సంజీవని

ఒత్తిడి లేకుంటే తలనొప్పి తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన శరీరంలో ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా, ఆ నొప్పిని గుర్తించే మెదడుని కోసినా నొప్పి వుండదు. కానీ, మనం చాలాసార్లు తలనొప్పితో బాధపడుతుంటాం. కాకపోతే అది తలలో వచ్చినా మెదడు నొప్పి కాదు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన నొప్పిని మెదడు గుర్తిస్తుంది, ప్రకటిస్తుంది. అందుకోసమని ప్రత్యేకంగా సెన్సరీ నెర్వ్స్ వున్నాయి. ఉదాహరణకి కణతల ప్రాంతంలో అటు ఇటు నొప్పి వచ్చి తల దిమ్మెక్కిపోతుంటుంది. అందుకు కారణం, ఆ ప్రాంతాలలో వున్న రక్తనాళాలు, వాటిలో రక్తప్రసరణ ఒక పద్ధతి ప్రకారం కాక హెచ్చుతగ్గులుగా వస్తోందనుకోండి. తలనొప్పి వస్తుంది. సాధారణంగా మానసిక ఒత్తిడివల్ల తలనొప్పులు వస్తుంటాయి. మెడ కండరాలు, ముఖం, మాడు, అలసిపోయిన కండరాలు కూడా తలనొప్పికి కారణమవుతుంటాయి. ఎక్కువగా ఏ విషయం పట్ల అయినా మనం స్పందిస్తే, కండరాలు బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి. సైనస్ ఇన్‌ఫెక్షన్, పంటినొప్పి, చెవినొప్పులతో కూడా తలనొప్పి వస్తుంది. ఎక్కువగా మద్యం సేవించడంవల్ల తలలోని రక్తనాళాలు వ్యాకోచం చెంది తలనొప్పులు వస్తాయి.
కోపం లాంటి స్వభావాలను, ఒత్తిడులను అదుపులో వుంచుకుంటే చాలావరకు తలనొప్పుల్ని రాకుండా చూసుకోవచ్చు. రిలాక్సేషన్ థెరపిలాంటి వాటితో కండరాలు బిగుసుకుపోకుండా కుంచించుకుపోకుండా కాపాడుకోవచ్చు. ధ్యానం, సంగీతం వినడం, మంచి పుస్తకాల్ని చదవడం వంటి అలవాట్లతో రిలాక్స్ అయిపోవచ్చు.
హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చి అంతా అలికేసినట్లు కనిపించడం, అయోమయంగా అనిపించడం, ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం, తలమీద గట్టి దెబ్బ తగలడంవల్ల నొప్పి వచ్చినా, కన్ను, చెవివల్ల తలనొప్పి వచ్చినా, జ్వరంతో తలనొప్పి వచ్చినా, తలనొప్పితో మనం ఏ పనీ చేయలేకపోతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలు కేంద్ర నాడీ మండలాన్ని దెబ్బ తగిలినపుడే వస్తాయి.
తలనొప్పులలో ఒక విభాగం క్లస్టర్ తలనొప్పులు. ఇవి వచ్చి తగ్గి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. సాధారణంగా ఒక కంటి చుట్టూ నొప్పితో ఈ క్లస్టర్ తలనొప్పులు ప్రారంభమవుతాయి. నొప్పితోపాటు కంటివెంట నీరు కూడా వస్తుంటుంది. ముక్కు దిబ్బడ వేస్తుంది. క్రమంగా నొప్పి ఎక్కువై ముఖానికి ఒక భాగమంతా వ్యాపిస్తుంది. తగ్గుతుంది. మళ్లీ వస్తుంది. ఇతరులకన్నా 20 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న మగవారిలో ఈ క్లస్టర్ తలనొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కారణం తెలియదు. ఈ రకం తలనొప్పులు వస్తుంటే వెంటనే వైద్యుణ్ణి కలిసి ఒక్కసారి తలనొప్పి వస్తే ఎంతసేపు వుంటుందో, ఏఏ ప్రాంతాలలో వస్తుందో, ఆగి ఎంత సేపటి తరువాత మళ్లీ వస్తోందో వివరంగా చెప్పాలి.
మైగ్రేన్‌తో తలనొప్పి చాలా తీవ్రంగా వుంటుంది. తల తిరగడం, వాంతులు రావచ్చు. ఒక్కసారి మైగ్రేన్ తలనొప్పి వచ్చిందంటే కొన్ని రోజులుంటుంది. ఈ తలనొప్పులకు ఒత్తిడి ప్రధాన కారణం. చాక్‌లెట్స్‌లాంటి కొన్ని పదార్ధాలు తిన్నా, రెడ్‌వైన్ లాంటివి తీసుకున్నా, ఆడవాళ్ళలో బైట ఉన్నపుడు ఈ మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా వచ్చే ప్రమాదముంది. గర్భిణీలలో ఈ మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. నొప్పి తీవ్రతలోగాని, ఉండే కాలంలో కానీ, మామూలు తలనొప్పులకన్నా ఎక్కువగా తలనొప్పి వుంటుంది. మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే నాళాల్ని మైగ్రేన్, తలనొప్పులు సన్నబరిచి మళ్లీ వ్యాకోచింపచేస్తుంటాయి. దాంతో రక్తప్రసరణ సరిగా ఉండదు. వంశపారంపర్యంగా కూడా ఈ మైగ్రేన్ తలనొప్పులు వస్తుంటాయి. ఏదైనా తలనొప్పి తలనొప్పే. ఏ పని చేసుకోకుండా ఇబ్బంది పెడుతూనే వుంటుంది. రక్తనాళాలు, రక్తప్రసరణలో తేడాలూ తలనొప్పే. కాఫీ ఎక్కువగా తగుతున్నా తలనొప్పి వస్తుంది. ఎలర్జీవల్ల, హేంగోవర్‌వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

-డా.వేముల శ్రీకాంత్
సీనియర్ న్యూరాలజిస్ట్.. 98481 70120..
మాగ్నక్లినిక్స్, జూబిలీహిల్స్, హైదరాబాద్.

-డా.వేముల శ్రీకాంత్