సంపాదకీయం

‘ముచికుంద’కు మెరుగు..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసీ నదిని పరిరక్షించడానికి వీలుగా తక్షణ చర్యలను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాదు హైకోర్టు మంగళవారం ఆదేశించవలసిన అనివార్యం ఏర్పడడం- పెరిగిన నీటి కాలుష్య దుస్థితికి మరో నిదర్శనం. ‘మూసీ నదిని సుందర శోభలతో తీర్చిదిద్దడం తరువాతి సంగతి.. మొదట ఈ నది పూర్తిగా కనుమరుగైపోకుండా నిరోధించండి..’ అని ఉన్నత న్యాయస్థానం వారు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం దశాబ్దుల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అభిశంసన వంటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగిన సమయంలో ‘మూసీ పునరుద్ధరణ’కు, ‘మూసీ ప్రక్షాళన’కు పథకాలు రూపొందినట్టు తరచు ప్రకటనలను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. మూసీ ‘మురుగు’ మరింత ‘ముదరడం’ మాత్రమే దశాబ్దుల విపరిణామం. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడ భాగ్యనగరంలోని జలాశయాలను, మూసీ నదిని పునరుద్ధరించి పరిరక్షించి పరిశుభ్రం చేయడానికి పథకాలను రూపొందించినట్టు ప్రచారమవుతూనే ఉంది. హరితహారం, ‘కాకతీయ’ వ్యవసాయ జల ఉద్యమం, ‘్భగీరథ’ మంచినీటి ఉద్యమం వంటి పథకాలు తెలంగాణ వ్యాప్తంగా నదులు, జలాశయాల పునరుద్ధరణకు, ‘స్వచ్ఛత’కు దోహదం చేస్తున్నాయన్న విశ్వాసం వెల్లివిరిసింది. కానీ రాజధాని నగరంలోని ఒకప్పటి జీవధార అయిన ‘ముచికుంద’- మూసీ- నది మాత్రం ఈ నాలుగేళ్లలో మరింతగా సన్నబడిపోయిందని, ‘మురుగు’ మరింతగా కంపుకొడుతోందని జనం అంటున్నారు.. ‘మూసీ’కి ఇరువైపులా నివసిస్తున్నవారు అంటున్నారు. ఈ కఠోర వాస్తవం మంగళవారం ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యమ్ చేసిన వ్యాఖ్యల వల్ల ధ్రువపడింది. మూసీనది పరీవాహక ప్రాంతం పొడవునా ఇరువైపులా నదీ స్థలం అక్రమ ఆక్రమణలకు గురై ఉందన్నది ఉన్నత న్యాయస్థానం చేసిన ధ్రువీకరణ. ఈ ‘దురాక్రమణ’లను తొలగించి మూసీ నదిని యథాపూర్వంగా పునరుద్ధరించాలన్నది ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశం. లేనట్టయితే మూసీ పరీవాహ ప్రాంతంలో ‘కేరళ వంటి వైపరీత్యం’ ఏర్పడబోతుందని హైకోర్టు హెచ్చరించింది కూడ! కేరళ ప్రాంతంలో నదులను ఆక్రమించి అక్రమంగా కట్టడాలను నిర్మించడం వల్లనే వరదనీరు ఎక్కడికక్కడ పొంగిపొరలి జనావాసాలను ముంచెత్తుతోందట! కేరళలో మాత్రమే కాదు, దేశమంతటా నదులను జలాశయాలను పూడ్చివేసి ఆ ప్రదేశాలలో ఇళ్లుకట్టడం దశాబ్దులుగా కొనసాగుతున్న అక్రమ కలాపం. ఉత్తరఖండ్ ప్రాంతంలో నదులకిరువైపులా అక్రమంగా, చట్టాలకు విరుద్ధంగా భవనాలను ఇతర కట్టడాలను ఏర్పాటుచేశారు. దీనివల్లనే నాలుగేళ్లక్రితం ఉత్తరఖండ్‌లో భయంకరమైన వరదలు సంభవించాయి. కేదార్‌నాథ్ వంటి జాతీయ సాంస్కృతిక ప్రదేశాలు వారాల తరబడి ‘బురద’ వరదలలో కూరుకొని పోయాయి. తెలంగాణ ప్రతీక మాత్రమే. హైకోర్టు ఆదేశం ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతటా ఇదే బురద, ఇదే వరద, ఇదే కాలుష్యం, ఇదే దురాక్రమణ...
