది, ‘వాల్‌మార్ట్’ను వెళ్లగొట్టలేదు, చిల్లర వ్యాపారంలో ‘విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని’- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్- ఎఫ్‌డిఐ-ని నిషేధించలేదు. విస్తరించిపోయిన, విస్తరించిపోతున్న ‘వాల్‌మార్ట్’ ఇప్పుడు స్వదేశీయ సంస్థ ‘్ఫ్లప్‌కార్ట్’ను దిగమింగడానికై తన అంతర్జాతీయ వికృత వదన గహ్వరాన్ని తెరుస్తోంది! చిన్న చేపలను పెద్ద చేపలు మింగుతాయట, ‘ప్‌కార్ట్’ను ‘వాల్‌మార్ట్’, భారతీయ సంస్థలను విదేశీయ బహుళ జాతీయ వాణిజ్యసంస్థలు దిగమింగుతున్నాయి...
గతంలో ‘ఈస్టిండియా’ కంపెనీవలె ‘వాల్‌మార్ట్’ కూడ ప్రస్తుతం ‘విభజన’ నీతిని అమలు జరుపుతుండడం ‘్ఫ్లప్‌కార్ట్’ వ్యథకు కారణం. 2005లో సచిన్ బన్సల్, బినయ్ బన్సల్ అనే ఇద్దరు ఢిల్లీ ఇంజనీర్లు ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారట! సమాచార సాంకేతిక, వ్యాపార, పంపిణీ రంగాలలో అతిపెద్ద సంస్థలలో ఒకటిగా అవతరించిన ‘్ఫ్లప్‌కార్ట్’ ఆస్తుల విలువ దాదాపు లక్షా ముప్పయి వేల కోట్ల రూపాయలని ‘వాల్‌మార్ట్’ నిర్ధారించిందట. ఇందులో డెబ్బయి శాతం వాటాను ‘వాల్‌మార్ట్’కు అమ్మడానికి ‘్ఫ్లప్‌కార్ట్’ అంగీకరించడం ‘స్వేచ్ఛా వాణిజ్యం’- మార్కెట్ ఎకానమీ- విస్తరింపచేస్తున్న మారీచ మాయాజాలంలో భాగం. సచిన్ బన్సల్ ఈ అమ్మకాన్ని వ్యతిరేకించినప్పటికీ బినయ్ బన్సల్ మాత్రం విక్రయాన్ని పక్కా చేశాడట! ‘వాల్‌మార్ట్’కు తోకగా మారనున్న ‘్ఫ్లప్‌కార్ట్’ నిర్వహణ బాధ్యతల నుంచి సచిన్ బన్సల్ తప్పుకోనున్నాడట! ఇలా మిత్రుల మధ్య, వాణిజ్య భాగస్వాముల మధ్య ‘చీలిక’ను కల్పించడం ఐరోపావారి ‘విభజన నీతి’ వారసత్వం. అమెరికాలోని ఆంగ్లేయులు వివిధ ఐరోపా జాతుల ఉమ్మడి వాణిజ్య వారసులు! అందువల్లనే నాటి ‘ఈస్టిండియా’ కంపెనీ చేసిన ‘బాట’ను ఐరోపా, అమెరికా దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్యసంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఎమ్‌ఎన్‌సి- మన దేశంలో పునరుద్ధరిస్తోంది. మన పాలకులు ‘నిమ్మకు నీరెత్తి’ గుడ్లు మిటకరిస్తూ గుటకలు మింగుతున్నారు!
