సంపాదకీయం

అస్తిత్వ ఆధారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ ‘గుర్తింపు పత్రం’ రాజ్యాంగబద్ధమని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చెప్పిన తీర్పు జాతీయ సమష్టి అస్తిత్వానికి మరో ధ్రువీకరణ. ప్రాధాన్యానికి నోచుకోని కోట్ల మంది సామాన్య ప్రజలకు ‘ఆధార్’ పత్రం వల్ల విలక్షణ అస్తిత్వం ఏర్పడిందన్న వాస్తవం సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుతో మరింతగా ప్రస్ఫుటిస్తోంది. కోట్లాది ప్రజలలో ప్రతి ఒక్కరికీ విలక్షణ అస్తిత్వం ప్రత్యేక వ్యక్తిత్వం ఉందన్నది సృష్టి సహజమైన వాస్తవం. ఈ వాస్తవానికి ధ్రువీకరణ ఆధార్- అద్వితీయ పరిగణన- యూనిక్ ఐడెంటిఫికేషన్- యుఐడి- పత్రం. ఈ కోట్ల మంది భరతమాత బిడ్డల వైయక్తిక అస్తిత్వాల సమీకృతి అద్వితీయ జాతీయ అస్తిత్వం. ఈ జాతీయ అస్తిత్వం విదేశీయులతో, అక్రమ ప్రవేశకులతో సాంకర్యం చెందరాదన్నది- కల్తీ కారాదన్నది- సర్వోన్నత న్యాయనిర్ణయ సారాంశం! విదేశాల నుంచి అక్రమంగా చొరబడుతున్న వారిలో మాదక ద్రవ్యాలను రవాణాచేస్తున్న నేరస్థులున్నారు, హంతకులున్నారు, చైనా పాకిస్తాన్ వంటి శత్రుదేశాల తొత్తులున్నారు, దేశ వ్యతిరేకులున్నారు, లైంగిక, భౌతిక, ఆర్థిక, సాంఘిక, బౌద్ధిక బీభత్సకారులున్నారు. ఇలాంటి ‘అక్రమ ప్రవేశకుల’కు ఆధార్ పత్రం లభించినట్టయితే జాతీయ అస్తిత్వం సంకరం కావడం ఖాయం. అందువల్లనే ‘చొరబాటుదారుల’కు అక్రమంగా దేశంలోని వలసవచ్చిన వారికి- ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కు- ఆధార్ పత్రాలు లభించకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించడం తీర్పులో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అంశం! ‘ఆధార్’ పత్రాలను రూపొందించడానికి ఏళ్ల తరబడి ‘్భరత అద్వితీయ అస్తిత్వ నిర్ధారణ సంస్థ’- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఉదయ్- వారు కృషిచేశారు. దాదాపు నూట ఇరవై రెండు కోట్ల మంది దేశవాసులకు ‘ఆధార్’ గుర్తింపు లభించిందట. ఈ మొత్తం కార్యక్రమ లక్ష్యం భారతీయ పౌరులు ఎవరన్నది నిర్ధారించడం! అందువల్ల భారతీయ పౌరులకు మాత్రమే ‘ఆధార్’ లభిస్తోంది, విదేశీయులకు చొరబడినవారికి ఎలాగూ లభించదు. కానీ చొరబాటుదారులకు ఈ గుర్తింపు పత్రాలు లభించకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు హెచ్చరించవలసి వచ్చింది? దేశంలోకి దశాబ్దుల తరబడి చొరబడిపోయిన లక్షల మంది విదేశీయులలో ఇదివరకే అత్యధికులకు భారతీయ పౌరసత్వం అక్రమంగా లభించి ఉంది. ఇలా లభించడానికి వీలుగా వారు నకిలీ నివాస పత్రాలను, రేషన్‌కార్డులను, ఓటర్ల హోదాను పొందగలిగి ఉన్నారు. చివరికి ఈ చొరబాటుదారులు మన దేశపు ప్రయాణ అనుమతి పత్రాల- పాస్‌పోర్ట్‌లను కూడ పొందగలగడం విస్మయకరం. అందువల్ల ఇప్పటికే కనీసం కొన్ని లక్షల మంది విదేశీయులకు మన ‘ఆధార్’ పత్రం లభించి ఉండవచ్చునన్న అనుమానం అతార్కికం కాదు. ఇలా విదేశీయులను స్వదేశీయులుగా చెలామణి చేయించడానికి జరిగిన జరుగుతున్న దేశ వ్యతిరేక జాతి విద్రోహ ప్రక్రియకు ‘‘రాజ్యాంగ నిబద్ధులైన’’ కొన్ని రాజకీయ పక్షాలవారు రహస్యంగాను బహిరంగంగాను సహకరిస్తున్నారు! అక్రమ ప్రవేశకులు ‘ఆధార్’ను కాజేయకుండా జాగ్రత్తపడాలన్న సర్వోన్నత న్యాయాదేశానికి ఇదంతా నేపథ్యం... అప్రమత్తత అనివార్యం!
ఆధార్ గుర్తింపు వ్యవస్థ ‘జాతీయ పౌరుల నమోదు పత్రం’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్- ఎన్‌ఆర్‌సి- కార్యక్రమానికి మరోరూపం. 1951లోనే ఈ ‘జాతీయ పౌరుల నమోదు పత్రం’ కార్యక్రమం రూపొందింది. దీనికి నేపథ్యం 1937లోను 1947లోను జరిగిన అఖండ భారత విభజన. 1937లో బ్రిటన్ దురాక్రమణదారులు బర్మా ప్రాంతాన్ని మన దేశం నుంచి విడగొట్టారు. 1947 ఆగస్టు 14న మతోన్మాద ముస్లింలీగ్ జిహాదీలు, బ్రిటన్ ముష్కరులు మరోసారి దేశాన్ని ముక్కలుచేశారు. పాకిస్తాన్‌గా ఏర్పడిన అఖండ భారత ప్రాంతాలలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ అంతరించింది, జిహాదీ మతోన్మాద వ్యవస్థ ఏర్పడింది. అనాదిగా అఖండ భారత్‌లో వలెనే అవశేష భారత్‌లో కూడ సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడి ఉంది, కొనసాగుతోంది. అందువల్ల అవశేష భారత్‌లో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించాలన్న లక్ష్యంతో జిహాదీ బీభత్సకారులు 1947నుంచి కూడ పాకిస్తాన్ నుంచి- బంగ్లాదేశ్ నుంచి- మన దేశంలోకి చొరబడుతూనే ఉన్నారు. బర్మాను మత ప్రాతిపదికగా విభజించి అరకాన్ ప్రాంతాన్ని స్వతంత్ర ఇస్లాం ఏకమత రాజ్యంగా ఏర్పాటుచేయడానికి దశాబ్దుల తరబడి ‘రోహింగియా’ జిహాదీలు యత్నించారు, విఫలమయ్యారు. ఈ ‘రోహింగియాలు’ వేల సంఖ్యలో మన దేశంలోకి చొరబడి ఉన్నారు.
జాతీయ పౌరుల నమోదుపత్రం 1951లోనే రూపొంది ఉంటే దేశ పౌరులు ఎవ్వరో విదేశీయులు ఎవ్వరో అప్పుడే తేలిపోయి ఉండేది. దాని ప్రాతిపదికగా విదేశీయలను గుర్తించి ఉండేవారం. ‘ఆధార్’ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కేవలం అస్సాం ప్రాంతంలో ఈ ‘ఎన్‌ఆర్‌సి’ రూపొందింది. నలబయి లక్షల మంది విదేశీయులు అస్సాంలో తిష్ఠవేసి ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతమంది విదేశీయులు ఉన్నారన్నది తేల్చడానికి ‘ఆధార్’ ప్రక్రియ ఉపయోగపడనుంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లోని విదేశీయులను, బంగ్లాదేశ్ నుంచి చొరబడి తిష్ఠవేసి ఉన్న లక్షల మందిని గుర్తించడానికి ‘ఆధార్’ ప్రక్రియ ఉపకరించగలదు. కానీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పశ్చిమ బెంగాల్‌లో ‘ఆధార్’ ప్రక్రియను నిరోధించింది. ఇలా ‘ఆధార్’ను వ్యతిరేకించడం ద్వారా చొరబాటుదారులకు కొమ్ముకాచిన రాజకీయ పక్షాలకు విచ్ఛిన్న సంస్థలకు బుధవారం సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పు చెంప పెట్టు. గత ఇరవయ్యవ తేదీన మన దేశంలో ఒక చైనా గూఢచారి పట్టుబడ్డాడు. మూడేళ్లకు పైగా భారతీయుడుగా చెలామణి అయిన ఈ తస్కరుడు ఈశాన్య ప్రాంతంలోని భారతీయ యువతిని పెళ్లి చేసుకున్నాడు, ‘ఆధార్’ గుర్తింపు పత్రం కూడ పొందాడు! ‘ఆధార్’ను విదేశీయులకు దక్కనివ్వరాదన్న సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరికకు ఇదీ పూర్వరంగం!
‘ఆధార్’ గుర్తింపును ‘పాన్’కార్డుతో అనుసంధానం చేసి తీరాలన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం. దీనివల్ల ఆదాయం పన్ను చెల్లింపుదారులలో నిజాయితీ పెరగడానికి వీలవుతుంది. ‘పాన్’కార్డును ‘ఆధార్’తో అనుసంధానం చేయడం తప్పనిసరి కాబట్టి బ్యాంకు ఖాతాలను మళ్లీ ‘ఆధార్’తో జంటగట్టనక్కరలేదన్నది ‘సుప్రీం’ నిర్ధారణ! ఇంతకాలం బ్యాంకులలో ఖాతాలున్న వారిని బ్యాంకుల నిర్వాహకులు ‘ఆధార్ అనుసంధానం’ పేరుతో చిత్రవిచిత్ర హింసలపాలు చేశారు. పనిచేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో మెక్కడం మరిగిన కొందరు బ్యాంకుల ఉద్యోగులకు ఈ ‘ఆధార్ అనుసంధానం’- పాపం- అదనపు పని అయింది. అందువల్ల ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’వంటి ప్రభుత్వరంగ ఉద్యోగులలో కొందరు కసికొద్దీ ఖాతాదారులను ఏడిపించారు. పది పదిహేనుసార్లు ‘ఆధార్’ సమర్పించినప్పటికీ తమ ఖాతాలు అనుసంధానం కాలేదని అనేకమంది ఖాతాదారులు వాపోవడం చరిత్ర... ‘ఆధార్’ ప్రతిని తాము స్వీకరించినట్టు ఖాతాదారులకు బ్యాంకుల నిర్వాహకులు రసీదు మాత్రం ఇవ్వరు, అనుసంధానం చేయరు!! అందువల్ల బ్యాంకుల ఖాతాలకు ‘ఆధార్’ అక్కరలేదన్న సుప్రీం మాట ఖాతాదారులకు కొండంత ఊరట! బడి పిల్లలకు సైతం ‘ఆధార్’ అనుసంధానం అవసరం లేకపోవడం ‘బుడుతల’కు వారి తల్లిదండ్రులకు శుభంకరమైన సమాచారం.