సంపాదకీయం

విస్తృత ‘పన్నాగం..’?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి నిషిద్ధ ‘్భరత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ’ వారు కుట్ర పన్నారన్న అభియోగం ఆశ్చర్యకరం కాదు. గతంలో సైతం రాజకీయ, రాజ్యాంగ పదవులలో ఉన్న ప్రముఖులను మట్టుపెట్టడానికి వివిధ పేర్లతో చెలామణి అవుతుండిన మావోయిస్టులు యత్నించడం చరిత్ర. కొంతమంది రాజకీయ ప్రముఖులు మావోయిస్టుల తూటాలకు బలైపోవడం, మరికొందరు బతికి బయటపడడం కూడ చరిత్ర. అందువల్ల ప్రధానిని సైతం ‘నిర్మూలించడానికి’ మావోయిస్టులు యత్నిస్తున్నట్టు దేశవ్యాప్తంగా ఏడు నగరాలలో గాలింపు జరిపిన పోలీసులు ఆరోపించడం ఆశ్చర్యకరం కాదు. ఈ ‘అభియోగం’ ప్రతీక మాత్రమే. ఈ ‘ఆరోపణ’లోని నిజానిజాలను న్యాయస్థానాలు నిగ్గుతేల్చ వలసింది. ‘ఆరోపణ’ వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, నిందితులు, ‘నిర్బంధితులు’ నేరస్థులు కావచ్చు, కాకపోవచ్చు! మంగళవారం మహారాష్టక్రు చెందిన పోలీసులు, ఇతర రాష్ట్రాల పోలీసులు ఐదుగురు మావోయిస్టు ప్రముఖులకు వ్యతిరేకంగా ఆవిష్కరించిన ‘అభియోగం’లోని నిజానిజాల గురించి నిర్ధారణ జరుగవలసి ఉంది. నిర్బంధానికి గురైన ఐదుగురూ నేరస్థులా? నిర్దోషులా? ఎందరు నిర్దోషులు? ఎందరు కారు? అన్నది న్యాయస్థానాలు నిర్ధారించనున్నాయి. కానీ దేశవ్యాప్తంగా మావోయిస్టులు దశాబ్దుల తరబడి భయంకర హింసాకాండను సాగిస్తుండడం మాత్రం వాస్తవం. 2009లో కేంద్ర ప్రభుత్వం ఈ ‘మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ’ని నిషేధించడానికి ప్రాతిపదిక ఈ ‘మావోయిస్టు బీభత్సకాండ’. ‘2050వ సంవత్సరం నాటికి భారత రాజ్యాంగ వ్యవస్థను కూల్చి కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి తాము సాయుధ సమరం సాగిస్తున్నట్టు నిషేధానికి ముందు, ఆ తరువాత మావోయిస్టులు ప్రకటించడం బహిరంగ రహస్యం. మావోయిస్టులు అమలుజరుపుతున్న వేఱువేఱు వ్యూహాలు ఈ ‘విస్తృత లక్ష్య’ సాధనలో భాగం మాత్రమే. ప్రభుత్వాలు వివిధ వ్యూహాలను ప్రతిఘటిస్తుండడం ఈ ‘విస్తృత లక్ష్యం’ నెరవేరకుండా నిరోధించడంలో భా గం. మావోయిస్టులు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను భగ్నం చేయకుండా నిరోధించడంలో భాగం. ప్రభుత్వ ‘నిఘా’ నయనాలు నిరంతరం వీక్షించడం సహజం, నేర పరిశోధన కొనసాగించడంలో భాగం. మంగళవారం ఐదుగురిని- మావోయిస్టులన్న, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అభియోగాలపై నిర్బంధించడం ఈ నిరోధక ప్రక్రియలో, పరిశోధనలో భాగం. నిర్బంధానికి గురైన పి.వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గాన్‌స్లేవ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లాఖా ‘నిందితులు’ మాత్రమే. ఈ ‘నిర్బంధం’ నేర పరిశోధక ప్రక్రియలో సహజ పరిణామం. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్బంధానికి ప్రాతిపదిక!
దేశవ్యాప్తంగా మావోయిస్టులు దశాబ్దుల తరబడి సాగిస్తున్న బీభత్సకాండ అసలు సమస్య. ఈ ‘సాయుధ సంఘర్షణ’ లక్ష్యం ‘2050 నాటికి ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడం..’ అన్నది మావోయిస్టులు ఆధికారికంగా చెప్పిన మాట. వారు రూపొందించదలచిన నూతన రాజ్యాంగ వ్యవస్థ ‘ఏకపక్ష పాలన’. ఈ ఏకపక్ష పాలనను మావోయిస్టులు ‘శ్రమజీవుల నియంతృత్వం’- ప్రాలిటేరియట్ డిక్టేటర్ షిప్- అని వర్ణిస్తూ ఉండవచ్చు. లేదా ‘ప్రజల ప్రభుత్వం’- పీపుల్స్ డెమొక్రసీ- అని చెప్పుకోవచ్చు. ఈ ‘చెప్పుకోవడం’లో కూడ ‘మావోయిస్టు సిద్ధాంతవేత్తల’లోని భిన్న వర్గాలవారు విభిన్న రీతులలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏమైనప్పటికీ మరో రాజకీయ పార్టీకి కాని, మరో ఆలోచన రీతికి కాని తావులేని విధంగా తమ ‘మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ శాశ్వతంగా దేశాన్ని పరిపాలించడం లక్ష్యం. నిజానికి అలాంటి రాజ్యాంగ వ్యవస్థ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ. గతంలో ఐరోపాలోని తూర్పు ప్రాంతపు దేశాలలోను, సోవియట్ రష్యాలోను ఇలాంటి ‘ఏకపక్ష నియంతృత్వ’ వ్యవస్థ ఏర్పడడం చరిత్ర. దేశంలో ఒకే ఒక రాజకీయ పార్టీ ఉండాలని, మిగిలిన రాజకీయ పక్షాలు అవసరం లేదని ‘కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు’ ఆచరించి చూపించారు. ఆ ‘ఏకైక రాజకీయ పక్షం కమ్యూనిస్టుపార్టీ’. ఇతర పార్టీలు అవసరం లేదని నిర్ణయించేది ప్రజలు కాదు, కమ్యూనిస్టు పార్టీ వారు ఈ నిర్ణయం చేశారు. అనేక రాజకీయ పక్షాలున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ వారు ఎన్నికలలో పోటీ చేయవచ్చు, ప్రజల మద్దతు పొంది ప్రజల హితం కోసం ప్రతి ఎన్నికలలోను గెలిచి ‘కల్పాంతం’ వరకూ శాశ్వతంగా పరిపాలించవచ్చు. కానీ దేశ విదేశాలలోని ‘సాయుధ సంఘర్షణ’ సిద్ధాంతవాదులైన కమ్యూనిస్టు పార్టీ వారికి ఇలా ప్రజల మద్దతు తమకు- ‘ఎన్నికల ద్వారా’ శాశ్వతంగా లభిస్తుందన్న విశ్వాసం లేదు, ‘మద్దతు’ శాశ్వతం కావడానికి వీలుగా తాము శాశ్వతంగా ప్రజాహితాన్ని వ్యవస్థీకరించగలమన్న ప్రజాస్వామ్య విశ్వాసం లేదు..
అందువల్ల కోట్లమంది ప్రజలపై, ప్రజల సమష్టి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా, వేల మంది తమ సిద్ధాంతవాదులు శాశ్వతంగా పెత్తనం వహించడం మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీవారు ప్రచారం చేస్తున్న ఏకపక్ష నియంతృత్వ స్వరూపం. అలాంటి ఏకపక్ష వ్యవస్థలో కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి భిన్నమైన ఎలాంటి ఆలోచనలూ, వైవిధ్యాలకు తావులేకపోవడం ఆ వ్యవస్థ స్వభావం! భావ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్వాహకులకు వ్యతిరేకంగా నిరంతరం ఆరోపణలను గుప్పిస్తున్న మావోయిస్టులు, వారికి మద్దతు పలికే ‘హక్కుల సంఘాల’ వారు స్థాపించదలచిన వ్యవస్థలో భావ వైవిధ్యాలకు తావులేదు. ఇది ఐరోపాలోను, రష్యాలో కమ్యూనిస్టు నియంతలు ఆచరించి నిరూపించిన వాస్తవం. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలలో మాత్రం ఉద్యమకారులకు, మేధావులకు, సాయుధ సంఘర్షణ సిద్ధాంత వేత్తలకు, ఇతరులకూ ప్రజలకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ఉండాలి...’ మిక్కిలి హర్షణీయం, అభినందనీయం! కానీ ఈ ‘హక్కు’ కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలో ఎందుకు లేదు? ఎందుకు ఉండరాదు?? లేదని, ఉండలేదని చరిత్ర నిరూపించింది. ఐరోపాలోను, రష్యాలోను కమ్యూనిస్టులు దశాబ్దుల పాటు ‘వ్యతిరేక భావాల’ను కర్కశంగా అణచివేశారు. తమను విమర్శించేవారు కాని, వ్యతిరేకించే వారు కాని లేరన్న ధీమాతోనే సోవియట్ రష్యాలో కమ్యూనిస్టుపార్టీ ప్రభుత్వం వారు క్రీస్తుశకం 1917 నుంచి 1991 వరకూ దమనకాండ సాగించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కమ్యూనిస్ట్ నియంతృత్వ వ్యవస్థలు ఏర్పడిన తూర్పు ఐరోపా దేశాలలో కూడ 1989 వరకూ ఈ దమనకాండ కొనసాగింది. ‘ప్రజలను పెట్టుబడిదారుల దోపిడీ నుంచి రక్షించడానికి ఏకపక్ష నియంతృత్వాన్ని ఏర్పాటుచేసిన కమ్యూనిస్టులు’ తామే ప్రజలను దోచుకొనడం 1991 వరకు నడచిన చరిత్ర. ఈ దేశాలలో ప్రభుత్వం ఏకైక ‘పెట్టుబడిదారీ సంస్థ’గా ఏర్పడడం చరిత్ర. అందువల్లనే 1989లో ఎనిమిది ఐరోపా దేశాలలోను, 1991లో ‘రష్యా మరో పదునాలుగు దేశాల కూటమి’ అయిన ‘సోవియట్ సామ్యవాద సమైక్య గణతంత్ర’- యుఎస్‌ఎస్‌ఆర్- వ్యవస్థలోను శ్రమజీవులు సామాన్య ప్రజలు- ‘పతితులు, దళితులు, బాధాసర్పదష్టులు’- తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టు ఏకపక్ష నియంతలను తొలగించారు, బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏర్పాటుచేశారు..
శ్రమజీవన స్వేద జలం
సమరార్ణవమై లేచెను,
దమన నీతి దనుజ శిఖల
దావాగ్నుల ముంచెత్తెను,
ప్రజాహృదయ పర్జన్యం
కురిపించెను పిడుగుల జడి
నిరంకుశులు గుండె చెదరి
విలపించిరి చతికిలపడి..
ఇలా చతికిలపడి ఉన్న ‘సిద్ధాంత భ్రాంతి’ని సాగదీయడానికి మావోయిస్టులు ఎందుకని యత్నిస్తున్నారు? దీనికి సమాధానం- మావోయిస్టుల అసలు లక్ష్యం మన దేశంలోను, నేపాల్‌లోను, ఇరుగు పొరుగు దేశాలలోను చైనా ప్రాబల్యాన్ని ప్రతిష్ఠించడం..