సంపాదకీయం

క్షేమదాయకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థరాత్రి, అపరాత్రి షాపింగ్‌లకు, సినిమాలకు ఎంతమంది వెళ్లగలరు? ఈ సమయంలో ఆడవారు, వృద్ధులు ఈ సదుపాయాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలరు? మన యింటి పక్కన మనకు కావలసినవి దొరకవు కదా. మరి లోకల్ బస్సులను రాత్రంతా నడుపుతారా? అందరికి స్వంత వాహనాలు ఉండవు. దీనివల్ల నిరుద్యోగం నివారించబడుతుందా? రాత్రి తెల్లవార్లు షాపులు తెరచి ఉండటం వల్ల కరెంటు ఖర్చు ఎంతవుతుందో కదా. అదీగాక పట్టపగలే ఆడవారికి రక్షణ లేకుండా పోతున్నది. రాత్రివేళ కరెంటుపోతే ఇక రక్షణ ఎక్కడ? ఈ పథకం ఏకోశానా క్షేమదాయకం కాదు.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
నమ్మకం సడలిపోతుంది
న్యాయమూర్తులు, న్యాయాధికార్లు, న్యాయవ్యవస్థ, విచక్షణకు, హుందాతనానికి, క్రమశిక్షణకు పెట్టింది పేరు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయాధికార్లు క్రమశిక్షణ, సర్వీసు నిబంధనల్ని కాదని ఆందోళనకు దిగడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. వారికి చట్టాలు తెలుసు, న్యాయాలు తెలుసు. అయినా రాజకీయ నేతల్లాగ, ట్రేడ్ యూనియన్ నాయకుల్లాగ ప్రవర్తించడం చరిత్రలోనే మొదటిసారి. 11 మంది న్యాయాధికారుల్ని సస్పెండ్ చేయడం, అందుకు ప్రతిగా 200 మంది న్యాయాధికార్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం, సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు దిగుతాననడం, ప్రజలకు న్యాయవస్థపైనే నమ్మకం సడలిపోయే దుర్ఘటనలు.
- స్నేహమాధురి, పెద్దాపురం
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు
ప్రపంచ దేశాల్ని నిత్యం వణికిస్తున్న స్థాయికి ఉగ్రవాదం పెరిగిపోవడం ఆందోళనకరం. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒకదేశం తీవ్రవాద గాయాలతో నెత్తురోడడం సాధారణమైపోయింది. పేర్లు, వాదాలు, రూపాలు, సిద్ధాంతాలు ఏవైనా అంతిమంగా అమాయకుల్ని బలిగొనడం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి అస్తవ్యస్త పరచడమే లక్ష్యంగా ఉగ్రవాద వ్యవస్థలు విరుచుకుపడుతున్నాయి. ఇది నాగరిక సమాజానికి ఉమ్మడి వైఫల్యం. తీవ్రవాద సమస్యను తక్కువ చేసి చూడడం ద్వారా కొన్ని దేశాలు ఉదాసీనత వహిస్తుండగా, లాభనష్టాల బేరీజులతో మరికొన్ని దేశాలు ఉత్తుత్తి యుద్ధం చేయడంతో చివరకు అన్నిదేశలూ నష్టపోయే దశకు చేరుకున్నాయి.
ఇంతవరకు ఉగ్రవాదాన్ని ఎలా నిర్వహించాలి? ఏ స్థాయిలో ఎదుర్కోవాలి? అన్న ప్రాథమిక అంశాల పట్ల ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలకు ఏకాభిప్రాయం కుదరలేదు. వివిధ కారణాలతో అమెరికా, లాటిన్ అమెరికా, ఇస్లామిక్ యూనియన్ దేశాలు ఉమ్మడిపోరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుకనే భారత్ ప్రతిపాదించిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర విధానం’ (సీసీఐటీ) దశాబ్దకాలంగా ఐక్యరాజ్య సమితిలో అతీగతీ లేకుండా పడివుంది. దాని బూజు దులపాల్సిన అవసరం ఇప్పుడు సభ్యదేశాలపై ఉంది. త్వరితంగా తమ భిన్నాభిప్రాయాల్ని తగ్గించుకొని, ఏకాభిప్రాయంతో ఏకోన్ముఖంగా అన్ని రూపాల తీవ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిపోరు దిశగా ప్రణాళికల్ని రచించాల్సిన అవసరం ఉంది. ఉదాసీనత, పక్షపాత పాక్షిక యుద్ధాలతో ప్రమాదం పెరగడమే కాని ఫలితం ఉండదు. అందువల్ల ఏకాభిప్రాయం అవసరం.
-డా. డి.వి.జి. శంకరరావు(మాజీ ఎంపి), పార్వతీపురం
జాతీయ క్రీడకు ప్రోత్సాహం ఏదీ?
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యత మరే క్రీడలకూ అధికారులు ఇవ్వలేకపోవడం గమనార్హం. క్రికెట్‌నే హైలైట్ చేయడం, క్రికెట్ సిరీస్‌లపైనే ఎక్కువ శ్రద్ధ చూపించడం, ఐ.పి.ఎల్. వంటివి ఏటా నిర్వహిస్తూ, వాటిపై కోట్లు సంపాదించడం జరుగుతున్నది. అయితే మన జాతీయ క్రీడ హాకీ అని చాలామందికి తెలియదంటే అతిశయోక్తికాదు. జనరల్ నాలెడ్జి చదివిన వారికే తెలుసు. అలనాటి జాతీయ క్రీడకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలి. హాకీ సిరీస్‌లను బాగా నిర్వహించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
పాత విధానమే శ్రేయస్కరం
ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివలన ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలుగుతున్నది. కావున కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
- జవ్వాది వెంకటరమణ, విశాఖపట్నం