సంజీవని

హైపోవాలేమిక్ షాక్.. ప్రాణాంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత సమాజంలో ట్రామాని జబ్బు కింద చూడటం జరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలవారూ దీనికి లోనవుతున్నారు. అనియంత్రిత హేమరేజ్‌వలన మొద్దుబారిన మరియు తీక్షణతో కూడిన ట్రామావలన రోగిలో హైపోవాలీమియాకి (రక్తప్రసరణలో తగ్గుదల) దారితీసి దాని వలన హైపోవాలేమిక్ షాక్ కలుగవచ్చు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
ట్రామా ఉన్నప్పుడు గోల్డెన్ అవర్, అనగా ఎంతో ముఖ్యమైన ‘ఆ గంట’ గురించి మాట్లాడితే ఇది ఆర్ ఆడమ్స్ కౌలీ అనబడే వ్యక్తి వ్యక్తపరచిన పదం. బాల్టిమోర్ షాక్ ట్రామా ఇనిస్టిట్యూట్‌ని స్థాపించిన ఈయన 1957లో మొట్టమొదటిసారిగా ఇలా అన్నారు, ‘‘ప్రమాదం జరిగిన మొదటి గంటలో దొరికే వైద్య సహకారం, కాపాడే ప్రయత్నాలు తీవ్రంగా దెబ్బతిన్న రోగి ప్రాణాలు రక్షించుకోవటంలో కీలకపాత్ర పోషిస్తుంది’’.
హేమరేజ్‌లో రక్తస్రావంవలన గుండెకి సంబంధించిన వ్యవస్థల పనితీరుబాగా దెబ్బతింటాయి. దీనివలన మానవశరీరంలోని ఇతర వ్యవస్థలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఎబిసిడిఇ అనేబడే విధానంతో ప్రణాళికాబద్ధంగా రోగియొక్క పరిస్థితిని అంచనా వేయటం, చికిత్స నిర్వహణ జరుగుతుంది. డిసిఆర్ అనగా డామేజ్ కంట్రోల్ రిసస్టియేషన్ ద్వారా ఆధునిక విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీనిలో భాగంగా ఎబిసిడిఈ కాకుండా సిఎబిసిడిఇ విధానం అమలు చేస్తారు. సి అనగా కాటాస్ట్ఫ్రోక్ బ్లీడింగ్, అనగా తీవ్ర విపత్కరమైన రక్తస్రావం. దీనివలన రక్తప్రసరణ పడిపోతే వచ్చే షాక్స్ తగ్గించవచ్చు. అలాగే రక్తస్కందసన లోపము, అల్పోష్టస్థితి, అసిడోసిస్ పరిస్థితులను కూడా అదుపులో తీసుకురావచ్చు. ఈ తీవ్ర పరిస్థితుల్లో రోగిని కాపాడే ప్రయత్నంలో ఎమర్జెన్సీ రూమ్ (ఇఆర్) చాలా ముఖ్యపాత్ర నిర్వహిస్తుంది. రోగి ముఖంలోని భావాలు మెరుపువేగంలో మారుతూ ఉండటాన్ని ప్రతిక్షణం గమనిస్తూ అత్యంత వేగంతో నిర్ణయాత్మకమైన చికిత్స అందించటం ఎంతో ముఖ్యం. ఈ ముఖ లక్షణాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. వాటికి అంతే వేగంతో స్పందించటంతో ప్రాణరక్షణ ముడిపడి వుంటుంది. రోగియొక్క ఆరోగ్య పరిస్థితిని, అది క్షీణిస్తున్న పరిస్థితుల్లో, లేక రోగి చనిపోయిన పరిస్థితుల్లో, ఆ సమాచారాన్ని అతని కుటుంబానికి చేరవేయటం వైద్య బృందానికి ఎంతో కష్టమైన, ఒత్తిడితో కూడుకున్న పని. ఇది వారి భావోద్వేగాల్ని తీవ్రంగా కలచివేస్తుంది అనటంలో సందేహం లేదు.

-డా.ప్రవీణ్‌కుమార్ కులకర్ణి
డిఎన్‌బి ఇంటర్నల్ మెడిసిన్, సిసిఇబిడిఎం

-డా.ప్రవీణ్‌కుమార్ కులకర్ణి