సంజీవని

మీకు మీరే డాక్టర్ - ఎండ తగలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నా వయసు 55. ఎముకలు మెత్తపడిపోయాయని చెప్తున్నారు.. ఇలా ఎందుకు జరుగుతోంది? సలహా చెప్తారా?
-కె.కాత్యాయని, మందడం
జ: లోకంలో మనం ఉచితంగా పొందగలిగేది ఎండ ఒక్కటే! అదీ స్వచ్ఛమైనదేమీ కాదు. ఎండ నిండా అతి నీల లోహిత కిరణాల కల్తీ బాగా ఉంది. పర్యావరణాన్ని నాశనం చేసి, ఈ కల్తీ మనమే చేస్తున్నాం.
సూర్యుడు రాని రోజును ‘దుర్దినం’ అంటారు. శీతల దేశాలలో రోజుల తరబడీ ఎండ రాకపోవటం, వచ్చినా అమితమైన చలి కారణంగా శరీరానికి ఎండ తగిలేలా చేసుకోలేని స్థితి ఉంటుంది. ఎండ తగలకపోతే మనుషులకు దుర్దినాలే! ఉష్ణమండలంలో ఉంటున్న మనకు ఎండ సమృద్ధిగానే ఉంది. సూర్యుడు అందరిమీదా తన కిరణాలను సమానంగానే ప్రసరిస్తున్నాడు. కానీ, ఆధునిక తరహా జీవిత విధానంవలన ఎండలోకి వెళ్ళటం తగ్గిపోయి, ఎక్కువమందిలో డి3 విటమిన్ లోపం ఏర్పడుతోంది. ఎండ తక్కువైతే ఎముకల సమస్యలు కేన్సర్? షుగర్, ఎలెర్జీ వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఎండలో అతిగా తిరిగితే ఎన్ని అనర్థాలున్నాయో, ఎండ తగలకపోయినా అన్ని నష్టాలూ ఉన్నాయి.
పూర్వం రాణివాసపు స్ర్తిలను అసూర్యంపశ్యలనే వాళ్ళు. చేపా చేపా ఎందుకు ఎండలేదూ కథే వీళ్ళది కూడా! పట్టణీకరణం, అపార్ట్‌మెంట్ల సంస్కృతి, ఏసి గదిలోంచి ఏసి ఆఫీసుకి ఏసీ కారులో వెళ్ళటం, ఎండ లేని సమయాల్లో బజారు పనులు చూసుకోవటం.. ఇవన్నీ ఎండకూ మనిషికీ మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నాయి. అందువలన గొప్పింటి వారిలోనే డి విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ వ్యక్తుల్లో ఇది మరీ ఎక్కువ. వాళ్ళు ఎండలోకి పోలేకపోతే, ఎముకలు గోగుపుల్లలౌతాయి. అలాంటి వ్యక్తులు మేడ గది కట్టుకుని శరీరాన్ని తగినంతగా ఎండబెట్టుకోవలసిందే!
ఆస్ట్రేలియాలో ఎండ సరిగా తగలనందువలన మెలనోమా లాంటి కేన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో స్లిప్, స్లోప్, స్లాప్ (స్లిప్ ఆన్ ది షర్ట్, స్లోప్ ఆన్ ది సన్‌స్క్రీన్ అండ్ స్లాప్ ఆన్ ద హాట్) అనే నినాదంతో 1980లో కొన్ని కార్యక్రమాలు రూపొందించారు.
తెల్లవాళ్ళకన్నా నల్లవాళ్ళకు ఎండ ఎక్కువ అవసరం! ఎముకలు శిథిలం కావటం (ఆస్టియోపోరోసిస్) లాంటివి ఎక్కువ మందిలో రావటానికి నగరాల్లో చీకటి గుయ్యారాలుగా కడుతున్న అపార్ట్‌మెంట్లు మొదటి కారణం. పగటి పూట ఏ ఇంట్లో లైటు వేసుకోవాల్సి వస్తోందో ఆ ఇంట్లో వుంటున్న వాళ్ళంతా డి విటమిన్ పరీక్షని, ఆస్టియో పోరోసిస్ పరీక్షని, షుగరు పరీక్షని తప్పనిసిరగా చేయించుకోవాల్సిదే! అలాంటి ఇళ్ళలో ఉండేవాళ్ళు యాభై ఏళ్ళకే డెబ్భై ఏళ్ళ వృద్ధులైపోతారు. రెండు రోజుల కొకసారి కనీసం పది నిమిషాలకైనా ఎండ తగిలితే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది! మయూరుడు సూర్య నమస్కారాలు చేయటం ద్వారా తన బొల్లి వ్యాధిని పోగొట్టుకుని, కృతజ్ఞతగా సూర్యశతకం వ్రాశాడు. సూర్య నమస్కారాలు లేయెండలో చేయవలసినవే! ఎండ తగిల్తేనే శరీరంలో విటమిన్ డి3 తయారౌతుంది. కాల్షియం, ప్రొటీన్లు శరీరానికి వంటబట్టడానికి, ఎముకలో క్యాల్షియం ఫాస్పరస్ పెరగటానికి ఈ విటమిన్ డి3 అవసరం. శరీరాన్ని రోజూ కాసేపు ఎండలో ఉంచండి. తగినంత కాల్షియమ్ అందటానికి, అది శరీరానికి వంటబట్టడానికి ఆయుర్వేద ఔషధాలు ఎక్కువ ప్రయోజనకరంగా వుంటాయి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు