సంపాదకీయం

తగ్గనున్న బడి ‘బరువు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘురాముడు, యదుకుల కృష్ణుడు వంటి జాతీయ పురుషుల గురించి ప్రాథమిక స్థాయిలో బోధించక పోవడం కేంద్రీయ విద్యాలయాల వైశిష్ట్యం.. కేంద్రీయ విద్యాలయాలలో ప్రామాణిక పద్ధతులలో బోధన జరుగుతోంది, జరుగుతోందన్న విశ్వాసం నగరాలలోని అధిక శాతం తల్లిదండ్రులలో ప్రబలి ఉంది. అందువల్లనే కేంద్రీయ విద్యాలయాల- సెంట్రల్ స్కూల్స్-లో తమ పిల్లలను చేర్పించడానికి ‘నాగరికులైన’ తల్లిదండ్రులు తహతహలాడుతున్నారు. తహతహలాడుతున్న వారి పిల్లలందరికీ కేంద్రీయ విద్యాలయాల- కె.వి.లు-లో ప్రవేశం లభించడం లేదు. ఎందుకంటె ఈ కేంద్రీయ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం వారు నగరాలలోను పెద్ద పట్టణాలలోను మాత్రమే ఏర్పాటుచేసి ఉన్నారు. అందువల్ల జనాభాలో డెబ్బయి శాతానికి పైగా ఉన్న గ్రామీణులకు ఇవి అందుబాటులో లేవు. ఇది ‘సగం’ మాత్రమే.. రెండవ సగం ఈ కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పడి ఉన్నాయట. ఈ ఉద్యోగుల పిల్లలకు సరిపోయిన తరువాత మిగిలిన స్థానాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగేతరుల పిల్లలకు లభించే అవకాశం ఉంది. అందువల్ల కొద్ది శాతం స్థానాల కోసం అధికాధిక విద్యార్థులు పోటీపడుతున్నారు! ఈ కేంద్రీయ విద్యాలయాల్లో బోధిస్తున్న పాఠ్యప్రణాళికను ‘కేంద్రీయ ఉన్నత పాఠశాల విద్యామండలి’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌ఇ- వారు రూపొందిస్తున్నారు. ఈ ‘సిబిఎస్‌ఇ’ పాఠ్య ప్రణాళికను ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు బోధిస్తున్న పాఠశాలలు దేశం నిండా దండిగా ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తున్న ‘వాణిజ్య పాఠశాలలు’- కార్పొరేట్ స్కూల్స్-! కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ కేంద్రాలన్నది జనమెరిగిన ‘రహస్యం’, రకరకాల పేర్లతో ఈ ‘కార్పొరేట్ స్కూల్స్’ పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పుస్తకాలను పెన్నులను సాంకేతిక పరికరాలను మాత్రమే కాదు, బిస్కెట్లను చాక్లెట్లను ఐస్‌క్రీమ్‌లను సైతం పాఠశాలల వాణిజ్య యజమానులు అమ్ముతున్నారు, అమ్మిస్తున్నారు. తమవద్ద కొనాలి లేదా తాము చెప్పినచోట కొనాలి. ఇతరచోట్ల కొనరాదు. ‘టెక్స్ట్ బుక్కులు’, ‘వర్క్ బుక్కులు’, ‘హోమ్‌వర్క్ బుక్కులు’, ‘ప్రాజెక్టు వర్క్ బుక్కులు’వంటి పేర్లతో పుస్తకాలను అమ్ముకుంటున్నారు, పిల్లల నెత్తికి ‘బండ బరువుల’ను ఎత్తుతున్నారు. ఈ పుస్తకాలు నిండిన బరువైన సంచులను మోసుకొనిపోలేక, మోసుకొని ఇంటికి రాలేక ‘బుడుతలు’ వడలి పోతున్నారు, హడలి పోతున్నారు. ఇదంతా భౌతిక వైపరీత్యం, స్వరూప బీభత్సం. పిల్లలు ఇలా పుస్తకాల సంచిని మోయలేకపోవడం కేంద్రీయ ప్రభుత్వ, కేంద్రీయ ప్రభుత్వేతర పాఠశాలలకు మాత్రమే పరిమితం కాలేదు, రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్యప్రణాళికను బోధిస్తున్న వాణిజ్య పాఠశాలల్లోనూ ఈ ‘బరువు’ మరింత ఎక్కువగా ఉంది. బడిపిల్లల పుస్తకాల సంచుల బరువును గణనీయంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడానికి ఇది విచిత్రమైన నేపథ్యం.. ఇది, ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం స్వరూప సంస్కరణ, పుస్తకాల పరిమాణానికి సంబంధించిన సంస్కరణ!
బడిపిల్లల, ప్రధానంగా ఐదవ తరగతి వరకూ కల పదేళ్లలోపు పిల్లలకు ఊపిరాడని ‘బరువు’ కేవలం పుస్తకాలకు మాత్రమే సంబంధించినది కాదు. పాఠశాలల బోధన వేళలు సుదీర్ఘంగా కొనసాగుతుండడం మరో ‘బరువు’.. బడినుండి వచ్చిన వెంటనే ‘చాక్లెట్ల’ను ‘ఐస్‌క్రీమ్’లను నోళ్లలో కుక్కుకుంటూ ‘ట్యూషన్ల’కు పరుగుతీస్తున్న ‘బుడుతలు’ బస్తీబస్తీలో, గల్లీగల్లీలో కనిపిస్తున్నారు. సెలవు రోజులలో మినహా మిగిలిన అన్ని రోజులలోను ఈ ‘పరిగెత్తుడు’ ఉదయం ఏడునుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ జరుగుతూనే ఉంది. ఆటలాడని చిన్నారుల శరీరాలు బరువెక్కి పోతున్నాయి, వారు లావెక్కిపోతున్నారు. బస్సులలోను, ఆటోరిక్షాలలోను ఎక్కి, తొక్కిసలాటతో ఐదారు కిలోమీటర్లు పయనించి బడికిపోవడం మరో ‘బరువు’. పల్లెలలో కంటె నగరాలలో విద్యార్థులు బడికి వెళ్లడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుండడం మారిన దృశ్యం.. గతంలో పల్లెటూరి పిల్లలు కిలోమీటర్లమేర నడిచి బడికి వెళ్లేవారు. నడచినందువల్ల వారు ఆరోగ్యంగా ఎదిగారు. బరువు పెరగలేదు. హాయిగా గాలిని పీల్చుకొనేవారు, ప్రకృతిని దర్శించేవారు. ఇప్పుడు నగరాల బాలలు ఆటోలలోను బస్సులలోను ‘బరువు’కింద నలిగిపోతున్నారు, ఊపిరి ఆడటం లేదు! ‘హోమ్‌వర్క్’ పేరిట చిన్నారులను మానసిక వ్యధకు గురిచేస్తున్నారు. ఒకటవ రెండవ తరగతి పిల్లలకు ‘హోమ్‌వర్క్’ బరువును తప్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిందట!
స్వరూపానికి సంబంధించిన బరువుతోపాటు స్వభావానికి సంబంధించిన బరువును కూడ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందట! ఈ ‘స్వభావ భారం! బ్రిటన్ ‘దొరలు’ తమ దురాక్రమణ సమయంలో మన పిల్లల నెత్తికెత్తిపోయినది. అప్పటి పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత ఈ పెద్దవారు విద్యారంగంలోకి చేరిపోయి ఈ ‘స్వభావ భారం’తో పిల్లల బుద్ధిని చితకబాదుతున్నారు. బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన దేశం నుంచి నిష్క్రమించిన తరువాత ఏడు దశాబ్దులు గడిచినప్పటికీ మన దేశానికి సంబంధంలేని మనకు పనికిరాని ‘పరిజ్ఞానం’తో చిన్న పిల్లల బుద్ధిని నిలిపివేస్తున్నారు. ఈ ‘పరిజ్ఞానం’ భారతీయ విద్యార్థులను బ్రిటన్ విద్యావంతులుగా, ఐరోపా మేధావులుగా తీర్చిదిద్దుతోంది. భారతదేశం పట్ల చులకన భావం కల, అమెరికా పట్ల అనురక్తికల ఉన్నత విద్యావంతులు తయారయ్యారు, తయారవుతున్నారు. ఈ ‘చులకన భావం’ మాతృదేశం పట్ల మమకారం నశించడానికి దేశద్రోహులు తయారుకావడానికి దోహదం చేస్తోంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐరోపా చరిత్రను వారానికి ఐదు గంటలపాటు బోధించవలసిన అవసరం ఏమిటి? నాలుగవ తరగతి పిల్లలకు ఆఫ్రికాలోని ఆటవిక జాతుల జీవన విధానం గురించి తెలుసుకోవలసిన అవసరం ఏమిటి?? హైదరాబాద్‌లోని ఓ ‘అంతర్జాల కేంద్రం’- ఇంటర్నెట్ సెంటర్-లోకి ఒక రోజున ఐదారుగురు బాలబాలికలు వచ్చి చేరారు. వారికి ఆఫ్రికాలోని ఫలానా జాతివారి చిత్రపటాల ‘ప్రతులు కావాలి!’ ‘ఇంటర్నెట్’ నిర్వాహకుడు ఆ ‘విచిత్ర జాతి’వారి చిత్రపటాలను- ‘మ్యాప్’లను- తీసి ఇచ్చాడు. ఆ ‘జాతి’ వారు ఆడ మగా కలసి నగ్నంగా నిలబడి ఉన్నారు. ఎవరి ఒంటిమీద కూడ ఎలాంటి ఆచ్ఛాదన లేదు, నూలుపోగు సైతం లేదు. ‘‘ఇదేమిటీ? వీళ్లు ఇట్లా ఉన్నారు?’’ అని గుంపులోని ఇద్దరు ప్రశ్నించారు. ‘‘వాళ్లు ఇట్లే ఉంటారట.. అవును! మా టీచర్ చెప్పింది’’ అని మరో ఇద్దరు నాలుగవ తరగతి పిల్లలు సమాధానం చెప్పారు! ‘‘ఎందుకు మీకు ఆ బొమ్మ?’’ అని అడిగినవారికి ‘‘ప్రాజెక్టువర్క్ అంకుల్!’’ అన్నది బుడుతలు చెప్పిన సమాధానం! ఉన్నత కళాశాలలో విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు, ప్రత్యేక అధ్యయనాలు చేసే విద్యార్థులు ఈ ఆఫ్రికా ‘నగ్నజాతుల’ గురించి, ఐరోపా చరిత్ర గురించి నేర్చుకోవచ్చు! కానీ ఈ ‘నగ్న చిత్రాల ప్రాజెక్ట్‌వర్క్’ను చిన్నపిల్లల నెత్తికెత్తిన ‘బోధకుల’ మానసిక ప్రవృత్తి ఏమిటి? విద్యల స్వభావ నికృష్ట తత్త్వం ఏమిటి?? ఇలాంటి ‘పనికిరాని పాఠాల’ను పాఠ్యప్రణాళిక నుంచి తొలగించడం ద్వారా పుస్తకాల బరువును తగ్గించాలని కూడ కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిందట! ఒకటవ రెండవ తరగతి విద్యార్థుల ‘పుస్తకాల సంచి’ బరువు ఒకటిన్నర కిలోలకు మించరాదన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం జారీచేసిన మార్గదర్శక సూత్రం! ఎనిమిదవ తొమ్మిదవ తరగతుల పిల్లల ‘బడి సంచి’ నాలుగున్నర కిలోలకు మించి బరువు ఉండరాదని, పదవ తరగతి ‘సంచి’ బరువు ఐదు కిలోలకు మించరాదని కేంద్ర ప్రభుత్వం సూచించిందట! కానీ అమలు జరపడం సాధ్యమేనా? అన్నది వేచి చూడదగిన పరిణామం!
అతార్కికమైన, కాలదోషం పట్టిన, మన దేశానికి అన్వయం కాని పాఠ్యాంశాలను తొలగించడం వల్ల పుస్తకాల బరువు తగ్గడమే కాదు విద్యాప్రణాళిక స్వభావంలో మార్పురాగలదు! మన దేశంలోని విద్యావంతులు మితిమీరిన ప్రాంతీయ తత్త్వానికి ఒకవైపు, మతిమాలిన అంతర్జాతీయ ఆర్భాటానికి మరోవైపు గురవుతుండడం ప్రస్తుతం ఆవహించి ఉన్న స్వభావం! జాతీయతను, మాతృదేశం పట్ల మమకారాన్ని పెంపొందించే విద్యాప్రణాళిక స్వభావం మారినప్పుడు భారతీయుడు భారతీయుడుగా జీవించగలడు.. ‘సిబిఎస్‌ఇ’ ప్రణాళికను బోధిస్తున్న కేంద్రీయ పాఠశాలలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకూ కల పాఠ్యపుస్తకాలలో రఘురాముడి గురించి కాని, యదుకుల కృష్ణుడి గురించి కాని ‘బోధనాంశం’ లేదట! ఇదీ వర్తమాన పాఠశాల విద్యల స్వభావం..