సంజీవని

మెన్స్సెస్ ముందు టెన్షన్‌కూ మందుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెన్స్సెస్ ముందు సుమారు వారం రోజుల నుంచే విసుగు, కోపం, దిగులు, ఆందోళనలు, అమితమైన కోపం లాంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తుంటాయి. దీనినే వైద్య పరిభాషలో ‘ప్రీమెన్స్ ట్రువల్ టెన్షన్’ (పి.ఎమ్.టి.) అంటారు.
ప్రిమెన్స్‌ట్రువల్ టెన్షన్ అనేది 30 నుంచి 40 సంవత్సరాలున్న వారిలో ఎక్కువగా ఉండి, యుక్త వయస్కులలో అనగా 20నుంచి 30 సంవత్సరాలున్న యువతుల్లో తక్కువగా ఉంటుంది.
కారణాలు:
హార్మోన్ల సమతుల్యత లోపించటం
విటమిన్స్ లోపించుట ముఖ్యంగా బి 6 విటమిన్ తక్కువగా ఉండుట.
రక్తంలో సోడియం, పొటాషియం లవణాలు హెచ్చుతగ్గులు
లక్షణాలు:
శరీరంలో నీరు పేరుకొనిపోయి బరువెక్కడం, కోపం, చిరాకు ఎక్కువగా ఉండి దురుసుగా ప్రవర్తించటం.
మానసికంగా కుంగిపోవుట.
సోమరితనంగా ఉండుట.
స్తనాలు బరువెక్కి బాధించటం, ఒళ్లంతా నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలుంటాయి.
చికిత్స: వ్యక్తుల మానసిక శారీరక లక్షణాలు పరిగణనలోకి తీసుకొని చికిత్స చేసినచో మంచి ఫలితం ఉంటుంది.
మందులు:
సెపియా: స్ర్తిల జననేంద్రియాల బాధలకు ‘సెపియా’ ప్రధానమైనది. పీరియడ్స్‌కు ముందు నీరసం, చిరాకు, నడుం దిగువ భాగంలో నొప్పులు, కోపం, అసహనం, కుంగిపోయినట్లు ఉంటారు. వీరికి జననేంద్రియాలు కిందికి జారుతున్నట్లుగా ఉంటుంది. ఈ లక్షణం వారిలో ప్రత్యేకమైనది. ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు వాడుకోదగినది.
పల్సటిల్లా: ఈ మందు కూడ మహిళలకు ప్రత్యేకమైనది. వీరిలో పీరియడ్స్ వచ్చేముందు బాధలన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. మాట్లాడకపోవడం, కంట తడిపెట్టడం, తలనొప్పి, వికారం వాంతికి వచ్చినట్లుగా అనిపించటం జరుగుతుంది. పీరియడ్స్ వీరికి ముందుగా కొన్నిసార్లు, ఆలస్యంగా కొన్నిసార్లు వస్తుంటారు. వీరు మానసికంగా చంచల స్వభావులు అంతలోనే సంతోషం, అంతలోనే దుఃఖం తేలికగా కంట తడిపెట్టడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇలాంటి వారికి ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
కాల్కేరియాకార్బ్: వీరు చూడటానికి బొద్దుగా, లావుతత్వం గలవారు పీరియడ్స్ వచ్చే ముందు చెమటలు ఎక్కువగా వస్తాయి. ఒళ్ళు చల్లగా ఉంటుంది. వికారం, ఆకలి లేకపోవడం, ఛాతిలో నొప్పి, తాకితే ఓర్చుకోలేకపోవడం, పీరియడ్స్ క్రమంతప్పి రావటం వంటి లక్షణాలున్నవారు ఈ మందు వాడుకోదగినది. ఈ మందులే కాకుండా నైట్రోమోర్, సెబైనా, లేకసిన్, బ్రయోనియా, కాల్కేరియాఫాస్ వంటి మందుల లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన ‘ప్రీమెన్స్ ట్రువల్ టెన్షన్’ (పి.ఎమ్.టి) సమస్యనుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646