సంపాదకీయం

వ్యభిచార గరిమ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యభిచరించడం నేరం కాదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం చేసిన నిర్ణయం సనాతన జాతీయ జీవన ప్రస్థాన క్రమంలో గొప్ప సంచలనం!! భారత జాతి తుది మొదలు లేని శాశ్వతమైన జాతి. సనాతనం అని అంటే ‘శాశ్వతం - ఎటర్నల్ - అని అర్థం. అందువల్ల ఈ జాతికి సనాతనమైన అంటే శాశ్వతమైన నైతిక నియమాలు ఉన్నాయి. అలాంటి నైతిక నియమాలలో ఒకటి వ్యభిచరించకపోవడం... ‘‘వ్యభిచారం చేయడం పాపం...’’ అన్నది యుగయుగాలుగా భారతీయ జీవన విధానంలో నిహితమై ఉన్న నైతిక నియమం. ఈ నియమానికి ‘్భరతీయ శిక్షాస్మృతి’లోని నాలుగువందల తొంబయి ఏడవ నిబంధన ఆధునిక ధ్రువీకరణ చట్టం సమాజ సమష్టి విచక్షణకు చిహ్నం, చట్టం సమాజ సమష్టి జీవన లక్ష్యం ప్రస్ఫుటించే అద్దం. స్మృతి, శాస్త్రం వంటివి ఆద్యంతరహిత జాతీయ ప్రస్థాన క్రమంలో వికసించి విస్తరించే ఈ సమాజ సమష్టి విచక్షణకు ప్రతీకలు. భారతీయ శిక్షాస్మృతిలోని ఈ 497వ నిబంధన అలాంటి జాతీయ జీవన నైతిక నిష్ఠకు ఒక ప్రతీక. జీవన ప్రగతి ప్రస్థానంలో ‘నిబంధనలు’ సుఖసంతోష శాంతి భద్రతలను సాధించడానికి మాధ్యమాలు! సౌలభ్యం కోసం నిబంధనలు మారవచ్చు, కానీ జాతీయ జీవన వౌలిక స్వభావం మారదు... మారినట్టయితే మానవుడు మృగంగానో, పిశాచంగానో మారిపోతాడు. అందువల్ల, చట్టాలను, నియమాలను ప్రభుత్వాలు, చట్టసభలు, న్యాయస్థానాలు మార్చవచ్చు. కానీ ఈ మార్పులు జాతీయ సమష్టి సమాజంలోని వౌలిక మానవీయ స్వభావం మరింతగా పెంపొందడానికి దోహదం చేయాలి. మానవులు మృగాలుగా, పిశాచాలుగా రూపాంతరం చెందడానికి దోహదం చేయరాదు. మానవులు జంతువులలో ఒక విభాగం. మిగిలిన జంతువుల కంటే మానవులు విలక్షణ జీవనులు కావడానికి ఏకైక ప్రాతిపదిక విచక్షణ! వ్యభిచరించడం నేరమని, పాపమని, సామాజిక విద్రోహమని, వౌలిక మానవీయ స్వభావానికి వ్యతిరేకమని యుగయుగాలుగా భారత జాతీయ సమష్టి విచక్షణ నిరూపించింది, నిర్దేశించింది, ధ్రువపరచింది, నిర్థారించింది. ఈ ‘విచక్షణ’ వివాహం! వివాహ సూత్రబద్ధులైన స్ర్తి పురుషులు శృంగార లైంగిక కలాపం జరపడం మానవత్వం. వివాహ బంధం లేని స్ర్తి పురుషులు లైంగిక శృంగార కలాపం జరపడం మృగస్వభావం! అందువల్ల లైంగిక శృంగారం వివాహబంధం పరిధికి పరిమితం కావాలన్నది భారతీయ జీవన విధానం. ఈ పరిమితిని అతిక్రమించడం వ్యభిచారం. ఈ పరిమితికి బద్ధమై ఉండడం కులపాల ప్రణయం, కుటుంబ ప్రణయం, దాంపత్యం! భారతీయ శిక్షాస్మృతిలోని ఈ 497వ ‘నిబంధన’ బ్రిటన్ విముక్తి భారత్‌లో ఇనే్నళ్లుగా ఈ కుటుంబ వ్యవస్థ పరిరక్షణకు దోహదం చేసింది. మృగస్వభావమైన వ్యభిచారాన్ని నిరోధించడానికి నియంత్రించడానికి దోహదం చేసింది. కానీ సర్వోన్నత న్యాయస్థానం వారు గురువారంనాడు ఈ ‘నిబంధన’ రాజ్యాంగ విరుద్ధమని నిర్ధారించింది. వ్యభిచారం నేరం కాదని తీర్పు చెప్పింది!
వ్యభిచరించడాన్ని నేరంగా పరిగణనిస్తున్న చట్టంలోని ఈ నిబంధన పురుషుల అక్రమ ఆధిక్యతకు, మహిళలపట్ల వివక్షకు ఉదాహరణ - అని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడం విచిత్రం. ఈ నిబంధన, ఇతర నిబంధనల ప్రకారం వివాహిత మహిళతో ‘‘ఆమె భర్తకాని’’ పురుషుడు లైంగిక శృంగార కూపం జరపడం వ్యభిచారం, అలా వ్యభిచరించడం నేరం, ఈ నేరం చేసిన పురుషుడు శిక్షార్హుడు. అందువల్ల, ఈ నిబంధన పురుషుని ఆధిక్యతకు కానీ అక్రమ ఆధిపత్యానికి కానీ ఎలా దోహదం చేసిందన్నది సామాన్య జనానికి అర్థం కాని విషయం. తన ‘్భర్యకాని’ ‘‘ఇతరుని భార్య అయిన’’ మహిళతో లైంగిక కలాపానికి పాల్పడిన వ్యభిచార పురుషుడిని శిక్షించడం, న్యాయస్థానాలలో నిలబెట్టి విచారించడం మహిళలపట్ల వివక్ష చూపడం ఎలా అయింది? ఈ నిబంధన మహిళలకు పురుషులలో ఉన్న సమానత్వానికి భంగకరం ఎలా అయింది? ఇప్పుడు ఈ నిబంధనను సుప్రీంకోర్టు రద్దుచేయడం వల్ల, వ్యభిచారం చేయడం నేరం కాదని తప్పు కాదని తీర్పు చెప్పడంవల్ల మహిళలకు న్యాయం జరుగుతుందా? మహిళా సాధికార ప్రక్రియ వేగవంతం అవుతుందా? సామాన్య ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్న ఈ తీర్పును గురించి సర్వోన్నత న్యాయస్థానం వారు తక్షణం తమంత తాముగా (సూయో మోటో) సమీక్షించాలి!
ఒక పురుషుడు ఒక స్ర్తి పరస్పరం ఇష్టపడి లైంగిక శృంగార క్రియలో పాల్గొంటే తప్పు లేదన్నది సుప్రీంకోర్టు వారు గురువారం చేసిన నిర్ధారణ. ఇలా ‘‘పాల్గొనడం తప్పు... నేరం!’’ అని నిర్ధారించిన చట్టంలోని నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయయుక్తులు నిర్ధారించి, ఆ నిబంధనను రద్దు చేశారు. అందువల్ల పరస్పరం ఇష్టంపడే స్ర్తి పురుషులు స్వేచ్ఛగా - నైతిక నియమాలతో సామాజిక సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా - వ్యభిచరించవచ్చునట! కానీ ఈ పరస్పరం ఇష్టపడే స్ర్తి పురుషులు ‘వివాహం’తో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా ‘‘సహజీవనం’’ చేయవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే నిర్ధారించి ఉంది. ఆ విధంగా జనాభాలో కొందరైనా వివాహం చేసుకొనకుండానే ఇప్పటికే లైంగిక సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ ‘‘పరస్పరం ఇష్టపడడం’’ వివాహ బంధానికి బద్ధులైన వారికి కూడా వర్తింప చేయడం గురువారంనాటి తీర్పు. పరస్పరం ఇష్టపడడం అన్నది వివాహానికి ప్రాతిపదిక. పరస్పరం ఇష్టపడడం ‘‘స్వయంవరం’’ కావచ్చు లేదా తల్లిదండ్రుల, పెద్దల నిర్ధారణ వల్ల కావచ్చు. స్ర్తి పురుషులు పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. అందువల్ల ‘పెళ్లి’ మాధ్యమంగా స్ర్తి పురుషులు పరస్పరం ఇష్టపడి ఆ జీవనం లైంగిక శృంగార కలాపాలను నిర్వహిస్తున్నారు. ఇలా పెళ్లికి కుటుంబ వ్యవస్థకు మూలాధారమైన ‘‘పరస్పర ఇష్టాన్ని’’ సుప్రీంకోర్టు వారు వ్యభిచారానికి కూడా వర్తింపచేశారు. ఇలా వర్తింప చేయడం భారత జాతీయ సంస్కృతికి ప్రాతిపదిక అయిన ‘కుటుంబ వ్యవస్థ’కు గొడ్డలిపెట్టు.
వివాహిత పురుషుడు వివాహిత మహిళ భార్యతోను భర్తతోను ఇష్టపడి లైంగిక శృంగారాన్ని నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు ఈ వివాహిత స్ర్తి భర్త కాని పురుషుడితోను, వివాహిత భర్త మరొక భార్యకాని మహిళతోను ఇష్టపడి లైంగిక శృంగారం నిర్వహించడం ఏమిటి? వివాహం ద్వారా ‘నాతిచరామి’ - ఇతరులతో కామం అర్థం ధర్మం నెఱపను - అని భర్త భార్యకు ‘నాతిచరితవ్య’ - పాలుపడను - అని భార్య భర్తకు హామీ ఇస్తున్నారు. అందువల్ల ఈ ప్రతిజ్ఞాబద్ధులైన భార్యభర్తలు మరొకరితో ‘‘ఇష్టపడి లైంగిక కలాపం జరపడం’’ వివాహ విశ్వాసానికి విఘాతకరం! వ్యభిచారం చేసిన భాగస్వామి నుండి విడాకులు పొందే హక్కు భార్యకు భర్తకు ఉన్నదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. విడాకులు పొందడానికి ‘వ్యభిచారక్రియ’ ప్రాతిపదిక అయినప్పుడు అది తప్పు కాకుండా ఎలా పోతుంది? అది ఒకవేళ నేరం కానట్టయితే వివాహ విచ్ఛిత్తికి, విడాకులకు అది ఎలా ప్రాతిపదిక అవుతుంది? ఈ విచిత్ర న్యాయ నిర్ణయాన్ని వమ్ము చేయడానికి వీలుగా పార్లమెంటు పూనుకొని రాజ్యాంగ సవరణ చేయాలి! ప్రజలు ప్రజాస్వామ్యంలో సర్వాధికారులు. వ్యభిచారం నేరమన్నది అత్యధిక ప్రజల అభిప్రాయం.