సంజీవని

సిరల్లో రక్తం గడ్డకడితే అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాదాల దగ్గర నుంచి.. అన్ని భాగాల నుంచి కార్బన్ డైయాక్సైడ్ కూడుకున్న రక్తాన్ని ‘వీన్స్’ గుండె వరకు తెస్తాయి. ఈ రక్తప్రసరణ భూమ్యాకర్షణకు వ్యతిరేకంగా పైకి జరుగుతుంది. అందుకని రక్తం మళ్లీ వెనక్కి జారకుండా ‘వీన్స్’లో కవాటాలుంటాయి ప్రత్యేకంగా.
ఇలా వీన్స్‌లో రక్తం పైకి వెళ్లకుండా ఏ కారణాన్నైనా కాళ్లలో మిగిలిపోతుంటే దానిని ‘వీనస్ ఇన్‌సఫిషియన్సీ’ అంటారు. ఇది చాలా కారణాలవల్ల జరుగుతుంటుంది. ముఖ్య కారణాలు - రక్తం గడ్డలు కట్టడం, వారికోజ్ వీన్స్.
కారణం ఏదనే దాన్నిబట్టి చికిత్స ఉంటుంది. కాకపోతే మీ వైద్యుడు, స్టాకింగ్స్ వేసుకోమని, కొన్ని మందులు వాడమని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో శస్త్ర చికిత్స అవసరమని చెప్పవచ్చు. అవయవాల నుంచి గుండెకు రక్తాన్ని పంపించడంలో వీన్స్ ఇబ్బంది పడుతుంటే ‘వీనస్ ఇన్‌సఫిషియన్సీ’ అనుకున్నాం కదా. ఇలాంటి సందర్భంలో రక్తమంతా గుండెకి చేరక కొంత కాళ్లల్లో మిగిలిపోతుంటుంది.
రక్తం పైకి గుండెకి వెళ్లేటప్పుడు రక్త గడ్డలు అడ్డం వస్తే, దాని వెనుక కొంత రక్తం మిగిలిపోతుంటుంది. అలాగే ‘వారికోజ్ వీన్స్’లో వీన్స్ లోపలి కవాటాలు దెబ్బతిని, రక్తం కొంత వెనక్కి జారిపోతుంటుంది. రక్తాన్ని ముందుకు నెట్టడానికి తోడ్పడే కాళ్ల కండరాలు నీరసించిపోవడం వల్ల రక్తం పైకి సరిగ్గా వెళ్లలేదు. ఇలాగూ ‘వీనస్ ఇన్‌సఫిషియన్సీ’ కలుగవచ్చు.
ఈ ఇబ్బంది మగవాళ్లలోకన్నా ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్ అధ్యయనంలో తేలిందేమిటంటే - ఆడవాళ్లలో 40-49 సంవత్సరాల మధ్య వయసులో మగ వాళ్లలో 70-79 సంవత్సరాల మధ్య ఎక్కువగా వస్తుందని!
ఇంకా రిస్క్ ఫాక్టర్స్ ఏమిటంటే - రక్తపు గడ్డలు, వారికోజ్ వీన్స్ (వీన్స్ ఉబ్బెతె్తై కాలి పిక్కలో పచ్చగా కనిపించడం), ఊబకాయం, గర్భం ధరించినప్పుడు, ధూమపాన సేవనం, కేన్సర్, కాళ్లకి దెబ్బ తగిలో మరో కారణానో కాళ్ల కండరాలు నీరసించిపోవడం, సూపర్ ఫిషియల్ వీన్ వాచడం (ఫెబిటిస్), వంశ చరిత్ర, ఎక్కువసేపు కూర్చున్నా నిల్చున్నా కదలకుండా ఉండటంవల్ల కాళ్ల వీన్స్‌లో రక్తపోటు పెరగడం.
చీల మండలి దగ్గర, కాళ్లవాపు (ఎడిమా), నిల్చున్నప్పుడు కాళ్లలో నొప్పి పెరగడం - కాలు పైకెత్తినప్పుడు తగ్గడం, కాళ్లలో క్రాంప్స్, కాళ్లు బరువుగా ఉండటం, కాళ్లలో దురద, కాళ్లు నీరసించడం, కాలు - మడమ చర్మం మందం కావడం, కాళ్లలో - ముఖ్యంగా మడమ దగ్గర చర్మం రంగుమారడం, కాళ్లలో పుళ్లు, వారికోజ్ వీన్స్ (వీన్స్ వాచడం), పిక్కలు పట్టేసినట్లు కావడం - వీనస్, ఇన్‌సఫిషియన్సీ లక్షణాలు.
ఈ అనారోగ్యాన్ని పసిగట్టడానికి వైద్యుడు కాళ్లని పరీక్షించి, కొన్ని ప్రశ్నలడగడంతోబాటు వీనోగ్రామ్ లేక డుప్లెక్స్ అల్ట్రా సౌండ్ పరీక్షల్ని చేయిస్తారు.
‘వీనోగ్రామ్’లో వైద్యుడు, కాళ్ల వీనస్ రక్తనాళాల కాంట్రాస్ట్‌లోకి, ‘డై’ని ఇంజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఎక్స్‌రేలో రక్తనాళాలు ఒపేక్‌గా కనిపిస్తాయి. వైద్యుడప్పుడు ఇమేజ్‌ని స్పష్టంగా చూడగలడు.
