సంజీవని

ఆరోగ్య సంరక్షణలో విటమిన్లు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఫూర్ణ ఆరోగ్యానికి విటమిన్లు అవసరమనే విషయం అందరికీ తెలిసినదే. మోతాదుకు మించి విటమిన్లు తీసుకుంటే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని హెచ్చరిస్తారు.
కాని బి-6, ఫోలికామ్లం (్ఫలేట్) విటమిన్లను వైద్యుడు సూచించిన మోతాదుకుమించి తీసుకుంటే మహిళల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతున్నట్లు అమెరికన్ శాస్తవ్రేత్తలు గుర్తించారు. పురుషుల విషయంలోకూడా ఇది నిజమని తేలింది.
వైద్యులు సాధారణంగా అనుదినం 180 మైక్రోగ్రాముల ఫోలేట్‌ను తీసుకోవచ్చునని సిఫార్సు చేస్తారు. ఇటువంటి స్ర్తిలకు 700 మైక్రోగ్రాముల ఫోలేట్‌ను ఇచ్చి పరిశోధనలు చేసి పై ఫలితాలను తెలుసుకున్నారు.
అదేవిధంగా వైద్యులు రోజుకు బి-6 విటమిన్‌ను 1.6 మిల్లీ గ్రాముల వరకు తీసుకోమని సూచిస్తే వారికి పరిశోధకులు 4.6 మిల్లీ గ్రాముల వరకు ఇచ్చారు. ఫలితంగా వీరిలో హృదయ సంబంధిత రుగ్మతలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ పరిశోధనా స్థాయిలో వున్న విషయాలు.
శరీరం తయారుచేయలేదు!
మన శరీరం స్వయంగా విటమిన్లను తయారుచేసుకోలేదు. అందుకే వాటిని ఆహారంతో తీసుకోవాలి. లేదా టాబ్లెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే విటమిన్ ‘డి’ని మాత్రం శరీరం తయారుచేసుకోగల్గుతుంది.
విటమిన్-డిలో 5 రకాలు వున్నాయి. డి, డి2 డి3.. ఇలా మనకు అవసరమైనది ఉపయోగపడేది డి3 విటమిను. దీనినే ‘కోలీకాల్స్ ఫెరాల్’ అని అంటారు.
డి3 విటమిన్ శరీరంలో ఏదో ఒక చోట తయారుకాదు. అది వివిధ దశల్లో రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది.
పిల్లలకు ‘విటమిన్-ఎ’ ఎంతో ముఖ్యమైనది. పిల్లలకు తల్లిపాలు చక్కని సమీకృతాహారం. ఇది లోపిస్తే వారు తినే ఆహారంలో విటమిన్-ఎ, విటమిన్-బి తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ విటమిన్‌ల లోపం పిల్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో పెరుగుదల తగ్గుతుంది. కండపుష్టి తగ్గి వున్న కండలు కరిగిపోతాయి. పిల్లలు గిడచబారిపోతారు.
పిల్లలకు విటమిన్-ఎ లోపం వుందంటే వారి కంటి నల్లగుడ్డుని ఆనుకుని వున్న ఇరువైపులా తెల్ల గుడ్డుపై పసుపు, గోధుమ రంగుల్లో త్రిభుజాకారంగా వుండే స్పాట్స్ ఏర్పడతాయి
నల్లగుడ్డు నిగనిగ తగ్గుతుంది. ఇది క్రమంగా వారిలో రేచీకటికి దారితీస్తుంది. చాలామందికి బాల్యంలో అంధత్వం కలగడానికి కారణం విటమిన్-ఎ లోపమే.
విటమిన్-ఎ లోపంవల్ల చర్మంలోను, ఊపిరితిత్తులలోను, జీర్ణకోశంలోను కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.
చర్మం పొడిగా, పొడలుపొడలుగా మారుతుంది. ఈ మార్పులు మోచేతులు వెనుకా, మోకాళ్లు ముందు కన్పిస్తాయి. దగ్గు, జ్వరం రావడం, నీరసించడం, పిల్లలు డీలాపడిపోవడం వంటివి కన్పిస్తాయి. ఇవన్నీ పిల్లల్లో కన్పించే లక్షణాలు.
