సంజీవని

పొట్టలో పురుగులుంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు చాలామంది పొట్టలో ఏదో ఒక రకమైన క్రిములతో బాధపడుతున్నారు. ఏక కణ జీవులు మొదలుకుని నులి పురుగులు వరకు అనేక రకాలుగా ఉంటాయి. సాధారణంగా చిన్న పిల్లల్లో నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అరుదుగా పెద్దల్లో కూడా కనిపిస్తుంటాయి. కొంతమందిలో నులిపురుగులు పడ్డ తర్వాత ఏళ్ల తరబడి బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే దీర్ఘకాలికంగా కడుపులో పురుగులు ఉన్నపుడు లక్షణాలు ఏవీ కనిపించకపోయినా వాళ్ళకు అవసరమైన కొన్ని పోషకాలు అందకపోవడం ఫలితంగా బలహీనంగా కనిపించడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా వుండేవారిలో ఈ సమస్య ఎక్కువగా చూడవచ్చు.
కారణాలు
- కలుషితమైన ఆహారం తీసుకోవడంవలన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం
- పూర్తిగా ఉడకని మాంసం తినటంవలన
వ్యాప్తి: కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇవి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి.
లక్షణాలు
- మలద్వారం దగ్గర దురదగా ఉంటుంది.
- పళ్ళు రాత్రిపూట కొరుకుతూ వుండటం.
- ఎంత తిన్నా కూడా బరువు పెరగకపోవడం.
- క్రమ క్రమంగా బరువు తగ్గిపోవడం.
- కడుపులో నొప్పి తరచుగా రావడం
- తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం
- మానసికంగా, శారీరకంగా అస్థిమితంగా ఉండటం.
- మలవిస్జరన అనంతరం చూసినట్లయితే చిన్న చిన్నగా పురుగులు అగుపడటం.
- మలద్వారం, యోని మార్గం దగ్గర దురదలు.
- మలబద్ధకం, వికారం, వాంతులు, కడుపులో గ్యాస్ పేరుకున్నట్లు అనిపించడం.
- రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, శరీరమంతా రక్తహీనత ఏర్పడటం.
- శారీరకంగానూ, మానసికంగానూ ఎదుగుదల లోపించడం జరుగుతుంది.
- చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లినట్లు మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
- తలనొప్పి మరియు ఒళ్లు నొప్పులు ఉంటాయ.
జాగ్రత్తలు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. సరిగా ఉడికించిన ఆహారం తీసుకోవడం. ముఖ్యంగా మాంసం బాగా ఉడికిన తరువాత తీసుకోవాలి. పరిశుభ్రమైన నీళ్ళు త్రాగడం. ఆరుబయట మల మూత్ర విసర్జన చేయకుండా ఉండటం, ఇంట్లోకి ఈగలు ఇతర పురుగులు రాకుండా చూడటం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, ఆహారం తీసుకునేముందు చేతులను సబ్బుతో శుభ్రంగా ఉంచుకోవడం. పిల్లలు నోటిలో చేతులు పెట్టుకోవడం, గోళ్ళు కొరకడం లాంటివి చేయనియ్యకపోవడం, బయట చిరుతిండ్లు మానివేయాలి. పురుగులు ఉన్నాయని అనుమానం వచ్చిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
చికిత్స: ఈ వైద్య విధానంలో పరాన్నజీవి కలిగించే లక్షణాలు మరియు రోగి లక్షణాలను, వ్యాప్తిని బట్టి మందులను సెలెక్టు చేసి వాడాలి. మందులు రోగ నిరోధక శక్తిని క్రమబద్దీకరించి మళ్లీ మళ్లీ పురుగులు పునరుత్పత్తి కాకుండా చూస్తుంది.
మందులు
సీనా: చిన్నపిల్లలలో పురుగులు ఉన్నట్టయితే వారిలో చికాకు, మొండితనం, మలద్వారం దగ్గర దురదగా ఉండును. పాలిపోయిన చర్మం, నిద్రలో పళ్లు కొరకడం, కళ్ళ చుట్టు నల్లని వలయాలు, నిద్రలో ఉలికిపడటం, ఆకలి బాగా ఉండి బరువు పెరగకపోవడం, ఆస్‌కారిస్ జాతి పురుగులు ఉన్నపుడు ఈ మందును ఇవ్వాలి. మానసిక స్థాయిలో వీరికి స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
శాంటిస్: గుదము దగ్గర దురద, పుండు, కడుపులో నొప్పి ఉన్నపుడు వాడాలి.
ఫిలిక్స్‌మాన్: బద్దె పురుగులున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. వీరికి కడుపులో నొప్పితోపాటుగా ముక్కు దగ్గరగా దురద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలకు ఫిలిక్స్ మాస్ మంచి మందు.
టుక్రియం మారమ్ వీరమ్: గుదము దగ్గర దురద సాయంత్రం వేళలో ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఉంటుంది. ఆకలి వేళాపాళా లేకుండా ఉంటున్నపుడు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
స్పెజీలియా: పాలిన ముఖం, కళ్లచుట్టు నీలి వలయాలు, కడుపునొప్పి, మూర్ఛ ఉన్నపుడు వాడాలి.
ఈ మందులే కాకుండా ఇంకా సబాడిల్లా, స్టానమ్‌మెట్, కుప్రంమొట్, కాల్కేరియా, నేట్రంఫాస్, సల్ఫర్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల పొట్టలో పురుగుల నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్ 9440229646