సంపాదకీయం

విద్రోహ ప్ర‘సిద్ధు’డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదే పదే పాకిస్తాన్‌కు వెళ్లి రావడం ద్వారా నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అనే పంజాబ్ మంత్రి నిర్లజ్జగా, నిర్భయంగా తన దేశ విద్రోహ స్వభావాన్ని స్వయంగా ఆవిష్కరించుకొంటున్నాడు. ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టడం ద్వారా ఈ ప్రచ్ఛన్న విద్రోహకారుడు రాజ్యాంగ అనుశాసనాన్ని ఉల్లంఘిస్తున్నాడు, రాజకీయ సంస్థాగత క్రమశిక్షణను అతిక్రమిస్తున్నాడు. దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ ‘సిద్ధూ’ అనే అరాజకవాదికి సలహా ఇచ్చాడు. ఈ సంగతిని మంగళవారం నాడు అమరీందర్ సింగ్ స్వయంగా వెల్లడించాడు. తన సలహాను పెడచెవిని పెట్టి సిద్ధూ పాకిస్తాన్‌కు వెళ్లినట్టు అమరీందర్ బహిరంగంగా ప్రకటించడం సిద్ధూ పాల్పడిన అనుశాసన రాహిత్యానికి నిదర్శనం. ముఖ్యమంత్రి సలహాను ధిక్కరించిన సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాలి. అలా చేసి ఉండినట్టయితే సిద్ధూ చర్యతో పంజాబ్ ప్రభుత్వానికి ప్రమేయం ఉండేది. సిద్ధూను తన మంత్రివర్గం నుంచి తొలగించలేక పోవడం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుని నిస్సహాయతకు చిహ్నం. ‘పెదవులకు మించిన పన్ను’ వలె గత కొన్ని నెలలుగా అకాండ తాండవం చేస్తున్న సిద్ధూను ముఖ్యమంత్రి అదుపు చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీ విచిత్ర సంస్థాగత స్వభావానికి మరో నిదర్శనం. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా మంత్రులు బహిరంగంగా తిరుగుబాటు చేయడం ఈ విచిత్రం. కాంగ్రెస్ అధిష్ఠానం తప్ప తమపై ఇతరులు చర్యలు తీసుకోలేరన్న ధీమా సిద్ధూ వంటి వారిని ఆవహించి ఉంది. ముఖ్యమంత్రి అమరీందర్ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండను పరుష పదజాలంతో అభిశంసించిన తర్వాత కూడ ఈ సిద్ధూ అనే దుండగుడు పాకిస్తాన్ వెళ్లాడు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో పాకిస్తాన్‌ను విమర్శించిన సమయంలోనే సిద్ధూ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఆ దేశ ప్రధానమంత్రిగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశంసించాడు. ‘సరిహద్దు ప్రాంతం’ నుంచి నాలుగు కిలోమీటర్ల మేర కర్తార్‌పూర్ వరకూ ప్రయాణ ప్రాంగణ మార్గాన్ని నిర్మించడానికి అంగీకరించిన పాక్ ప్రజలను మెచ్చుకున్నాడు. సిద్ధూ ఇలా ముఖ్యమంత్రిని ధిక్కరించడం, అవమానించడం సంస్థాగత క్రమశిక్షణకు భంగకరమైన అంశం! కానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ‘రాజకీయ విదూషకుడు’ రాహుల్ గాంధీకి ఈ సంగతి పట్టడం లేదు. ఇప్పుడు మాత్రమే కాదు గత ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ పాక్ పౌర ప్రభుత్వ అధినేతగా, ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు కూడ సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. అప్పుడు పాక్ సైనిక దళాధిపతి ఖామర్ బజ్‌వాను సిద్ధూ బహిరంగంగా రెండుసార్లు కౌగిలించుకొని ఆప్యాయతను ప్రదర్శించడం పట్ల మన దేశంలో నిరసనలు చెలరేగాయి. స్వయంగా పంజాబ్ ముఖ్యమంత్రి కూడ ‘ఆలింగన చర్య’ను తప్పుపట్టాడు. అయినప్పటికీ రాహుల్ గాంధీ అప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ స్పందించలేదు.
ఇలా రాహుల్ గాంధీ అధ్యక్షుడి హోదాలో సిద్ధూపై చర్య తీసుకొనకపోవడానికి కారణం రాహుల్ అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్-కు సజీవ విగ్రహం కావడం. పాకిస్తాన్‌లో సైనికదళాల వారు పౌర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తున్నారు. మన దేశంలోకి జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతున్నారు. అందువల్లనే మన ప్రభుత్వం పాక్‌తో చర్చల ప్రహసనాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బీభత్సకారులను మన దేశంలోనికి ఉసిగొల్పడం ఆపనంత కాలం పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని మన ప్రభుత్వం స్పష్టం చేసింది. మన ప్రభుత్వం పదే పదే ఈ స్పష్టీకరణను ఇస్తోంది. బుధవారం నాడు సైతం విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ఈ సంగతిని స్పష్టం చేసింది. అందువల్లనే గత ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ఉత్సవానికి మన ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కాలేదు. కానీ పంజాబ్ మంత్రి హోదాలో సిద్ధూ మాత్రం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లి వచ్చాడు. వెళ్లినవాడు ఇమ్రాన్‌ను అభినందించి తిరిగి రావాలి. కానీ ఆ సభలో కనిపించిన పాక్ సైనిక దళాల అధిపతిని సిద్ధూ పనిగట్టుకొని రెండుసార్లు వాటేసుకొని వాత్సల్య భావాన్ని ప్రదర్శించాడు. భారతీయులను నిరంతరం హత్య చేస్తున్న జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పుతున్న పాక్ సైన్యాధిపతిని అలా కౌగలించుకొనడం ద్వారా సిద్ధూ ఈ బీభత్స చర్యలను సమర్ధించి తిరిగి వచ్చాడు. స్వజాతీయులను హత్య చేయిస్తున్న విదేశీయ ‘దళపతి’ని ప్రోత్సహించడం ద్వారా సిద్ధూ దేశ విద్రోహానికి ఒడిగట్టాడు. కానీ సిద్ధూను మంత్రి పదవి నుంచి రాహుల్ తొలగించలేదు, పార్టీ నుంచి వెళ్లగొట్టలేదు.
