సంపాదకీయం

సౌరశక్తికి సమ్మానం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి వారు ‘‘్భ పరిరక్షక పురస్కారం’’ - ఛాంపియన్స్ ఆఫ్ అర్త్ అవార్డ్ - ప్రదానం చేయాలని నిర్ణయించడం మన జాతీయ జీవనగరిమకు అంతర్జాతీయ సమ్మానం... పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న వారికి, సంస్థలకు, ప్రభుత్వాలకు ‘సమితి’ వారు ఈ ‘్భమి పురస్కారాన్ని’ అందజేస్తున్నారు. ‘అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన’ - ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్’ - ఐఎస్‌ఏ -ను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ స్వచ్ఛతను సమతుల్యతను పెంపొందించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత మూడేళ్ళుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఐక్యరాజ్యసమితి వారి ఈ ‘అత్యున్నత పర్యావరణ పురస్కారం’! పర్యావరణ స్వచ్ఛత మన ప్రభుత్వం వారి స్వచ్ఛ భారత పునర్నిర్మాణ కార్యక్రమానికి అంతర్జాతీయ విస్తృతి... పర్యావరణంలో మానవుడు జంతుజాలం వృక్షజాలం సమస్త జీవజాలం నిహితమై ఉందన్నది అనాదిగా హైందవ జాతీయ జీవనరీతి, వేద విజ్ఞానద్యుతి! పంచభూతాల - నేల, నీరు, నిప్పు, గాలి, నింగి - సమాహారం ప్రకృతి! తుది మొదలు లేని విశ్వ వ్యవస్థలో ప్రకృతి ప్రస్ఫుటించడం సృష్టిక్రమం... ప్రకృతిలో అవిభాజ్యమైన, జీవజాలంలో విలక్షణుడైన మానవుడు ప్రకృతిపట్ల మమకారం కలిగి ఉండడం, ప్రకృతిని పరిరక్షించడం, ప్రకృతిని పెంపొందించడం, ప్రకృతిని అర్చించడం, ప్రకృతితో నిరంతరం అనుసంధానమై ఉండడం వేద విజ్ఞాన బోధిత యుగయుగాల భారతీయ జీవన పద్ధతి. వేద విజ్ఞానంలో పంచభూతముల ఆరాధన వౌలికమైన వాస్తవం. పంచభూతాలను దేవతలుగా ఆరాధించడం, బంధువులన్న వాస్తవాన్ని గుర్తించడం అనాది వేద విజ్ఞానం. భూమితల్లి, ఆకాశం తండ్రి, అగ్ని పురోహితుడు, నీరు, గాలి సోదరులు - అన్న సత్యాలను వేద విజ్ఞానద్రష్చలు పదేపదే సమావిష్కరించారు! ఈ సమావిష్కరణ అవనీతలంలో ఆదివాసులైన భారతీయుల జీవనంగా కొనసాగుతుండడం యుగయుగాల చరిత్ర. ఆదివాసులైన భారతీయులు పురవాసులుగా, వనవాసులుగా, గ్రామీణులుగా, జానపదులుగా, నగర వాసులుగా వ్యవస్థీకృతమై ఉన్నప్పటికీ ప్రకృతి ఆరాధన, పంచభూతాల సమారాధన మాత్రం అందరికీ సమానం. ఈ సమానత్వం భారతీయుల కర్మయోగం! అంతర్జాతీయ యోగ దినోత్సవం ద్వారా మరోసారి మానవాళిని అనంత విశ్వంతో అనుసంధానానికి భారత ప్రభుత్వం కృషి చేయడం పర్యావరణ పరిరక్షణలో భాగం! సూర్యుడి ప్రాధాన్యాన్ని మరింతగా చాటి చెప్పడం కోసం, సౌరశక్తి వినియోగాన్ని వినిమయాన్ని మరింతగా ప్రచారం చేయడం కోసం సౌరశక్తి సంఘటన ఏర్పడింది. ఇలా ఏర్పాటుచేసిన వాడు నరేంద్ర మోదీ! ‘‘సూర్య ఆత్మా జగతః...’’ అన్న సృష్టిగత వాస్తవానికి ఆధునిక ధ్రువీకరణ అంతర్జాతీయ సౌరశక్తి కూటమి! కొత్త ఢిల్లీలో గత వసంత ఋతువులో జరిగిన ‘సౌరశక్తి కూటమి’ మొదటి అంతర్జాతీయ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ హాజరయ్యాడు. నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షునికి ‘సమితి’ పర్యావరణ విభాగం వారు ఉమ్మడిగా ‘్ఛంపియన్స్ ఆఫ్ అర్త్’ పురస్కారాన్ని అందజేయడానికి ఇదీ నేపథ్యం...
సౌరశక్తి సంఘటన ఏర్పాటునకు ప్రాతిపదిక రాజకీయం కాదు, ఆధిపత్య దౌత్యనీతి కాదు. ప్రకృతి సిద్ధమైన సహజ భౌగోళిక, ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా ఈ సౌరశక్తి కూటమి ఏర్పడింది. భూమండలంపై నలభై ఏడు అక్షాంశ రేఖ - లాటిట్యూడ్ - లు విస్తరించినంత మేర సూర్యుని వెలగు సంవత్సరం పొడవునా ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది. భూ మధ్యరేఖ నుండి దక్షిణంగా ఇరవై మూడు నీర ‘్భగ’ - డిగ్రీ - అక్షాంశం పై ఉన్న రేఖ ‘మకర రేఖ’. భూ మధ్య రేఖ నుంచి ఉత్తరంగా ఇరవై మూడున్నర ‘్భగ’ అక్షాంశం కర్కాటక రేఖ! భూమధ్య రేఖకు ఇరవైపులా వ్యాపించి ఉన్న ఈ మకర రేఖకు కర్కాటక రేఖకు మధ్య ఉన్న ప్రాంతం సౌరశక్తి మండలం. మకర రేఖకు కర్కాటక రేఖకు మధ్య ఉన్న ఈ ప్రాంతం సమశీతోష్ణ మండలం, సూర్యకాంతి నిరంతరం ఈ ప్రాంతపు దేశాల వారికి పుష్కలంగా లభిస్తోంది. అందువల్ల ఈ నలబయి ఏడు ‘డిగ్రీ’ల ప్రాంతంలో వ్యాపంచి ఉన్న దేశాల వారు సౌరశక్తి నుండి విద్యుచ్ఛక్తిని విస్తృతంగా పుష్కలంగా ఉత్పత్తి చేయవచ్చు! తైల ఇంధనం, ఇంధన వాయువు, బొగ్గు తదితర ఇంధనాల ఉపయోగంవల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. విద్యుచ్ఛక్తి వాడకం వల్ల ఇంధన కాలుష్యం సున్నా శాతం...
