సంజీవని

నాలుకకి కాన్సర్ రావచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావచ్చు. పదునైన పళ్లవల్ల నాలుక తెగుతూంటుంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయక పళ్లని సవరించి, నాలుక తెగకుండా చూసుకోవాలి. ఆ ఒరిపిడి అలాగే ఉంటే నాలుకకి ఆ ప్రాంతంలో కాన్సర్ రావచ్చు. విటమిన్ లోపమున్నా, అడ్డచుట్ట, వక్క, పాన్ మసాలా లాంటి అలవాట్లున్నా నాలుక కాన్సర్ వచ్చే అవకాశముంది.
గొంతుకి కూడా
జలుబు చేస్తుందా?
- వస్తుంది. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసించేవారికి అలాంటి వాతావరణంలో పనిచేసేవారికి, అధికంగా ధూమపానం- మద్యపానం చేసేవారికి, కారం మసాలాలు ఎక్కువగా తినేవారికి గొంతు జలుబు చేయవచ్చు. గొంతు నొప్పి పెట్టడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లుండడం లక్షణాలు. ఆహారం మింగుడు పడడం కష్టమై, పొడి దగ్గు వస్తూ కఫం వస్తుంటుంది. గొంతు ఎర్రబడుతుంది. ఈ వ్యాధి వస్తే బాగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోకపోతే వ్యాధి స్వరపేటికకు, ఊపిరితిత్తులకు పాకే ప్రమాదముంది.