సంపాదకీయం

అంతరిక్ష ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రమండలంలో నీటి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని ధ్రువపడడం పదేళ్లనాటి భారతీయ ‘చంద్రయానం’ సాధించిన చారిత్రక విజయం. మన ‘చంద్రయాన్’ పరిశోధన ఫలితాలను విశే్లషించిన అమెరికా వారి ‘అంతరిక్ష విజ్ఞాన సంస్థ’- నాసా- శాస్తవ్రేత్తలు ఇప్పుడు ఈ వాస్తవాన్ని ధ్రువీకరించారు. అంతరిక్ష పరిశోధనలో అనాదిగా భారతీయులు అగ్రగాములు. గత అనేక శతాబ్దులుగా ‘వెనుకబడి ఉండిన’ మన దేశం అంతరిక్ష విజ్ఞాన పథంలో మళ్లీ దూసుకొని పోతోందనడానికి ఇప్పుడు ‘నాసా’ చేసిన నిర్ధారణ మరో ధ్రువీకరణ. నలబయి నెలలలో భారతీయులు తమంత తాముగా అనంత అంతరిక్ష సీమలలో విహరించనున్నారు. ఈ గగన యాత్ర సన్నాహ సంరంభానికి అమెరికా వారి నిర్ధారణ శుభంకరమైన నేపథ్యం! భారతీయులు గతంలో అమెరికా, రష్యావారి అంతరిక్ష పరిశోధక నౌకలనెక్కి గగన సంచారం చేయడం చరిత్ర. ఇప్పుడు మన విజ్ఞాన నౌకలనెక్కి మనవారు..!! ఇలా ‘అంతరిక్షం’ మన ద్వారం వద్ద కొలువుతీరుతుండడం దశాబ్దుల మన పరిశోధక విజయానికి ప్రత్యక్ష నిదర్శనం. భూమి చుట్టూ పరుగు తీస్తున్న వందల భారతీయ ఉపగ్రహాలు ప్రసారం చేస్తున్న సమాచారం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతోంది, ఋతుపవన గతిని అంచనావేయడానికి ఉపకరిస్తోంది, విద్యాబోధనకు వినియోగపడుతోంది, ప్రచార మాధ్యమ ప్రసారాలను ప్రచోదనం చేస్తోంది! వ్యవసాయ రంగం నుండి రక్షణ రంగం వరకూ సముద్ర యానం నుంచి గగన యానం వరకూ ఉపగ్రహ పరిజ్ఞాన విన్యాసాలకు వేదికలు కావడం ‘్భరతీయ అంతరిక్ష పరిశోధక సంస్థ’- ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్- ఇస్రో- సాధించిన విజయం. విదేశీయ దురాక్రమణ సమయంలో వందల భారతీయ విజ్ఞాన రీతులకు గ్రహణం పట్టింది. మన ఖగోళ విజ్ఞాన ప్రగతి ‘దురాక్రమణ ఆరంభం’ నాటి స్థితిలో స్తంభించిపోయింది. క్రమంగా భారతీయులు తమ ఖగోళ విజ్ఞానాన్ని మరచిపోయారు. లక్షల సంవత్సరాలకు పూర్వం ‘సూర్య సిద్ధాంతం’ ప్రాతిపదికగా జరిగిన అంతరిక్ష పరిశోధనల గురించి భారతీయులు ధ్యాస కోల్పోయారు. కలియుగం నాలుగవ శతాబ్ది-క్రీస్తునకు పూర్వం ఇరవై ఎనిమిదవ శతాబ్ది- నాటి ఖగోళ విజ్ఞానవేత్త ‘ఆర్యభటుడు’ కలియుగం ముప్పయి ఏడవ శతాబ్ది- క్రీస్తుశకం ఐదవ శతాబ్ది- నాటి వాడని భ్రమించే దుస్థితి దాపురించడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం. బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన తరువాత కూడ రెండు దశాబ్దులపాటు నిద్రాణమై ఉంది. మన ‘అంతరిక్ష పరిశోధన’ దాదాపు యాబయి ఏళ్ల క్రితం మళ్లీ ఆరంభమైంది. ఐదు దశాబ్దులలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్ష పథంలో మనం పరిక్రమిస్తుండడం, పరాక్రమిస్తుండడం తరతరాల మన జాతీయ స్వభావంలో నిహితమై ఉన్న విజయ విశ్వాసానికి ప్రత్యక్ష సాక్ష్యం.
మన చంద్రయానంతో, మంగళయానం- కుజగ్రహానికి ప్రస్థానం-తో ఈ విజయ విశ్వాసం మరింత విస్తరించింది. మన శాస్తవ్రేత్తల ప్రతిభ, పటిమ ఈ విశ్వాసానికి ప్రాతిపదికలు. అందువల్లనే బ్రిటన్ దురాక్రమణ విముక్త భారతదేశం డెబ్బయి ఐదవ స్వాతంత్య్ర వత్సర ఉత్సవం జరుపుకునే నాటికి భారతీయులు అంతరిక్ష నౌకలనెక్కి ‘గగన’ విహారం చేయగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగలిగాడు. ‘2022లో మన దేశం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి భరతమాత పుత్రులు, పుత్రికలు ‘గగన్ యాన్’ నౌకలెక్కి అంతరిక్షంలో భూమి చుట్టూ పరిక్రమించగలరు’ అని గత నెల పదహైదవ తేదీన ప్రధాని ప్రకటించడం ఈ విజయ విశ్వాసం. ప్రధానమంత్రి ప్రకటనకు అనుగుణంగా పదమూడు రోజులలోనే ‘ఇస్రో’ మానవ వాహక అంతరిక్ష నౌక నిర్మాణ కార్యక్రమానికి రూపకల్పన చేయగలగడం అభినందనీయం. ‘ఇస్రో’ అధ్యక్షుడు డాక్టర్ శివన్ మంగళవారం ఆవిష్కరించిన కార్యక్రమంలో భాగంగా ముగ్గురు భారతీయ శాస్తవ్రేత్తలు ఐదు నుండి ఏడురోజులపాటు అంతరిక్ష యానం చేయనున్నారు. ఇంతవరకు మానవ రహిత అంతరిక్ష నౌకలను విజయవంతంగా ప్రయోగించిన ‘ఇస్రో’ మానవ సహిత అంతరిక్ష నౌకలకు రూపకల్పన చేయడానికి ఇలా సంకల్పించడం వినూతన చరిత్రకు శుభారంభం. నలబయి నెలలలో భారతీయులు అంతరిక్ష సంచారం చేయనున్నారు, విజ్ఞాన విన్యాసాలను దూరదూర సీమలలో ప్రదర్శించనున్నారు. ఈ అంతరిక్ష యానం భరతమాత కీర్తికి మరో సముజ్వల పతాకం.. ఈ మానవ అంతరిక్ష యానానికి ముందు ముప్పయి ఆరు నెలల కాలవ్యవధిలో రెండుసార్లు మానవ రహిత అంతరిక్ష నౌకలను కూడ ‘ఇస్రో’ప్రయోగించనున్నదట. పదివేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలవట..