ఏమి చెయ్యాలి?
విటమిన్-ఎ లోపంవల్ల శరీరం అనారోగ్యానికి గురయితే అనవసరపు ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా 1-5 సంవత్సరాలలోపు పిల్లకు ఆరు నెలలకు ఒకసారి ఒక చెంచాడు ‘విటమిన్-ఎ’ కాన్సన్‌ట్రేట్ ఇస్తే సరిపోతుంది.
అంతకన్నా తేలికైన విషయం ఆహార లోపం లేకుండా పిల్లలకు చక్కని సమీకృత ఆహారం ఇవ్వడం ఉత్తమం.
పాలు లేని తల్లులూ, పాలు లేవని తెలుసుకోలేని తల్లులూ, పాలివ్వని తల్లులూ ఎక్కువ అయ్యే కొలది శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి వస్తుంది.
1-5 సంవత్సరాల వయసు మధ్య ఉండే పిల్లలకు ప్రోటీన్లు, విటమిన్లు విరివిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.
ఎక్కువయితే ప్రమాదం!
గర్భిణీలు ఏ కొద్దిపాటి ఎక్కువ మోతాదులో విటమిన్-ఎ తీసుకున్నా వారికి పుట్టే బిడ్డలకు శారీరక లోపాలు ఉండే ప్రమాదం ఉంటుందని బోస్టన్‌లోని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా గర్భవతులు వైద్యుల సలహా మేరకో లేక సొంతంగానో మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే మార్కెట్లో లభించే అనేకానేక మల్టీ విటమిన్ టాబ్లెట్లలో విటమిన్-ఎ దాదాపు 25 వేల అంతర్జాతీయ యూనిట్స్ వరకు ఉంటోంది.
అసలు విటమిన్-ఎ 10వేల అంతర్జాతీయ యూనిట్స్‌కు మించి ఉంటే వారికి జన్మించే బిడ్డలకు అవయవ లోపం ఏర్పడే ప్రమాదం ఉందని వీరి హెచ్చరికలు.
గర్భిణీలు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు వాటిలో విటమిన్-ఎ, 5 వేల అంతర్జాతీయ యూనిట్స్ మించకుండా ఉండేలా జాగ్రత్తపడమని సూచిస్తున్నారు.
విటమిన్-డి వ్యవహారం
విటమిన్-డి లోపిస్తే ఆకలి మందగించడం, నిద్రలేమి, బరువు తగ్గడం, కండరాల నొప్పులు, నిస్త్రాణ, నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎముకలకు సంబంధించి డి-విటమిన్ లోపంవల్ల చిన్న పిల్లల్లో కాళ్లువంకర తిరిగి దొడ్డికాళ్లుగా తయారవుతాయి. యువతీ యువకుల్లో ఎముక పుష్టి తగ్గి నడవడం కష్టం అవుతుంది. విటమిన్-డి కొరత ఎక్కువయితే ఎముకలు విరగడం కూడా జరుగుతుంది.
విటమిన్-డి లోపం వలన పెద్దవారిలో ఎముకల నొప్పులు, అవి విరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలకు విరుగుడుగా విటమిన్-డి తీసుకోవాలి.
విటమిన్-డి లోపాన్ని సవరించుకునేందుకు పూర్తిగా ఆహారం, సూర్యరశ్మి మీద ఆధారపడాల్సి వస్తుంది.
విటమిన్-డి మాత్రలు, ఇంజెక్షన్లరూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంజెక్షన్ నెలకొకసారి చేస్తూ ఉంటారు.
శరీరంలో విటమిన్-డి ఎక్కువైతే అనర్థాలు ఉంటాయని భావించేవారు. ఇదంతా అపోహ మాత్రమేనని దాని డోసు శరీరంలో ఎక్కువగా ఉంటే ఎటువంటి నష్టముండదంటున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ నీడచాటున కాలక్షేపం చేయక అప్పుడప్పుడు ఎండలో ఉండాలి.

-సి.వి.