సంజీవని

జీవన విధానం... ఆరోగ్య సూత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు, పరిమాణం తక్కువగా ఉన్న మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఎంతో కష్టపడుతోంది గుండె. ఇరవై నాల్గుగంటలూ కృషిచేయడమెలాగో అది మనకి నేర్పుతోంది కూడా! గుండె తన పని చేయడాన్ని ఆపడమంటే మనం జీవితాన్ని ముగించడమే! శరీరంలోని అన్ని కణాలకు ఆహారం, ఆక్సిజన్‌లని అందిస్తూంటేనే మన జీవక్రియలు సక్రమంగా జరిగేది. శరీరాలలో చిన్న, పెద్ద, ముఖ్యం అంటూ ఏ అవయవాల్నీ పేర్కొనలేం. అవి ఎంత పరిమాణంలో ఉన్నా అన్నీ ముఖ్యమైనవే! ఆ అవయవాల పనితీరుకి భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి గాని భయపడకూడదు. కాకపోతే, గుండె పనికి భంగం వాటిల్లితే, మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం కష్టం అని గుర్తుంచుకుని మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి.
పుట్టుకతో వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బుల్ని ఆపలేం. చికిత్సతోనే మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ కొన్ని ఇబ్బందులు మన అలవాట్లవల్ల, ప్రవర్తనవల్ల కలుగుతుంటాయి. ఆ అలవాటుకు, పరిస్థితులకు దూరంగా ఉండి, వీటివల్ల గుండెకి ఇబ్బందులు కలగకుండా చూసుకోగలగడం మన చేతుల్లో వుంది.
ముందు ఆహారపుటలవాట్లని జాగ్రత్తగా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఆహారంలో తీసుకుంటే అంత మంచిది. ఆహారాన్ని ఎక్కువెక్కువగా ఒకసారో, రెండుసార్లో తీసుకోవడంకంటే- తక్కువ తక్కువ ఎక్కువసార్లు- రోజుకి ఏ నాలుగుసార్లో తీసుకోడం మంచిది. ఒకసారి ఆహారం తీసుకోవడానికి, మరోసారి ఆహారం తీసుకోవడానికి మధ్య మరీ ఎక్కువ సమయం ఉండేలా ఆహారం తీసుకోకూడదు. ఉదాహరణకు, రాత్రి ఏ తొమ్మిదింటికో ఆహారం తీసుకుని కొందరు మర్నాడు ఉదయమంతా కూడా ఏమీ తీసుకోకుండా మధ్యాహ్నం ఏ ఒంటిగంటకో తింటారు. మధ్య ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో అల్పాహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో కూడా అల్పాహారాన్ని తీసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని కాకుండా సాత్వికాహారాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవాలి.
మనం బాంక్‌లో కొంత మొత్తాన్ని వేసుకుని, ఒక పద్ధతి ప్రకారం కొంచెం కొంచెం ఖర్చుపెట్టుకుంటుంటాం. ఖర్చు తగ్గించుకుంటే బాంక్‌లో నిల్వ పెరుగుతుంది. మంచిదే. కానీ ఎక్కువ ఆహారాన్ని తిని శరీరానికి తగ్గ శ్రమ ఇవ్వకపోతే కేలరీలు ఖర్చు కావు. శరీరంలో బరువు పేరుకుపోతుంటుంది. అది అసలు మంచిది కాదు. శరీరం బరువు పెరిగినకొద్దీ అవయవాలమీద భారం ఎక్కువవుతుంది. బాడీమాస్ ఇండెక్స్ ప్రకారం కన్నా ఒక్క పాయింట్ ఎక్కువగా ఉన్నా గుండెకి రోజుకి 200 కి.మీ ఎక్కువ దూరం రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. ఈ భారం బరువు పెరిగేకొద్దీ ఎక్కువవుతుంది. అందుకని శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. వ్యాయామం అందుకు సహకరిస్తుంది.
గతంలో కాయకష్టముండేది. కాయము అంటే శరీరము కదా! ఇప్పుడు శరీరాన్ని ఏం కష్టపెడుతున్నాం. కదలికలు తక్కువైపోయాయి. ఆహారం కూడా మనసుని రకరకాల ఒత్తిళ్ళతో కష్టపెడుతున్నాం. శారీరక శ్రమ పెరగాలి. మానసిక ఒత్తిడి తగ్గాలి. శారీరక శ్రమని పెంచటానికి వ్యాయామం తోడ్పడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, సంగీతం, సారస్వతంలాంటివి తోడ్పడతాయి.
ధూమపానం, మధుసేవనం లాంటి అలవాట్లవల్ల గుండెకి అపకారం జరుగుతుంటుంది. అందుకని అలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలి.
ఇలా జీవితాన్ని మార్చుకోవడంతో మిగతా అవయవాలమీద లాగే గుండెమీదా ఒత్తిడి తగ్గుతుంది.

-డా రవికుమార్ ఆలూరి
గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు
కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638

-డా రవికుమార్ ఆలూరి