సంజీవని

ప్రశ్న-జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కొంతమందికి తరచు గొంతు నొప్పివస్తుంటుంది. గొంతు బొంగురుపోతుంటుంది. ఎందుకంటారు?
- గొంతులో మూడు భాగాలున్నాయి. మొదటి భాగం ముక్కు వెనుక ఉంటుంది. దీనినే ‘నాసోఫారింక్స్’ అంటారు. రెండో భాగం ‘ఓరోఫారింక్స్’ నోటి వెనుక ఉంటుంది. నాలిక వెనుకనుంచి ఆహార నాళం వెనుక వరకూ వున్న భాగాన్ని ‘లిరింగో ఫారింక్స్’ అంటారు. లిరింగో ఫారింక్స్ ముందుభాగంలో ఏడమ్స్ ఏపిల్‌లోపల స్వరపేటిక ఉంటుంది. ఈ స్వరపేటికలోని ఓకల్ కార్డ్స్‌కి ఇన్‌ఫెక్షన్ రావచ్చు. అలాగే ధూమపానం ఎక్కువగా చేసే వాళ్లలో ఎక్కువగా మాట్లాడే, అరిచే, ఏడ్చేవాళ్లలో ఓకల్ కార్డ్స్‌లో శాశ్వత మార్పు రావచ్చు. 3, 4 వారాల పాటు గొంతు బొంగురుపోయిందనుకోండి.. ఊరుకోకూడదు! వెంటనే వైద్యుడికి చూపించాలి. కాన్సర్‌లాంటి వాటిని ప్రారంభ దశలో గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చు.
* టాన్సిల్స్‌కి శస్తచ్రికిత్స అవసరమా?
-టాన్సిల్స్ మామూలుగా అందరికీ కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉంటాయి. బాదంకాయ ఆకారంలో మామూలుగా ఇవి రోగ నిరోధానికి తోడుంటాయి. అట్లాంటివి ఇవే రోగగ్రస్తమైతే? వీటికి చీము పడితే అది రక్తనాళాల ద్వారా ఇతర అవయవాలకు సోకే ప్రమాదముంది. టాన్సిల్స్ వాస్తే ఆహారం తినడానికి కష్టమవుతుంది. జ్వరం రావచ్చు. ఇది ఒక రకంగా అంటువ్యాధి. టాన్సిల్స్‌కి చీముపట్టినపుడు విశ్రాంతి తీసుకోవాలి. ఉప్పు నీళ్లతో పుక్కిలించడం ద్వారా శుభ్రం చేసుకుంటుండాలి. జ్వరం తగ్గడానికి మందులు వాడాలి. తరచు టాన్సిల్స్ వ్యాధిగ్రస్తమవుతుంటే శస్త్ర చికిత్సతో తీసివేయించడం మంచిది. 5 నుంచి 50 సంవత్సరాల మధ్యవారికే చికిత్సలో భాగంగా టాన్సిల్స్ తీసివేస్తుంటారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు టాన్సిల్స్ వ్యాధులు రాకుండా కాపాడుతుంటాయి. 50 సంవత్సరాల పైవాళ్ళలో క్షీణించిపోతుంటాయి.
* కొండ నాలుకకూ సమస్యలుంటాయా?
- ఉంటాయి గానీ చాలా తక్కువ. అతి కొద్దిమందిలో కొండ నాలుక పెరగడంవల్ల గొంతులో అడ్డం పడుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ భాగాన్ని శస్తచ్రికిత్సలో తీసివేస్తారు.
* డిఫ్తీరియా అంటే ఏమిటి?
- ఇది చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. చిన్న వయసువాళ్ళకు ఎక్కువగా వస్తుంటుంది. గొంతువాపుతో జ్వరం కూడా వస్తుంటుంది. ఆహారం మింగడం కష్టమవుతుంది. వ్యాధి ముదిరి స్వరపేటికకు సోకగానే గొంతు బొంగురుపోతుంది. ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. టాన్సిల్స్‌కి చీము పట్టి, పైపొర అంగిలిమీద, చిగుళ్లపైన, ఇతరత్రా కూడా ఏర్పడవచ్చు. పిల్లలకు డిపిటి డ్రాప్స్ వేయిస్తే ఈ జబ్బు రాదు.

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్.. 9963555244

-డా మోహన్‌రెడ్డి..