సంజీవని

గుండె పోటుకు ఇదీ కారణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె ఒక పద్ధతిలో ముడుచుకుని తెరచుకోవడంవల్ల రక్తం ద్వారా ఆక్సిజన్, ఆహారం శరీరంలోని అన్ని భాగాలకు వెళ్లి అక్కడకి కార్బన్ డయాక్సైడ్, వ్యర్థాలు వెనక్కి వచ్చి, బయటకు వెళ్లిపోతుంటాయి. గుండె సరిగా ముడుచుకుని తెరుచుకోలేని పరిస్థితులు వస్తే- అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగక ఆక్సిజన్, ఆహారం లభించదు. వ్యర్థాలు వెనక్కి రావు. ఈ ముడుచుకోలేని పరిస్థితి గుండె ఎడమవైపు సంభవిస్తే వెనక్కి వచ్చిన వ్యర్థాలు ఊపిరితిత్తులలో పేరుకుపోతాయి. గుండె కుడి ప్రక్క కండరాలలో లోపం వస్తే ద్రావకాలు కణాలలో మిగిలిపోతాయి. రెండు ప్రక్కలా గుండె కండరాలు దెబ్బతింటే హార్ట్‌ఫెయిల్యూర్ వస్తుంది. హార్ట్‌ఫెయిల్యూర్‌లో శ్వాసించడం కష్టమవుతుంది. వ్యాయామం చేయలేని స్థితి, అలసట, తిల తిరగడం, అయోమయ స్థితి, కడుపులో నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కరొనరి ఆర్టెరి డిసీజ్, హార్ట్ ఎటాక్స్‌వల్ల గుండె కండరాలలో స్కార్స్ రావడం వల్ల అధిక రక్తపోటువల్ల, గుండె కొట్టుకోవడంలో క్రమపద్ధతి లోపించినా, గుండె కవాటాల జబ్బులవల్ల పుట్టుకతో వచ్చే గుండె జబ్బులవల్ల కార్డియో మయోపతివల్లే హార్ట్‌ఫెయిల్యూర్ స్థితి కలగవచ్చు. ఎందుకనంటే వీటన్నింటివల్ల గుండె కండరాలమీద ఎక్కువ భారం పడవచ్చు. మొదట్లో గుండె కండరాలు ఈ అధిక భారాన్ని తట్టుకోగలిగినా, క్రమంగా గుండె కండరాలు దెబ్బతింటాయి. హార్ట్‌ఫెయిల్యూర్‌ని ప్రారంభ దశలో కనుక్కుంటే, దానికి కారణమైన అనారోగ్యాలను సవరించి హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు.