సంజీవని

ఆహార శుభ్ర త లోపిస్తే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిగట విరేచనాలు నేడు చాలామందిని బాధిస్తున్నాయి. మారుతున్న జీవన విధానంతో ఆహారము ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోవడం, తీసుకునే ఆహారములో శుభ్రత లోపించడం, జంక్‌ఫుడ్స్, ఎక్కువగా అలవాటుపడటం వంటి పలు కారణాలతో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
కారణాలు
- పెద్దపేగులు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, కలుషిత ఆహారం
- అమీబియాసిస్ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడటంవలన.
- పెద్ద పేగుల జిగురు పొరల్లో పుండ్లు ఏర్పడటం
- క్రొన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటీస్ వంటి ప్రధాన కారణాలవల్ల జిగట విరేచనాలు అవుతాయ.
లక్షణాలు
- తరచుగా మలవిసర్జన చేయాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది.
- జిగట విరేచనాలతోపాటు, కడుపులో నొప్పి నులిపెట్టినట్లుగా అనిపిస్తుంది.
- ఆహారం తీసుకున్న వెంటనే మలవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుంది.
- మల విసర్జన జిగురుగా, కొన్నిసార్లు రక్తంతో కూడిన జిగురుగా కొన్నిసార్లు వస్తుంది.
- తిన్నది సరిగా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా, పురీషనాళంలో బాధగా ఉంటుంది.
- అధిక నీరసం, క్రమంగా బరువు తగ్గటం జరుగుతుంది.
- తరచు విరేచనాలు జరగటంవల్ల శరీరంలో లవణాల శాతం తగ్గటంవల్ల కొద్దిపాటి జ్వరంతోపాటు రక్తహీనత, పాలిపోయినట్లుగా ఉంటుంది.
- జీవన విధానంలో మార్పు రావడంవల్ల మానసిక ఆందోళన, ఆహారం సహించకపోవడం వంటి లక్షణాలుంటాయి.
జాగ్రత్తలు
- కలుషిత ఆహార పదార్థాలు, చిరుతిండ్లు మానివేయాలి.
- తాగే నీరు కలుషిత రహితమైనదిగా ఉండేటట్లుగా చూసుకోవాలి.
- తీసుకునే ఆహారం ప్రతినిత్యం సమయపాలన ప్రకారంగా తీసుకోవాలి.
- టీ, కాఫీలు, మద్యపానం, ధూమపానం వంటివి మానేయాలి.
చికిత్స
బంక విరేచనాలు వంటి దీర్ఘవ్యాధులు విషయంలో వ్యాధి లక్షణాలతోపాటుగా మానసిక, శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని చికిత్స చేసిన ఎడల వ్యాధి మరలా తిరగబెట్టకుండా ఉండి, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
మందులు
మెర్క్‌కార్: రక్తంతో కూడిన జిగురు ఆగకుండా వస్తూ, ఆసనంలో నొప్పిగా ఉంటుంది. కాళ్లు చేతులూ చల్లగా ఉంటాయి. మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాలనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
మెర్క్‌సాల్: విరేచనాలు జిగటగా ఉండి ఆకుపచ్చగా, నల్లగా ఉంటాయి. ఆసనంలో తీపి తీసినట్లుగా ఉంటుంది. నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంటుంది. మలవిసర్జన బంకతోపాటు రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
కాంథారిస్: మలవిసర్జన జిగురు ఎక్కువగా ఉండి తరుచుగా మూత్రం మంట, మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాలనిపించేవారికి ఈ మందు వాడుకోదగినది.
అర్జెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు.
నక్స్‌వామికా: వీరు మలవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాలనుకుంటారు. ఎన్నిసార్లు మలవిసర్జనకు వెళ్లినా కూడా మరలా వచ్చినట్లుగా ఉంటుంది. వీరు కొన్ని రోజులు విరేచనాలతో, కొన్ని రోజులు మలబద్ధకంతో బాధపడుతుంటారు. మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
యాలోన్: వీరికి పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉండి, విరేచనం ఆపుకోలేనంత వేగంగా వస్తుంది. వీరు బాత్‌రూమ్‌కి వెళ్ళేంతలోపలనే మలవిసర్జన జరిగిపోతుంది. వీరికి మల విసర్జన గ్యాస్‌తోపాటు నీళ్లు నీళ్లుగా అవుతుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్, కార్బొవెజ్, చైనా వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే జిగట విరేచనాల నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646