సంపాదకీయం

యాత్రికుని హత్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంస్కృతిక జీవనం శాశ్వతమైనది, సనాతనమైనది. అంటే గతంలో ఉన్నది, వర్తమానంలో ఉంటున్నది, భవిష్యత్తులో ఉండనున్నది. రాజకీయపు సరిహద్దుల కంటె, రాజ్యాంగ వ్యవస్థల కంటె మిన్నగా ఒక ‘జాతి’ని నిరంతరం కలిపి ఉంచగలిగేది సంస్కృతి. భారత జాతీయ సంస్కారాల సమాహారమైన వౌలిక సంస్కృతికి జమ్మూ కశ్మీర్‌ను దూరం చేయడానికి జిహాదీ మూకలు శతాబ్దుల తరబడి యత్నిస్తున్నాయి. ఈ పన్నాగంలో భాగంగానే జిహాదీ మూకలు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి జమ్మూ కశ్మీర్‌కు వెడుతున్న యాత్రికుల- టూరిస్టుల-పై రాళ్లు రువ్వడం ఆరంభమైంది. రాళ్లు రువ్వడం బీభత్స మాధ్యమం. దేశంలోని ఇతర ప్రాంతాలవారు భరతమాత శిరోభాగం వంటి కశ్మీర్ ప్రాంతానికి రాకుండా నిరోధించడం జిహాదీల లక్ష్యం. తమిళనాడుకు చెందిన ఒక కుటుంబంపై శ్రీనగర్ సమీపంలోని నారీబల్ గ్రామం వద్ద సోమవారం రాళ్లదాడి జరగడం ఈ విస్తృత విష వ్యూహంలో భాగం. చెన్నయికి చెందిన ఆర్ తిరుమణి అనే ఇరవై రెండేళ్ల యువకుణ్ణి జిహాదీ దుండగులు రాళ్లతోకొట్టి చంపేశారు. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమణి శ్రీనగర్ శివారులోని ‘సౌర’వద్ద గల వైద్యశాలలో చేరిన వెంటనే మరణించాడు. తిరుమణి తల్లి సహా మరో యిద్దరు కుటుంబ సభ్యులు రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం శ్రీనగర్‌ను దర్శించిన ఈ తమిళనాడు కుటుంబం వారు అక్కడి నుండి కారులో ‘గుల్‌మార్గ్’ వెడుతుండగా దారికాచిన ‘రాళ్ల’మూకలు వారు పయనిస్తుండిన కారుపై దాడిచేసి ధ్వంసం చేశారని తిరుమణి తండ్రి రాజవళి రోదిస్తూ వివరించిన దృశ్యం జమ్మూ కశ్మీర్ పోలీసుల ఘోర వైఫల్యానికి నిదర్శనం. జమ్మూ కశ్మీర్ పోలీసులలో అనేకమంది పాకిస్తాన్ ప్రభుత్వ తొత్తులు, జిహాదీలు, దేశవిద్రోహులు చేరిపోయి ఉండడం బహిరంగ రహస్యం. అందువల్లనే రాళ్లురువ్వుతున్నవారు నిరంతరం బలపడుతున్నారు, నిర్బంధం నుండి బీభత్సకారులు తప్పించుకొని పారిపోతున్నారు. ఇలా స్థానిక పోలీసు యంత్రాంగంలో పాకిస్తానీ తొత్తులు చేరిపోయి ఉన్న సంగతి 1990వ దశకంలోనే బయటపడింది. కానీ వారిని ‘ఏరివేసి’ పోలీసు వ్యవస్థను క్షాళనం చేయడంలో ప్రాంతీయ ప్రభుత్వాలు శ్రద్ధవహించక పోవడం ఈ బీభత్సకాండ నిర్నిరోధంగా కొనసాగడానికి ఒక ప్రధాన కారణం.
తల్లితండ్రుల ఎదుటనే ఇరవై రెండేళ్ల తిరుమణిని కొట్టిచంపారు. కుమారుడి అనూహ్య మరణంతో ఆ తల్లిదండ్రులు పొందుతున్న ఆవేదనను వర్ణించగల అక్షరాలు లేవు. యాత్రికులపై రాళ్లతో దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు. దాదాపు నాలుగేళ్లుగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం ఐదురోజుల వ్యవధిలో ఇలా యాత్రికులను వెంటాడి రాళ్లతో కొట్టి హింసించడం ఇది మొదటిసారి. యాత్రికులను భయ విభ్రాంతికి గురిచేసే ‘వ్యూహం’ మరింత విస్తరిస్తోందనడానికి ఇది నిదర్శనం. ‘హురియత్’లోని ‘ముదురు ముఠా’కు చెందిన మొదటి ముష్కరుడు సయ్యద్ అలీ జీలానీ. ‘మెతక ముఠా’గా చెలామణి అవుతున్న రెండవ బీభత్స బృందం నాయకుడు మీర్‌వాయిజ్ ఉమర్ ఫరూక్, ‘జమ్మూకశ్మీర్’ లిబరేషన్ ఫ్రంట్’ అనే దేశద్రోహ బీభత్స సంస్థకు చెందిన యాసిన్ మాలిక్- ఈ ‘దుష్టత్రయం’ రాళ్లురువ్వుతున్నవారిని ఉసిగొల్పుతుండడం ఏళ్లతరబడి కొసాగుతున్న నాటకం! ఈ ముగ్గురినీ విచారించి ఉంటే ఈ దేశద్రోహులకు న్యాయస్థానాలు బహుశా యావజ్జీవ కారాగృహ శిక్షను విధించి ఉండేవి. వీరిని న్యాయస్థానాల ఎదుట నిలబెట్టకపోవడం ఏళ్లతరబడి కొనసాగుతున్న ప్రభుత్వ వైఫల్యం. రాళ్లురువ్వుతున్న వారు పేట్రేగిపోవడానికి ఇదీ కారణం!!