చంద్రునిలో మంచుగడ్డలు- హిమ శకలాలు- విస్తరించి ఉన్నాయన్న ధ్రువీకరణకు పదేళ్ల క్రితం మన ‘చంద్రయాన్’ అంతరిక్ష చరం పంపిన సమాచారం ప్రాతిపదిక కావడం మనకు మరో విజయం. ‘చంద్రయాన్’కు పూర్వం అమెరికా, రష్యా అంతరిక్ష నౌకలు చంద్రుని చుట్టూ తిరిగినాయి, చంద్రుని ఉపరితలంపై దిగినాయి. అమెరికా ‘వ్యోమగాములు’ 1969లోనే చంద్రునిపై దిగి నడచి వచ్చారు. అయినప్పటికీ చంద్రుని ఉపరితలంపై అనేకచోట్ల, ప్రధానంగా ధ్రువాల వద్ద విస్తరించి ఉన్న మంచునీటి దిబ్బలను అమెరికా కాని, రష్యా కాని ‘చంద్రయాన్’కు పూర్వం కనిపెట్టలేదు. చంద్రుని ఉపరితలం బూడిద రంగులో ఉందన్నది మాత్రమే అమెరికా, రష్యాల అంతరిక్ష శోధన ఆవిష్కరించిన మహావిషయం భారతీయులకు యుగాలుగా తెలుసు. చంద్రుడు తెల్లనివాడు, అంగారకుడు - కుజుడు- ఎఱ్ఱనివాడు- అన్నది భారతీయ జీవనంలో భాగమైన అనాది వాస్తవం. కుజుడు- అంగారకుడు- ఎఱ్ఱనివాడు కనుక ఆయనకు ‘ఎఱ్ఱని ధాన్యం’ నివేదించారు భారతీయులు. చంద్రుడు తెల్లనివాడు కనుక ఆయనకు ‘తెల్లని ధాన్యం’ నివేదించారు. నవగ్రహాలకు తొమ్మిది రకాల ధాన్యాలను నివేదించడం ఇప్పటికీ భారతీయ జీవన సంప్రదాయం. ఈ సంప్రదాయానికి ప్రాతిపదిక విశ్వాసం కాదు, భారతీయులకు అనాదిగా తెలిసిన ఖగోళ విజ్ఞానం! 2013వ, 2014వ సంవత్సరాలలో మూడువందల ముప్పయి రోజులు పయనించి కుజ గ్రహాన్ని పరిక్రమించిన మన ‘మంగళయాన్’ వల్ల ఈ విజ్ఞాన వాస్తవం మరోసారి ధ్రువపడింది. కుజుడు అగ్ని వంటి ఎఱ్ఱని రంగులో ఉన్న ఖగోళ చరం, గ్రహం. అందుకే ఆయనకు ‘అంగార’కుడని పేరు ‘అంగారం’ అని అంటే అగ్ని. చంద్రుడిని భారతీయులు ‘హిమకరుడు’ అని పిలిచారు. ‘హిమకరుడు’ అని అంటే మంచు అవయవాలున్నవాడు, మంచు శరీరం వాడు, మంచు కిరణాల వాడు. ఇదంతా భారత జాతి వికృత విదేశీయ దురాక్రమణకు గురి అయి ఉండిన సమయంలో మరుగున పడిన మహావిజ్ఞానంలో ఒక అంశం మాత్రమే!
భూమి, గ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు సజీవ అంతరిక్ష స్వరూపాలన్న వాస్తవాన్ని గుర్తించడం భారతీయుల అనాది సంస్కారం. ప్రాణం, బుద్ధి, మనస్సు ఆత్మ వంటివి కేవలం మానవ ‘రూపాల’లో మాత్రమే ఉంటాయని, మానవుని కంటె భిన్నమైన స్వరూపాలలో ఉండవని భావించడం అజ్ఞానం, అతార్కికం, అహంకారం, అన్యాయం... భూమి కేవలం మట్టి ముద్దకాదు, భూమి అనంత చైతన్య సమాహారమైన సజీవ రూపం. అందువల్లనే భూమి నిరంతరం తిరుగుతోంది, శ్రమిస్తోంది. భూమికి ఆహారం విశ్వరజం- కాస్మిక్ డస్ట్-! మిగిలిన గ్రహాలకు అనంతకోటి బ్రహ్మాండాలుగా భాసిస్తున్న విశ్వవ్యవస్థలోని అసంఖ్యాక దివ్యరూపాల- హెవన్లీ బాడీస్-కు వర్తించే అజరామర వాస్తవమిది.. విశ్వచైతన్యం ఇది. తొలి భారతీయుడు గుర్తించిన సత్యం ఇది, ఆధునిక భారతీయుడు ఆవిష్కరిస్తున్న అంతరిక్ష వాస్తవం ఇది..