‘విదేశాల పెట్టుబడుల’ మత్తెక్కిన ప్రభుత్వాలు ఈ చరిత్ర పునరావృత్తిని గ్రహించడం లేదా? గ్రహించినప్పటికీ దేశ భవిష్యత్తు, ఆర్థిక స్వాతంత్య్ర సార్వభౌమ అధికారం గురించి వీరికి పట్టడం లేదా? నిలదీయవలసిన ప్రజలకు- ప్రజలంటే ప్రజలలోని మేధావులకు, ఉద్యమకారులకు, విద్యావంతులకు, ప్రజాహిత న్యాయ యాచికలను నిరంతరం దాఖలుచేస్తున్న వారికి కూడ ముంచెత్తుతున్న ముప్పును గురించి ధ్యాసలేదు. దీంతో మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వారి ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’ విధానాన్ని మోదీ ప్రభుత్వం మరింత ‘చిత్తశుద్ధి’తో కొనసాగిస్తోంది. దేశాన్ని పదేళ్లపాటు దివాలా తీయించిన ‘మన్‌మోహనీయ’ విధానానికి ‘ప్రత్యామ్నాయ శక్తి’గా మోదీ ప్రభుత్వం పనిచేయగలదని ప్రజలు భ్రమించారు. మోదీ ప్రభుత్వం- ఆర్థిక విధానానికి సంబంధించినంతవరకు- ‘ప్రత్యామ్నాయం’-ఆల్టర్‌నేటివ్- కాలేదు, ‘పర్యాయం’- సబ్‌స్టిట్యూట్-గా మారింది! ‘విదేశాల పెట్టుబడులతో కాక స్వదేశంలోని పెట్టుబడులతో మాత్రమే ప్రగతిని సాధిస్తాం’ అని 2014లో ప్రకటించిన ‘్భజపా’వారు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ సంగతిని మరచిపోయారు. చిల్లర వ్యాపారం నుండి తమను ‘్భజపా’ ప్రభుత్వం వారు వెళ్లగొట్టడం ఖాయమన్న భయంతోనే 2014 నాటి ఎన్నికల ప్రచార సమయంలో ‘క్యారీఫార్’ వంటి ఫ్రాన్స్ సంస్థలు, ఇతర విదేశీయ సంస్థలు మన దేశంలోని తమ దుకాణాలను మూసివేశాయి. ‘తట్టబుట్ట తపేలాల’ను సర్దుకొని నిష్క్రమించాయి! కానీ ‘వాల్‌మార్ట్’ మాత్రం గోడకింది తోడేలు వలె పొంచి ఉంది, ఓపికగా కాచుకొంది! ఎందుకంటె మన దేశంలో ‘చిల్లర వ్యాపారం’లోకి చొరబడడానికి వీలుగా ‘సంబంధితుల’ను ప్రభావితం చేయడానికై వందల కోట్ల రూపాయలను 2012వ సంవత్సరానికి పూర్వమే ‘వాల్‌మార్ట్’ ఖర్చుపెట్టింది. అమెరికా ‘కాంగ్రెస్’- పార్లమెంట్- స్వయంగా ధ్రువపరిచిన ఈ ‘లంచాలు’ ఎవరెవరు భోంచేశారో మరి.. 2012లో ‘వాల్‌మార్ట్’ మన చిల్లర వ్యాపారంలోకి చొరబడింది. ఈ ‘లంచాల’కు ‘వాల్‌మార్ట్’ వంటి సంస్థలు పెట్టిన పేరు ‘ప్రచార వ్యయం’.
తమ భయం కేవలం ‘భ్రాంతి’ అని తెలుసుకున్న ‘వాల్‌మార్ట్’ దేశవ్యాప్తంగా దుకాణాలను తెరుస్తోంది. ‘ఎఫ్‌డిఐ’ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అత్యధిక రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ‘ఏకాత్మ’్భవనను సాధించి ఉండడం 1990వ దశకం నుంచి కొనసాగుతున్న కథ. తెలంగాణలో దాదాపు ఏడువందల ఎనబయి కోట్ల రూపాయల పెట్టుబడులతో చిల్లర దుకాణాలను ఏర్పాటుచేయడానికి ‘వాల్‌మార్ట్’ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వారి అనుమతిని పొందింది. ఫలితంగా ‘వాల్‌మార్ట్’ వారి ‘బంగారు జింక’ రంగుల హంగులతో- పోటీపడలేని వందలాది స్థానిక చిల్లర దుకాణాలు మూతపడనున్నాయి. దేశమంతటా ఇలాంటి ‘మెగా’చిల్లర దుకాణాలను ‘వాల్‌మార్ట్’ ఏర్పాటుచేస్తుండడానికి కారణం 2014 మే 26వ తేదీ నాటికి పూర్వం అమలుజరిగిన ‘ఎఫ్‌డిఐ’ విధానం ఇప్పటికీ కొనసాగుతుండడం! ‘శ్రీనగరం’- సిరిసిటీ- ప్రాంగణాన్ని ఏపీ ప్రభుత్వం ‘పెప్సీ’వంటి సంస్థలకు అప్పగించింది. ఈ సంస్థలు తీయటి భూగర్భ జలాలను చుక్క మిగలకుండా నాకేసి, విష రసాయన ‘శీతల మధుర’ పానీయాలను మనకు విక్రయిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని- ‘నెజ్‌లే’ వారి ‘చాక్లెట్ల’ను, ‘సేమ్యాల’ను ‘ముక్కులు కార్చుకుంటూ’ చప్పరిస్తున్నవారు గ్రహించాలి, ‘వోల్వో’ బస్సులెక్కి ఊరేగుతున్నవారు గమనించాలి..