జమ్మూ కశ్మీర్‌ను మన దేశం నుండి విడగొట్టడానికి దశల వారీగా పాకిస్తాన్ తొత్తులు జరుపుతున్న కుట్రలో యాత్రికులపై రాళ్లురువ్వడం ప్రస్తుత దశ! కలియుగం నలబయి ఐదవ శతాబ్ది- క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్ది-లో ఇస్లాం జిహాదీలు జమ్మూ కశ్మీర్‌లో చొరబడే నాటికి ఈ ప్రాంతంలోని జనాభాలో వంద శాతం స్వదేశీయ మతాలవారు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం జిహాదీల లక్ష్యం. చొరబడిన నాటి నుంచి కూడ ‘జిహాదీ’లు వివిధ స్వజాతీయ మతాలకు చెందిన హిందువులపై దాడులు సాగించారు. హత్యచేయడం, తరిమివేయడం, మహిళలపై లైంగిక బీభత్స కృత్యాలు జరపడం, ఇస్లాంలోకి బలవంతంగా మార్చడం ‘జిహాదీ’లు దశాబ్దులపాటు హిందువులను నిర్మూలించడానికి ఎంచుకున్న నాలుగు మాధ్యమాలు. ఈ దుష్టచతుష్టయ మాధ్యమాల ఫలితంగా 1947 నాటికి కశ్మీర్ లోయలోని జనాభాలో హిందువుల సంఖ్య ఇరవై ఏడు శాతానికి దిగజారింది. ఇది మొదటి దశ! ఇస్లాం మతస్థులు ‘మెజారిటీ’గా ఉన్న ప్రాంతాలలో ఇస్లామేతరులను పూర్తిగా నిర్మూలించడం ప్రపంచమంతటా ‘జిహాదీ’లు కొనసాగిస్తున్న కార్యక్రమం. 1947-1990 సంవత్సరాల మధ్య జరిపిన భయంకర బీభత్సకాండ ద్వారా జిహాదీలు కశ్మీర్ లోయనుంచి హిందువులను పూర్తిగా నిర్మూలించారు, హిందువులు సున్న శాతమయ్యారు. ఇది రెండవ దశ! జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి విడగొట్టడానికి జరుపుతున్న ఈ కుట్రతో మూడవ దశ మొదలైంది. సైనిక శిబిరాలపై స్థావరాలపై వాహనాలపై దాడులు చేయడం, రాళ్లురువ్వడం ఈ మూడవ దశ! ఈ మూడవ దశ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే నాలుగవ దశ మొదలైంది. తీర్థయాత్రికులపై వినోద విహార యాత్రికులపై దాడులు ఆరంభమయ్యాయి..
యాత్రల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదానం జరుగుతోంది, నిరంతర పరస్పర భావ వినిమయం జరుగుతోంది. కొలంబో నుంచి కైలాసం వరకు, గాంధారం నుంచి కామరూప వరకు బర్మావరకు నివసిస్తున్న వివిధమత, భాషా జనసముదాయాలు ఒకే -అద్వితీయ- భారత జాతి అన్న ‘్ధ్యస’ నిరంతరం వికసించడానికి, పెంపొందడానికి ఈ సాంస్కృతిక భావ వినిమయం దోహదం చేసింది. ఈ ధ్యాస ‘లంకాయా శాంకరీదేవీ..’ అని భారతీయులు ధ్యానించిన నాటిది. శాంకరీదేవి యుగాలకు పూర్వం కశ్మీర్- సతీ సరస్సు- ప్రాంతంలో తపస్సు చేసిన నాటిది. ఒకప్పటి ‘సతీ సరస్సు’ నేటి కశ్మీర్ లోయ! ఈ ‘్ధ్యస’ ఆసేతు శీతనగం విస్తరించిన భారతీయ సాంస్కృతిక శక్తితో ముడిపడి ఉంది. ద్వాపర యుగం చివరిలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ‘కశ్మీరాః పార్వతీప్రోక్తాః’- కశ్మీర దేశీయ పార్వతీదేవి అంశ కలవారు అని యదుకుల కృష్ణుడు వివరించాడు. ఈ ‘్ధ్యస’ అప్పటిది! కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో అంటే క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో కశ్మీర్ రాజు మరణించాడు, భారత సమ్రాట్ విక్రముడు కశ్మీర్ రాజ్యానికి కొత్త రాజును నియమించడం చరిత్ర! అఖండ భారత సాంస్కృతిక ధ్యాస అప్పటిది. ఈ ధ్యాసను భగ్నం చేయడం ద్వారా కశ్మీర్‌ను దేశం నుండి సాంస్కృతికంగా దూరం చేయాలన్నది జిహాదీల కుట్ర. ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు, కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల రాకపోకలు ఆగిపోయినట్టయితే ఈ సాంస్కృతిక ధ్యాస అడుగంటిపోగలదన్నది వారి ‘ఆశ’. అందువల్లనే యాత్రికులపై దాడులు జరుపుతున్నారు.