జాతీయ వార్తలు

శని ఆలయంలో మహిళలను అడ్డుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పురుషులు పూజలు చేసే ఏ ఆలయంలోనైనా- మహిళలను అడ్డుకునేందుకు ఏ చట్టం అనుమతించదని ముంబయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. మహారాష్టల్రోని ఔరంగాబాద్ జిల్లా శనిషింగనాపూర్ ఆలయంలో ప్రవేశించేందుక మహిళలు అర్హులేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. అనాదిగా ఈ శని ఆలయంలో మహిళలకు అనుమతి లేకపోవడంపై ఇటీవల కొందరు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఈ ఆలయంలో అనుమతి లేకపోవడంపై కోర్టు విస్మయం చెందింది. పురుషులకు ఉన్న హక్కులూ మహిళలకు సైతం వర్తిస్తాయని, శని ఆలయంలో ఇకపై ఎలాంటి వివక్ష ఉండరాదని న్యాయమూర్తులు ఆదేశించారు.