అందువల్ల సిద్ధూ మరింత బరితెగించాడు. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్‌కు వెళ్లాడు. లాహోర్‌లో ఇమ్రాన్‌ను పొగడడంతో పాటు మన ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలను గుప్పించాడు. ఇలా అంతర్గత విభేదాల గురించి విదేశాలలో ప్రస్తావించడం దేశ సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించడం రాజ్యాంగ నిబద్ధతను అపహాస్యం చేయడం! ఇలాంటి చర్యలకు గత ఆగస్టులో పాల్పడిన, ఇప్పుడు మళ్లీ పాల్పడుతున్న సిద్ధూను శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోగలదు? తీసుకోగలిగి ఉండినట్టయితే గత ఆగస్టులోనే పాక్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సిద్ధూను నిర్బంధించి న్యాయస్థానం ఎదుట నిలబెట్టి ఉండాలి! అది జరగలేదు.. అంటే ఇలాంటి దేశ వ్యతిరేక నేరాలను శిక్షించగల చట్టాలు లేవా? పాకిస్తాన్ ప్రత్యక్ష బీభత్సకారులు, పరోక్ష బీభత్సకారులైన ఆ దేశ సైనికులు నిరంతరం మన ప్రజలను హత్య చేస్తున్నారు, మన సైనికులను దొంగచాటుగా హత్యచేసి భౌతిక శరీరాలను ముక్కలుగా నరికి పాకిస్తాన్ వీధుల్లో ఊరేగించారు. అలాంటి పాకిస్తాన్ సైనిక ముఠా నాయకుడిని సిద్ధూ కౌగిలించుకొన్న దృశ్యాలు హతుల కుటుంబాల వారికి ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయి? ఈ విషాద అనుభూతులను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సోమవారం నాడు స్వయంగా ఆవిష్కరించాడు. మన పంజాబ్‌లోని ‘డేరాబాబా నానక్’ వద్ద రహదారి ప్రాంగణానికి ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం నాడు శిలాన్యాసం చేసిన సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలసి ఉత్సవంలో పాల్గొన్నపుడు అమరీందర్ ఈ విషాద అనుభూతులను ఆవిష్కరించాడు. అందువల్లనే కర్తార్‌పూర్‌లో జరుగనున్న రహదారి ప్రాంగణ శంకుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా పాక్ ప్రభుత్వం కోరినప్పటికీ అక్కడికి వెళ్లడానికి పంజాబ్ ముఖ్యమంత్రి నిరాకరించాడు. ముఖ్యమంత్రి హాజరు కావడానికి నిరాకరించిన కార్యక్రమానికి సిద్ధూ వెళ్లాడు..
గురునానక్ దేవుడు సిక్కుమత స్థాపకుడు. ఆయన దాదాపు ఇరవై ఏళ్లపాటు అఖండ భారత్‌లోని అఖండ పంజాబ్‌లోని కర్తార్‌పూర్ కేంద్రంగా తన ధార్మిక కలాపాలను నిర్వహించాడు. గురునానక్ జాతీయ ధర్మాచార్యుడు, భారతీయులకు ఆరాధ్యుడు. ఆయన జన్మించి ఐదు వందల నలబయి తొమ్మిది ఏళ్లు అయింది. ఐదువందల యాబయ్యవ జయన్తి ఉత్సవాలు సంవత్సరం పొడవునా జరుగనున్నాయి. సరిహద్దుకు మన వైపున ఉన్న గురుదాస్‌పూర్‌లోని ‘డేరాబాబా నానక్’ నుంచి పాకిస్తాన్ వైపున ఉన్న కర్తార్‌పూర్ వరకూ రహదారి ప్రాంగణాన్ని నిర్మించడం ఈ ఉత్సవ నిర్వహణలో భాగం. తమ భూభాగంపై నాలుగు కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించడానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ దీనివల్ల పాక్ ప్రభుత్వ బీభత్స స్వరూప స్వభావాల్లో మార్పు వచ్చినట్టు కాదు. తమ దేశంలో ‘సార్క్’ సభను నిర్వహించాలన్న పాకిస్తాన్ కోర్కెను మంగళవారం మన ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు పాక్‌లోని అవశేష హిందువులపై జిహాదీలు హత్యాకాండను జరుపుతూనే ఉన్నారు. ఈ జిహాదీలు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు... కర్తార్‌పూర్ రహదారి ప్రాంగణ నిర్మాణ కార్యక్రమం ఆరంభమైన సమయంలోనే పాక్ వాయువ్య ప్రాంతంలో ముగ్గురు సిక్కులను జిహాదీలు హతమార్చారు.. ఇలాంటి పాకిస్తానీ వ్యవస్థను సిద్ధూ లాహోర్‌లోను కర్తార్‌పూర్‌లోను మెచ్చుకొన్నాడు.. స్వదేశ వ్యతిరేక విషం కక్కుతున్నాడు!!