అందువల్ల సౌరశక్తిని పుష్కలంగా వినియోగించడం కోసం, సమృద్ధిగా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం కోసం మన ప్రభుత్వం ‘మకర రేఖ’ - కాప్రికార్న్ - కూ కర్కాటక రేఖ - కాన్సర్ - కూ మధ్యగల ప్రాంతంలోని దేశాల కూటమిని ఏర్పాటుచేసింది. ఈ భౌగోళిక పరిధిలో లేని అమెరికా బ్రిటన్ రష్యా చైనా వంటి సంపన్న దేశాలకు సహజంగానే ఈ సౌరశక్తి కూటిమిల స్థానం లేదు. ఈ దేశాలు కర్కాటక రేఖకు బాగా ఉత్తరంగా నెలకొని ఉన్నాయి. అందువల్ల ఆధిపత్య రాజకీయాలకు, దౌత్య దౌర్జన్యానికి తావులేని ఈ ‘కూటమి’ నాయకత్వం సహజంగానే మన దేశానికి లభించింది. ఈ సౌరశక్తి కూటమి అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం కూడా మన దేవంలో ఏర్పడి ఉంది. గత మార్చిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో అరవై రెండు సభ్య దేశాల వారు ‘్ఢల్లీ సౌరశక్తి ప్రణాళిక’ - ఢిల్లీ సోలార్ అజెండా - ను ఆమోదించారు. సౌరశక్తి ప్రాతిపదికగా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసి వినిమయం చేయడానికి వీలుగా పది సూత్రాల ‘కార్యాచరణ’ను సైతం ఆ సదస్సులో ఆమోదించారు. ప్రపంచ ప్రజల వందశాతం ఇంధనం అవసరాలు ‘విద్యుత్’ ద్వారా తీరినట్టయితే ప్రకృత ‘బొగ్గు’ - కార్బనన్ - కాలుష్యం నుండి సంపూర్ణంగా విముక్తికాగలదు. విద్యుత్‌ను జల - హైడ్రో - మాధ్యమంగానూ, థర్మల్ - బొగ్గు - మాధ్యమంగాను, అణుశక్తి మాధ్యమంగాను ఉత్పత్తి చేయవచ్చు. కానీ ముడిపదార్థాలు పరిమితంగానే లభిస్తున్నాయి. సౌరశక్తి అపరిమితం, సౌరశక్తి మండలం ప్రాధాన్యం ఇదీ... అందువల్లనే సౌర విద్యుత్తు ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పర్యావరణం పరిశుభ్రం అవుతుంది. నరేంద్ర మోదీ, మా క్రాన్‌ల సంయుక్త కృషి స్వభావం ఇదీ...
మకరరేఖకు దక్షిణంగాను, కర్కాటక రేఖకు ఉత్తరంగానూ నెలకొని ఉన్న దేశాలలో సూర్యుని కాంతి ధగధగలాడదు, అంతేకాక ఆ ప్రాంతాల దేశాలలో సూర్యుని కాంతిని ఎక్కువ రోజులు మంచు తెరలు, శీతల వాయువులు మింగివేస్తాయి. అందువల్ల రానున్న కాలంలో సౌరశక్తి మండలంలోని దేశాలకు అంతరాజతీయ ఇంధన ఉత్పాదక, వినిమయ రంగాలలో ప్రాధాన్యం బాగా పెరగనుంది. ఈ ‘శతాబ్ది’ భారత శతాబ్ది అన్నది ఆకాంక్ష మాత్రమే కాదు, వాస్తవం కానుంది. సూర్యకాంతి పరిమాణం విస్తృతి ప్రాతిపదికగా మన దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మన దేశం ఇప్పటికే పదిహేను దేశాలలో పెట్టుబడులను పెట్టి సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. అందువల్లనే ‘స్వచ్ఛత’కు మన దేశం ప్రతీకగా మారింది! ఫ్రాన్స్ నిజానికి ‘సౌరశక్తి మండలం’లో భౌగోళికంగా నెలకొని లేదు. కర్కాటక రేఖకు బాగా ఉత్తరంగా నలబయి ఐదవ ‘డిగ్రీ’ అక్షాంశం సమీపంలో ఉంది... అయినప్పటికీ ఫ్రాన్స్ సౌరశక్తి కూటమిలో చేరింది. పెట్టుబడులను పెడుతోంది! ఇలా, సృష్టిలో సూర్యునికి ఉన్న అద్వితీయ స్థానం గురించి ధ్యాస నిరంతరం పెరుగుతోంది... తమ రాష్ట్రానికి సూర్యుడు ‘యుద్రారాయబారి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అభివర్ణించడం పెరుగుతున్న ఈ ప్రాధాన్యానికి మరో నిదర్శనం!!