ఉత్తరాయణం

ఇంత ఖర్చు అవసరమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం కరువుతో బాధపడ్తుంటే కేంద్ర సాయమందలేదని ఆరోపిస్తున్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు అవసరమా అనేది పునరాలోచించి- ప్రతిపాదన విరమించుకోవడమో, వాయిదా వేయడమో మంచిది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తాలూకాల స్థానంలో మండలాలు ఏర్పాటుచేశారు. సర్పంచులు సమితి అధ్యక్షుని, వారు జడ్పీ అధ్యక్షుని ఎన్నుకునే వ్యవస్థ స్థానంలో యంపిటిసిలు, జడ్పీటిసిలు అనేవారు కొత్తగా వచ్చారు. ప్రజాప్రతినిధులు అని పిలవబడేవారి సంఖ్య పెరిగింది, నిధులు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి తప్ప జనబాహుళ్యానికి ఒరుగుతున్నదేమీ లేదు. రాశి పెరిగింది వాసి లేదు.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైద్రాబాద్

స్తంభించిన పరిపాలన
దేశంలో, రాష్ట్రంలో పాలకులు దైనందిన పరిపాలన గాలికొదిలేసి ఏవేవో అనవసర కార్యక్రమాలు ఆర్భాటాలుచేస్తున్నారు. ప్రజలు ఎవరికివారే చేసుకునే కార్యక్రమాలు పాలకులు చేపట్టి ప్రజలను మామూలు పనులు చేయకుండా నానా బాధలు పెడుతున్నారు. పాలకులు విధి విధానాలను నిర్ణయించాలి. వాటిని అధికారులు అమలుచేయాలి. లక్షల ఫైళ్లు పెండింగులో వున్నాయని పాలకులే అంగీకరించారు. ఇట్లా అయితే ప్రజలేం సుఖపడతారు? ఫైళ్లు పరిష్కారం కావాలంటే ప్రజల పనులు కావాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఆఫీసులో వుండాలి. ఫైళ్లు పరిశీలించాలి. పరిష్కరించాలి. ఇవన్నీ జరుగుటలేదు. ఎందుకంటే పాలకులు 365 రోజులు ఊరూరా తిరుగుతూ ఏవేవో ప్రజాకర్షక పనులు చేస్తుంటారు. ఇవన్నీ ఓట్లకోసం పాట్లు. ఇటువంటివన్నీ ఎలక్షన్లు ముందు పెట్టుకోవాలి. దయచేసి పాలకులు ఆలోచించాలి. మారాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
ఇది న్యాయమా?
గ్రామాల్లోగల చౌక ధరల డిపోల ద్వారా బియ్యం, పంచదార, కిరోసిన్ పొందే రేషను కార్డుదారులందరు కడు పేదవారే. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంలో చాలామంది వేలిముద్రలు, ఐరిష్ ద్వారాకండ్ల గుర్తులు పడకపోవడంతో నిత్యావసర వస్తువులు పొందలేకపోతున్నారు. అట్లు వేలిముద్రలు పడని వారికి తిరిగి వేలిముద్రలు వేయుటకు ప్రైవేటు ఇసేవా కేంద్రంవారు వుచితంగా గాక ప్రతి రేషను కార్డుదారునుండి 80 నుండి 100 రూపాయలు వసూలుచేయుట న్యాయమా? అట్లే ఆధార్‌కార్డు మార్పులుచేర్పులు చేయుటకు వంద రూపాయలు వసూలుచేయటం న్యాయమా? ప్రభుత్వం పరిశీలించ మనవి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు
ప్రహ్లాదుడి విగ్రహం ఏదీ?
ఆంధ్రదేశంలో వున్న పలు నారసింహ క్షేత్రాలలో సింహాచలం క్షేత్రానికి ఎంతో విశిష్ఠ స్థానం వుంది. ఇక్కడ నరసింహుని అవతారానికి కారణభూతుడైన ప్రహ్లాదుని విగ్రహం ప్రతిష్టించాలన్న భక్తుల మనోభావాలను దేవస్థానం ఇంతవరకు పరిశీలనలోనికి తీసుకోకపోవడం శోచనీయం. ఏడాది క్రితం ప్రహ్లాదుని విగ్రహాన్ని తయారుచేయించి దేవస్థానానికి సమర్పించినా ఇంతవరకు ప్రతిష్టకు నోచుకోలేదు. విగ్రహ ఏర్పాటుదారులు, దేవస్థానానికి మధ్య నలుగుతున్న వివాదం మూలంగా సింహగిరిపై గోకులంలో వదిలేసిన ప్రహ్లాదుని విగ్రహం దుమ్ము, ధూళి పట్టి ఆలనా పాలనా లేకుండా వుంది. ప్రభుత్వం ఆధ్యాత్మికవేత్తలు చొరవ చూపించి ఈ వివాదానికి తెరదించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

నకిలీ పోలీసుల బెడద
తెలుగు రాష్ట్రాలలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హైవేలలో ఎక్కువ సంచారం ఉండని ప్రాంతాలలో లారీ డ్రైవర్ల దగ్గర, ద్విచక్రవాహనదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా మహిళలు కనబడితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరికి ప్రజలు దేహశుద్ధిచేసినా బుద్ధి రావడంలేదు. వీటిని అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వుంది. దీనితోపాటు మరికొందరు మంత్రి బంధువులమని హల్‌చల్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అసలు శాఖవారు కూడా తక్కువ ఏమీ కాదు. గంధపు చెక్కల దొంగలకు సహాయం చేయటం, మరికొందరైతే పేకాట ఆడుతూ దొరికిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నకిలీ పోలీసులను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
-ఎ.రాము, ఖమ్మం
పార్కు పేరు మార్చకండి
నగరానికి తలమానికం వాకర్స్ ప్యారడైజ్ కె.బి.ఆర్. పార్కు. జనాబ్ ముకరంజాగారి నుంచి గతంలో యు.ఎల్.సి. కింద సేకరించిన స్థలంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. కనుక ముకరంజాగారి పేరుగా పార్కును మార్చాలని కొందరి కోరిక. అవసరం అనుకుంటే- కీర్తిశేషులు జాగారి పేరుకు ప్రాధాన్యత కావాలంటే ముకరంజాగారి కాంస్య నిలువెత్తు విగ్రహాన్ని పార్క్‌లో సింహద్వారంలోనే ఏర్పాటుచేయాలని బంగారు తెలంగాణాకు విజ్ఞప్తి చేస్తున్నాం.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి