సంజీవని

శ్రమ ఎక్కువైతే మూత్ర విసర్జన అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూత్ర పిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న రెండు చిన్న అవయవాలు. ఒక్కో మూత్రపిండం పది సెంటీమీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు వుండి, వెనె్నముక దిగువ భాగంలో రెండు పక్కలా రెండూ వుంటాయి. చివరి రెండు రిబ్స్ మూత్రపిండాలకు రక్షణ కలిగిస్తుంటాయి. ఒక్కో మూత్ర పిండం 140 గ్రాముల బరువు వుంటుంది. దాదాపు మిలియన్ నెఫ్రానులనే వడపోత భాగాలు ఒక్కో మూత్రపిండంలో వుంటాయి. ప్రతీ నిమిషం ఓ లీటర్ రక్తం వాటి ద్వారా ప్రవహిస్తుంటుంది. 24 గంటల్లో ఈ నెఫ్రాన్లు పది లీటర్ల ద్రావకాన్ని వేరుచేస్తుంటుంది. వాటిలోనుంచి చాలా భాగం మూత్రపిండాల నాళాలు తిరిగి గ్రహించగా ఆఖరికి 1 నుంచి రెండు లీటర్ల వ్యర్థ ద్రావకం మాత్రం మూత్రం రూపంలో బయటికి పోతుంటుంది. ఒక గంటలో మూత్ర పిండాలు శరీరంలోని రక్తాన్ని రెండుసార్లు శుద్ధిచేస్తాయి. మూత్రపిండాల గుండా రక్తం అలా ఎప్పుడూ ప్రవహిస్తూ వుంటుంది.
ప్రతీ మూత్రపిండం మధ్యభాగంలోంచి ‘‘యురెట్రార్’’ అనే రక్తనాళం బయల్దేరి యురినరీ బ్లాడర్‌లో కలుస్తాయి. ఈ బ్లాడర్ ‘‘యురెత్రా’’అనే మార్గం ద్వారా బయటికి తెరుచుకుని ఉంటుంది.
తమగుండా ప్రవహించే రక్తంలో యాసిడ్ ఎక్కువ కాకుండా ఆల్కలీ ఎక్కువ కాకుండా చేస్తుంటాయి. మూత్రపిండాలు ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంటాయి. రక్తంలో పొటాషియం, సోడియం క్లోరైడ్, ఇతర పదార్థాలు సమపాళ్లలో ఉండేట్లు చూస్తుంటాయి. అంతేకాదు శరీరంలో నీటి పరిమాణం కూడా సమంగా ఉండేట్లు చూస్తుంటాయి. ఏ ద్రావకాలు ఎక్కువైనా- ఎక్కువైన వాటిని బయటికి పంపేసి, బ్యాలెన్స్‌ని పరిరక్షిస్తుంటుంది. ఎక్కువ తీపిని తింటే మూత్రం ద్వారా చాలా షుగర్ బయటికి పోతూ, డయాబెటిస్ ఉందేమోనన్న అనుమానాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి రక్తంలో ఎక్కువగా ఉన్న షుగర్‌ని మూత్రపిండాలు సేకరించి, బయటకు పంపిస్తాయి.
బయటకు పంపే వ్యర్థ ద్రవాలలో శరీరానికి అవసరమైన పదార్థాలేమైనా వుంటే మూత్ర నాళాలు తిరిగి వాటిని వెనక్కి పంపించేస్తాయి. బయటకు పంపాల్సిన ద్రావకానే్న బయటకు మూత్రం ద్వారా పంపిస్తాయి.
మూత్రాశయం మూత్రంతో నిండగానే మనకు మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. మూత్ర పిండాల పనితీరు పగలుకన్నా రాత్రి తగ్గిపోతుంది. పగలుచేసే పనిలో మూడోవంతు మాత్రమే రాత్రి చేస్తాయి.
మన శరీరంలో పని పెరుగుతున్న ప్రతి అవయవానికి రక్తం ఎక్కువగా వెళుతుంది. మూత్ర పిండాలకి రక్తప్రసరణ ఎక్కువ అయితే మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. పిట్యూటరీ గ్రంథి మూత్రపిండాల పనితీరుని పర్యవేక్షిస్తుంటుంది. తాగితే మూత్రపిండాలు మూత్రాన్ని ఎక్కువగా విసర్జిస్తాయి. సిగరెట్లు ఎక్కువగా తాగేవాళ్లు మూత్రానికి చాలా తక్కువగా వెళ్తారు. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 8 గ్లాసులైనా మంచినీళ్లు తాగడం మంచిది.

-డా.పి.సి.పి.గుప్త. 9848063549

-డా.పి.సి.పి.గుప్త. 9848063549