వీన్స్‌లో పైకి రక్తప్రవాహ వేగాన్ని ‘డుప్లెక్స్ అల్ట్రా సౌండ్’లో తెలుసుకుంటాడు. సాంకేతిక నిపుణుడు కాలి చర్మం మీద జెల్ పెట్టి ‘ట్రాన్స్‌డ్యూసర్’ అనే చిన్న పరికరంతో ఒత్తుతాడు. ట్రాన్స్‌డ్యూసర్ ద్వారా కొన్ని వేల్స్ కంప్యూటర్‌లోకి చేరతాయి. అవి రక్తప్రసరణ ఇమేజెస్‌ని చూపిస్తాయి.
వీనస్ ఇన్‌సఫిషియన్స్‌కి చికిత్స చేయడానికి ఈ ఇబ్బంది కలగడానికి కారణం, రోగి ఆరోగ్య స్థితి తెలుసుకోవడంతోపాటు మరి కూన్ని వివరాలు తెలుసుకుంటారు. అవి ఏమిటంటే-
ప్రత్యేక లక్షణాలుంటే వాటిని వయసుని, వ్యాధి తీవ్రత, మందులకు లేక ప్రొసీజర్స్‌కి ఎలా తట్టుకుంటారు లాంటి విషయాల్ని తెలుసుకుంటారు.
ముఖ్యంగా కాళ్లని వొత్తిపెట్టే కంప్రెషన్ స్టాకింగ్స్‌ని వాడమంటారు. వీటివల్ల మోకాలి క్రింది భాగం మడమ మీద గట్టి ఒత్తిడి పెరుగుతుంది. దాంతో పైకి రక్తప్రసరణ మెరుగవుతుంది. కాళ్ల వాపు తగ్గుతుంది. అవసరమైన బలం, పొడవున్న కంప్రెషన్ స్టాకింగ్స్‌ని వైద్యుడు ధరించమంటాడు.
కొన్నిసార్లు కాలిలో వీనస్ రక్తప్రసరణ మెరుగవడానికి - వీలున్నప్పుడల్లా కాలుని తలకన్నా ఎత్తులో ఉంచి పడుకోమంటారు. కంప్రెషన్ స్టాకింగ్స్‌ని వాడమంటారు. కూర్చున్నప్పుడు కాళ్లని క్రాస్ చేయవద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రకరకాల మందులూ ఉన్నాయి. డ్యూరెటిక్స్ వాడమంటారు. శరీరంలోవున్న అదనపు ద్రావకాన్ని మూత్ర పిండాల ద్వారా బయటకు పంపడానికి. రక్తాన్ని పలుచన చేసే యాంటికోయాగ్యులెంట్స్‌ని వాడమంటారు. రక్తప్రసరణని మెరుగుపరిచే పెంటోక్సిఫిల్లిన్ (ట్రెంటాల్)ని వాడమంటారు.
వీనస్ ఇన్‌సఫిషియన్స్ బాగా ఎక్కువగా వుంటే శస్తచ్రికిత్స అవసరం కావచ్చు.
వీన్స్ కవాటాల ఇబ్బంది వుంటే శస్తచ్రికిత్సతో సరిచేయవచ్చు. దెబ్బతిన్న వీన్‌ని తొలగించవచ్చు. వారికోజ్ వీన్స్‌ని ఎండోస్కోపీ ద్వారా శస్తచ్రికిత్సతో సరిచేయవచ్చు. వేరేచోట నుంచి వీన్‌ని తీసుకువచ్చి బైపాస్ సర్జరీ చేయవచ్చు. లేజర్ సర్జరీతో దెబ్బతిన్న వీన్‌ని సరిచేయవచ్చు.
డేకేర్ ప్రాసెస్‌లో -రాత్రి ఉంచకుండా పగలే చికిత్స చేసి పంపేస్తారు. వైద్యడు కాలి మీద కొన్ని ప్రదేశాల్ని గుర్తించి, ఆ ప్రదేశాలలో సన్నగా పొడిచి, సన్నటి వారికోజ్ వీన్స్‌ని తీసివేస్తారు.
స్క్లీరో థెరపీలో దెబ్బతిన్న వీన్‌లోకి ఓ రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి, దాంట్లో రక్తప్రసరణని ఆపివేస్తారు. అప్పుడు ఇతర వీన్స్ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్‌తో కూడుకున్న రక్తం గుండెకి చేరుతుంది. రక్తప్రసరణ లేని దెబ్బతిన్న వీన్ క్రమంగా శరీరంలో కలిసిపోతుంది. సన్నని, మధ్యరకం వీన్‌లని నాశనం చేయడానికి ‘స్ల్కీరో థెరపీ’ చేస్తారు.
పెద్ద వీన్స్‌ని తొలగించడానికి ‘కేథటార్ ప్రొసీజర్’ చేస్తారు. దెబ్బతిన్న వీన్‌లోకి కేథటార్ని పంపి, చివర వేడి చేస్తారు.కేథటార్ని బయటకు తీసివేసేసరికి వేడితో వీన్ మూసుకుపోతుంది.
వీనస్ ఇన్‌సఫిషియన్స్ వంశ చరిత్ర ఉంటే ఒకే భంగిమలో ఎక్కువసేపు నిల్చోకూడదు. కూర్చోకూడదు. ధూమపాన అలవాటు ఉంటే మానివేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

డా.రవికుమార్ ఆలూరి
చీఫ్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్, (కిమ్స్)
98480 24638

డా.రవికుమార్ ఆలూరి