సంజీవని

మగువల్లో నఢుము నొప్పి ఎందుకంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో చాలామంది మహిళలు నడుము నొప్పితో బాధపడుతున్నారు. పురుషులకంటే స్ర్తిలే ఎక్కువగా నడుము నొప్పితో అవస్త పడుతున్నారు. ఒకప్పుడు మలి వయసులో మాత్రమే కన్పించే నడుము నొప్పి మారిన జీవనశైలివలన ఇపుడు వయసుతో నిమిత్తం లేకుండా యుక్తవయస్కుల్లో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఊడుస్తున్నప్పుడు, ఇల్లు తుడుస్తున్నప్పుడు, వంట పాత్రలు తోముతున్నప్పుడు, ప్రెగ్నెన్సీ (గర్భాన్ని ధరించిన) రోజుల్లో నడుముపై ఎక్కువ భారం పడటంవల్ల నడుము నొప్పి తీవ్రంగా మారుతుంది. నడుము నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.
శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెనె్నముక మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో వుండే డిస్కులే తోడ్పడుతాయి. నడుము ప్రాంతంలో వుండే డిస్కులు అరిగిపోవటంవలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటంవలన నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.
వెన్నుపూసలమధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆర్టియోఫైట్స్ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన తీవ్రమైన నడుమునొప్పితో వేధించబడతారు. ఇలాంటి సమస్యనే ‘లంబార్ స్పాండైలోసిస్’ అంటారు.
నడుము నొప్పికి కారణాలు
స్ర్తిలలో నడుము నొప్పికి కారణం యురినరి ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్
గర్భం ధరించిన రోజుల్లో కాల్షియం, విటమిన్స్ లోపించటం.
స్ర్తిలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావటం.
నిత్యం వంగి పనులు ఎక్కువగా చేయటం
ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసలమధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటం
స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవటం
ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బతినటం లేదా ప్రక్కకు తొలగటం
కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించటం
ఒకే చోట గంటల తరబడి కదలకుండా పని చేయడంవల్ల నడుము నొప్పి వస్తుంది.
మందులు.. సెపియా: మహిళల్లో వచ్చే నడుమునొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. వీరు పీరియడ్స్‌కు ముందు నీరసం, చిరాకు, నడుం దిగువ భాగంలో నొప్పులు, కోపం, అసహనంతో కుంగిపోయి ఉంటారు. ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు వాడుకోదగినది.
ఎస్కులస్ హిప్: నడుము నొప్పిని లేపిన తరువాత ఎక్కువగా వస్తుంది. వంగినప్పుడు అధికంగా ఉంటుంది. నడుము నొప్పి తీవ్రత అనేది ‘నడుము దిగువ చివరి భాగంలో’ ఎక్కువగా వుంటుంది. ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
కాల్కేరియాపాస్: నడుము తరచుగా పట్టివేస్తున్నప్పుడు కాల్షియం శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు ఈ మందును వాడుకొని నడుము నొప్పి సమస్యను నివారించవచ్చు.
బ్రయోనియా: నడుమును కదిలించినా, వంగినా, నడిచినా, నొప్పి అధికమగును. విశ్రాంతివలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదలించకూడదు. కదలికలవలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
హైపరికం: వెన్నుపూసలమధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే నడుమునొప్పికి, అలాగే ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.
ఆర్నికా: పడటంవలన నడుము ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం నడుము నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు. ఈ మందులే కాకుండా రూటా, రస్‌టాక్స్, కాల్కేరియా, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింగ్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయమును పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల మహిళల్లో వచ్చే నడుము నొప్పి నివారించవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646