సంజీవని

వర్షం తెచ్చే రోగం.. ఇదీ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంటలలో నీరు నిలువ ఉండి, మురికి నీరుగా మారి తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి.
అలాగే వర్షాలు పడిన చోట నీరు కలుషితం కావడంతో అతిసార వ్యాధి సంభవిస్తుంది. ఇటువంటి వ్యాధులకు హోమియో బాగా ఉపయోగపడుతుంది.
అతిసార
వర్షాకాలంలో సాధారణంగా అతిసార కలుషిత నీరు ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైనవారికి ఉన్నట్లుండి వాంతులు, విరేచనాలు అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి, నోరు ఎండిపోవడం, కాళ్ళు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు విరేచనాలు త్వరగా తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది.
వ్యాధి లక్షణాలు
- విరేచనాలు, వాంతులు ఉన్నట్లుండి ఒకేసారి పెద్ద మొత్తంలో అవుతాయి.
- తద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ స్థితి ఏర్పడుతుంది.
- ఇలాంటి స్థితిలో చర్మాన్ని పైకి లాగి వదిలితే అలాగే ఉండిపోతుంది.
- వృద్ధుల్లో చర్మం ముడతలు పడి ఉంటుంది.
- కళ్ళు గుంటల్లాగా ఉండటంతోపాటు చాలా నీరసంగా వుంటుంది.
- అతిసార వ్యాధి తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నాడి వేగంగా ఉంటుంది.
- కొన్ని సందర్భాల్లో నాడి తెలియకుండా ఉంటుంది.
- రక్తపోటు తగ్గిపోతుంది. రక్తపోటును నమోదు చేయలేని స్థితికి కూడా జారిపోతుంది.
- శరీరం చల్లబడి రోగి అపస్మారక స్థితిలో ఉండి, కోమాలోకి వెళ్లిపోయి మరణం సంభవిస్తుంది.
నివారణ
-అతిసార వ్యాధివల్ల శరీరం నీటిని, లవణాలను అత్యధికంగా కోల్పోతుంది. కనుక ఈ వ్యాధికి గురైన రోగికి వెంటనే ద్రవపదార్థాలు ఇవ్వాలి.
- కొబ్బరినీరు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ప్రారంభం నుంచి ఇవ్వాలి.
- డీహైడ్రేషన్ నివారణకు కాచి చల్లార్చిన ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వాలి. లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి.
- అతిసార వ్యాధికి గురైన వ్యక్తి నోటితో ద్రవ పదార్థాలు తీసుకోగలిగినంతవరకూ సెలైన్ అవసరం రాదు.
- నోటితో ఏమీ తీసుకోలేని స్థితిలో ఇంట్రావీనస్ ద్వారా సెలైన్‌ను డాక్టర్ల సమక్షంలో ఇవ్వవలసి వుంటుంది.
మందులు.. హోమియో మందులను లక్షణాల ఆధారంగా వాడవలసి వుంటుంది. ముఖ్యంగా పోడోపైలం, ఆర్సినిక్ ఆల్బ్, కాంఫర్, వెరాట్రం ఆల్బం, చైనా, ఇపికాక్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే అతిసార వ్యాధి నివారణ అవుతుంది.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646