ముచికుంద నది గోలకొండ రాజ్య ప్రజలకు ప్రత్యేకించి భాగ్యనగర వాసులకు జీవజలాలను అందించడం కాకతీయుల పరిపాలన నాటి ముచ్చట. అంతకు పూర్వం సహస్రాబ్దులుగా ఈ నది శుభ్ర జల ప్రవాహం, స్వయంభువ భాగ్యలక్ష్మీదేవి శిలావిగ్రహాన్ని స్వచ్ఛ ముచికుంద జలాలు అభిషేకించడం చరిత్ర. క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్ది ఆరంభం వరకు కూడ ముచికుంద నీరు పొలాలను పండించింది, పానయోగ్యంగా ఉండేది, స్నానయోగ్యంగా ఉండేది. హైదరాబాద్‌లోని ‘చాదర్‌ఘాట్’ ప్రాంతంలో ముచికుంద ‘జలపాతమై’ పదకొండు అడుగుల ఎత్తునుంచి దూకుతూ ప్రవహించేదట! అనంతగిరి అడవుల నుంచి వివిధ రకాల ఓషధీ ధాతువులను నింపుకొని ప్రవహించిన ముచికుంద నదీ జలాలు ఈ ప్రాంతవాసులకు ఆరోగ్యాన్ని, ఆయువును వృద్ధిచేసిన సుధారస బిందువులు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా ఈ మూసీ నీళ్ల ఔషధ తత్వాన్ని, స్వచ్ఛతను అభివర్ణించి ఉన్నాడు. వంద ఏళ్లలో ‘ముచికుంద’ను అసాంఘిక శక్తులు ఆక్రమించిన తీరుకు కాలుష్యం ముంచెత్తిన తీరుకు ‘మూసీ మురుగు’ వర్తమాన సాక్ష్యం. అసాంఘిక శక్తులను అదుపుచేయడంలో ప్రభుత్వాల వంద ఇరవై ఏళ్ల వైఫల్యానికి, క్రూరమైన నిర్లక్ష్యానికి మూసీ దుస్థితి సజీవ సాక్ష్యం. కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత విదేశీయ మతోన్మాద వారసత్వ ప్రతినిధులైన ‘జిహాదీ’లు సాగించిన బీభత్సపాలనలో ఈ నిర్లక్ష్యం అంకురించింది, శతాబ్దుల తరబడి విస్తరించింది. జిహాదీ బీభత్సకారులైన ‘రజాకార్’లు 1947-1948 ప్రాంతంలో భాగ్యలక్ష్మీదేవి శిలావిగ్రహాన్ని పెకలించి ముక్కలు చేసి పారేశారు. ఈ తల్లిని అభిషేకించిన ‘ముచికుంద’ను అసాంఘిక శక్తులు ఇరువైపులా ఆక్రమించి ఆస్తులుగా మార్చుకున్నాయి..
కనీసం శతాబ్దికి పూర్వం ముచికుంద- మూసీ- నది వెడల్పు ఎంతమేర విస్తరించి ఉండేది? దీన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం ఇప్పుడైన ప్రయత్నించాలి. ఈ ‘వెడల్పున’ ఏర్పడి ఉన్న వివిధరకాల ఆక్రమణలను మొత్తం తొలగించాలి. ఈ విప్లవ చర్యను చేపట్టినట్టయితే ‘అనంతగిరి’ నుంచి నల్లగొండ జిల్లావరకు నది మళ్లీ మొలకెత్తగలదు, స్వచ్ఛత పరిమళించగలదు. తెలంగాణ ప్రభుత్వం ‘్భగీరథ’,‘కాకతీయ’ ఉద్యమాలను వేగవంతంగా నడిపిస్తోందట, ప్రతిపక్షాలవారు అంగీకరించకపోవడం- ఈ వేగం గురించి- వేఱు.. కానీ గోదావరి జలాలను జంట నగరాలలోని ‘నల్లా’- కొళాయి-లకెక్కించడం మాత్రం నిరాకరింపజాలని నిజం. ఇంత ప్రగతి సాధించిన తెలంగాణ ప్రభుత్వం జంట నగరాలలోని చెఱువులను మాత్రం ఎందుకని స్వచ్ఛమైన జలాలతో నింపలేకపోయింది? నాలుగేళ్లు గడిచిపోయాయి.. కనీసం ప్రధానమైన జలాశయాల ‘పునరుద్ధరణ’ సైతం జరగలేదు. ‘స్వచ్ఛ్భారత్’, ‘స్వచ్ఛ తెలుగు రాష్ట్రాలు’, ‘స్వచ్ఛ భాగ్యనగరం’, ‘స్వచ్ఛ అమరావతి’ ఏర్పడబోతున్నట్టు ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ నగరాలలోని జలాశయాల నుంచి వెలువడుతున్న దుర్గంధం ‘స్వచ్ఛ్భారత్’ను ధిక్కరిస్తోంది, ‘స్వచ్ఛ తెలంగాణ’ను వెక్కిరిస్తోంది, ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ను నిలదీస్తోంది. భాగ్యనగరంలోని ‘వినాయక్ సాగర్’-హుస్సేన్ సాగర్- ప్రక్షాళన కార్యక్రమం ఆర్భాటంగా మొదలైంది, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ‘వినాయక్ సాగర్’ జలాలు పరిశుభ్రం అయిపోనున్నట్టు ప్రచారమైంది. అలాజరిగితే లక్షల ‘మట్టి విగ్రహాల వినాయకులు’ హుస్సేన్‌సాగర్ అమలిన జలాలలో హాయిగా స్నానం చేయగలరు. స్వచ్ఛమైన మన్ను స్వచ్ఛమైన నీటిలో కరగిపోయేది. కానీ ‘హుస్సేన్ సాగర్’ నీరు ‘మలమూత్ర’ దుర్వాసన- సెప్టిక్ ఓడర్- కొడుతోందని ‘తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి’- తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- వారి అధ్యయనంలో ధ్రువపడిందట. జంటనగరాలలోని దుర్గంచెఱువు సహా వందల చెఱువులలో నీరు ‘మురుగు’గా మారి ఉండడం ప్రాకృతిక అనారోగ్య స్థితికి నిదర్శనం.. తెలంగాణ ప్రభుత్వం ‘్భగీరథ జలాల’ నిర్వహణ కోసం ముప్పయి బృహత్ స్వచ్ఛ జలాశయాలను నిర్మిస్తోందట. రాజధాని చుట్టూ కూడ ఈ ‘జలనిధి’-వాటర్‌గ్రిడ్- ఏర్పడుతుందట. అలాంటప్పుడు ‘్భగీరథ’ జలాలతో రాజధాని మధ్యలో ఉన్న చెఱువులను ఎందుకు నింపరాదు? గోదావరిని ‘మూసీ’తో కలిపి ముచికుంద ప్రవాహాన్ని ఎందుకని పరుగులెత్తించరాదు??
కేరళలోని ‘పతనం తిట్ట’ జిల్లాలో ‘గరిమ రామతోరు’ అన్న నదిని ఆనవాలు లేకుండా పూడ్చేశారట. ఆ నది ఉండేదన్న ధ్యాస కూడ ప్రజలు కోల్పోయారట. జిల్లా కలెక్టర్ ఆర్.గిరిజ జరిపించిన అధ్యయనం ఫలితంగా ఈ నది- పెద్దవాగు- బయటపడింది. 2015 జూన్‌లో పరివాహ ప్రాంతం పొడవునా తవ్వకాలు జరపడం ఆరంభమైంది. రెండున్నర ఏళ్ల తరువాత ఈ వాగు ‘యథాపూర్వం’గా ప్రవహించడం ఆరంభమైంది. ‘మృతఝరి’ మళ్లీ జీవం పోసుకుంది.. పొలాలను పండిస్తోంది. ఈ శుభకర పరిణామం దేశంలోని ప్రభుత్వాలకు ‘హరిత పాఠం..’